గుంటూరు, సాక్షి: విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీకి భారీ మెజార్టీ ఉందని.. అయినా టీడీపీ పోటీకి వెళ్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి విశాఖ నేతలతో తన క్యాంప్ కార్యాలయంలో భేటీ అయిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీకి భారీ మెజార్టీ ఉంది. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ పోటీ పెట్టకూడదు. కానీ చంద్రబాబు ఏరోజూ నైతిక విలువలు పాటించే వ్యక్తి కాదు. అందుకే బరిలో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. పైగా.. అడ్డగోలుగా ప్రలోభాలు, బెదిరింపులతో గెలవడానికి ప్రయత్నిస్తారు. కుయుక్తులు, కుట్రలు అనేవి చంద్రబాబు నైజం అని జగన్ ఆక్షేపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఉన్నిక జరగబోతోందని.. అందుకే పార్టీలో అందరు నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
అనంతరం.. ఒక్కొక్కరి నుంచి జగన్ అభిప్రాయాలు తెలుసుకున్నారు. అందరి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించారాయన. అనంతరం.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలన్నారు. సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని.. అధికార పార్టీ నుంచి బెదిరింపులు ఉంటాయని.. వాటిని థీటుగా ఎదుర్కొనేలా అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment