AP Republic Day 2024 Celebrations Updates..
గవర్నర్ ప్రసంగం
- ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత
- ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతీ ఒక్కరి పాత్ర ఉండాలి
- ఐక్యమత్యంగా రాష్ట్రం అభివృద్ధి కోసం అంతా పని చేయాలి
- ఎదురైన అడ్డంకుల్ని అధిగమిస్తూ మన లక్ష్యాల్ని చేరుకోవాలి
- గత కొన్నేళ్లుగా రాష్ట్రం ఒడిదుడుకులను ఎదుర్కొంది
- ఒడిదుడుకుల్లో ధైర్యంగా నిలిచిన ప్రజలందరికీ అభినందనలు
- ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం అంకిత భావంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తోంది
- సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చింది
- ప్రజల సహకారంతో సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది
- కుల, మత, ప్రాంతాలకు అతీతంగా.. రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు
- సంక్షేమ పథకాల్ని నేరుగా ప్రజలకే అందిస్తున్నారు
- 56 నెలలుగా గ్రామస్వరాజ్యం దిశగా సంస్కరణలు
- మారుమూల గ్రామాలకు కూడా సేవలు అందేలా సంస్కరణలు
- రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజనం
- విలేజీ క్లీనిక్స్‌తో గ్రామాల్లోనే ప్రజలకు వైద్యసేవలు
- ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి
- జగనన్న అమ్మఒడితో ప్రతీ పేద విద్యార్థి చదువుకోగలుగుతున్నారు
- జగనన విదేశీ విద్యాదీవెన ద్వారా విదేశాల్లో చదివేందుకు అవకాశం కలుగుతోంది
- ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్‌తో వైద్యం అభినందనీయం
- జగనన్న ఆరోగ్య సురక్ష పథకం సమర్థవంతంగా అమలు
- జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా నాణ్యమైన వైద్యం అందుతోంది
- రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశాం
- గర్బిణులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారం
- సంక్షేమ పథకాలు నేరుగా ఇంటి వద్దకే చేరుకుంటున్నాయి
- పెన్షన్లు, రేషన్ నేరుగా ఇళ్లకే వెళ్లి అందజేత
- ప్రతీనెలా 1వ తేదీనే ఇంటికి వెళ్లి అందించడం అభినందనీయం
- పరిపాలన సంస్కరణల్లో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు
- ప్రతీ ఏడాది స్కూళ్లు తెరవక ముందే విద్యాకానుక అందజేత
- రూ.2,400 విలువైన జగనన్న విద్యాకానుక అందజేత
- ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన
- ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతులు
- స్కూళ్లలో నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి
- గ్రామ, వార్డు సచివాలయాలు నేరుగా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తున్నారు
- ఏపీ సంక్షేమ పాలనకు నా అభినందనలు
- ప్రస్తుత పాలన రానున్న రోజుల్లో మంచి ఫలితం ఇస్తుంది
► శకటాల ప్రదర్శన తిలకిస్తున్న గవర్నర్ నజీర్, ఇతరులు
► ప్రత్యేక ఆకర్షణగా సంక్షేమ శకటాలు
- సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్
- సాయుధ దళాల పరేడ్‌ను సమీక్ష చేసిన గవర్నర్
- పోలీస్, ఇండియన్ ఆర్మీ, ఎన్సీసీ దళాల కవాతు
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంక్షేమ పథకాల శకటాలు
►గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్టేడియంలో పోలీసు , ఇండియన్ ఆర్మీ, ఎన్సీసీ దళాల కవాతు
►ప్రదర్శనకు సిద్ధమైన వివిధ శాఖలకు చెందిన శకటాలు
►పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ నజీర్
►జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
► ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు హాజరైన సీఎం జగన్ దంపతులు, మంత్రులు, అధికారులు
► ఏపీ అసెంబ్లీలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- అసెంబ్లీ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం
- శాసనమండలి ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మండలి చైర్మన్ మోషేన్ రాజు
- గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన స్పీకర్, మండలి ఛైర్మన్
► ఏపీ సచివాలయంలో జెండా ఆవిష్కరణ
- ఏపీ సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
- జెండా ఆవిష్కరించిన ప్రధాన కార్యదర్శి జవహార్‌రెడ్డి
- పాల్గొన్న పలువురు ఉన్నతాధికారులు
► విజయవాడ స్టేడియంలో..
- విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం(IGMC)లో మరికాసేపట్లో దేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు
- జెండా ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరణ
- అనంతరం గవర్నర్ ప్రసంగం
► రాజ్‌భవన్‌లో హైటీ కార్యక్రమం
- రిపబ్లిక్ డే సందర్భంగా సాయంత్రం రాజ్‌భవన్‌లో హై టీ కార్యక్రమం
- హాజరుకానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్
- పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment