
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ నూతన గవర్నర్ రిటైర్డ్ జస్టిస్ అబ్దుల్ నజీర్ భేటీ అయ్యారు.. ఆదివారం మధ్యాహ్నం సమయంలో మోదీతో గవర్నర్ నజీర్ సమావేశమయ్యారు.
ఈ క్రమంలోనే భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా నజీర్ కలిశారు. ఈరోజు సాయంత్రం కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు నజీర్. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న(శనివారం) మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కాగా, సాయంత్రం ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌తో భేటీ అయ్యారు. ఏపీకి నూతన గవర్నర్‌గా నియమితులైన సందర్భంలో మర్యాదపూర్వకంగా పలువురు ప్రముఖుల్ని కలుస్తున్నారు నజీర్.
Comments
Please login to add a commentAdd a comment