CM Jagan Congratulates AP New Governor Abdul-Nazeer - Sakshi
Sakshi News home page

ఏపీ నూతన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

Published Sun, Feb 12 2023 1:53 PM | Last Updated on Sun, Feb 12 2023 7:06 PM

CM Jagan Congratulates APs New Governor Abdul-Nazeer - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన రిటైర్డ్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.  గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోగమిస్తుందని సీఎం జగన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. జస్టిస్‌ నజీర్‌అనుభవం ప్రజాస్వామ్మాన్ని పరిపుష్టం చేయడంలోనూ,  రాష్ట్రానికి చక్కటి మార్గనిర్దేశం చేయడంలోనూ ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు.

ఇక చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఏపీ గవర్నర్‌గ బిశ్వభూషణ్‌ అందించిన సేవలను కొనియాడారు. రాష్ట్రం ప్రగతి పథంలో పయనించేందుకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ మరువలేని సహకారం అందించారన్నారు సీఎం జగన్‌.

చదవండి: ఏపీ కొత్త గవర్నర్‌గా అబ్దుల్‌ నజీర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement