సాక్షి, విజయవాడ: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఇస్రోకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
కాగా, పీఎస్‌ఎల్‌వీ-సీ58పై గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పందించారు. ఈ సందర్బంగా రాకెట్ విజయవంతంగా ప్రయోగించినందుకు అభినందనలు చెప్పారు. అమెరికా తర్వాత బ్లాక్ హోల్స్‌ను అధ్యయనం చేయడానికి అబ్జర్వేటరీ ఉపగ్రహాన్ని కలిగి ఉన్న రెండవ దేశంగా భారతదేశం అవతరించడంపై హర్షం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం రోజున మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో భారతదేశ పతాకాన్ని ఎగుర వేసిందన్నారు. పీఎస్‌ఎల్‌వీ-సీ58 విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో మరో శిఖరం చేరింది. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని అని ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి: పీఎస్‌ఎల్‌వీ సీ-58 ప్రయోగం విజయవంతం
Comments
Please login to add a commentAdd a comment