
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల గవర్నర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాల్లో కూడా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.
ఇక, తెలంగాణలో సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy), మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
