సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ దూసుకుపోతోంది. జీవీఎంసీ కార్పొరేటర్లతో ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ కౌన్సిలర్లతో సమవేశమయ్యారు. నేటితో ఉమ్మడి విశాఖ జిల్లాలో మొదటి విడత ప్రచారం పూర్తి కానుంది. అభ్యర్థి ఎవరనేది కూటమి నేతలు తేల్చుకోలేకపోతున్నారు. అభ్యర్థి ఎంపికపై బేధాభిప్రాయాలు కారణంగా కూటమి నాయకులు తర్జనభజన పడుతున్నారు.
కార్పొరేటర్ల సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, 12వ తేదీన నామినేషన్ వేస్తున్నానని.. ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 30వ తేదీ తర్వాత తమ వ్యూహం ఏంటో మీకు అర్థమవుతుందని బొత్స అన్నారు.
మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ తమకు బలం ఉంది కాబట్టే పోటీ చేస్తున్నామని.. బొత్స గెలిస్తే కౌన్సిల్‌లో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. బలం లేకపోయినా ప్రలోభాలతో కూటమి నేతలు గెలవాలని చూస్తున్నారు. టీడీపీకి బలం లేకపోయినా.. బలం ఉందని ప్రచారం చేస్తున్నారు. వైస్రాయ్ కాలం నాటి రాజకీయాలు ఇప్పుడు చెల్లవు’’ అంటూ కన్నబాబు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment