MLA QUOTA
-
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం
-
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నేటితో(గురువారం) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థ/ల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగీవ్రమైంది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే ఉండగా, వీరిపై పోటీకి ఎవరూ సిద్ధం కాలేదు. దాంతో ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ లకు ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించగా, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యంలు అభ్యర్థులుగా ఉన్నారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా ఒక సీటును సీపీఐకి ఇచ్చింది కాంగ్రెస్. రెండు స్థానాలను సీపీఐ అడిగినప్పటికీ ఒక స్థానమే సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్. వీరి మధ్య గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొత్తు కుదిరింది. దాంతో సీపీఐకి ఎమ్మెల్సీ స్థానం కేటాయించక తప్పలేదు. అయితే ఉపసంహరణ గడువు ముగియడంతో అధికారిక ప్రకటన వెలువడింది. ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలు అందించారు. -
ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం సోమవారం నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఐదు స్థానాలకు గాను ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. సభలో ఉన్న బలాబలాలను బట్టి మూడు అధికార కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్ఎస్కు దక్కడం ఖాయం కాగా, మిగిలిన ఐదో స్థానంలో గెలిచేందుకు ఈ అవకాశం లేదు.ఈ నేపథ్యంలో ఒకవేళ బీఆర్ఎస్ రెండో అభ్యరి్థని నిలబెడితే ఎన్నిక నిర్వహించాల్సి వచ్చేది. కానీ ఆ పార్టీ నుంచి కేవలం ఒక్క అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈనెల 12న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ప్రక్రియలు జరగనున్నాయి. నిబంధనల ప్రకారం ఉపసంహరణల ప్రక్రియ ముగిసేసరికి ఉన్న నామినేషన్లను పరిగణనలోకి తీసుకుంటారు.ఉపసంహరణల సమయం ముగియగానే ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు మాత్రమే మిగిలితే అందరు అభ్యర్థులు ఏక్రగీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటిస్తారు. మొత్తం మీద పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితులు లేకపోవడంతో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలావుండగా..మరో ప్రధాన పార్టీ ఎంఐఎం కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంది. -
సామాజిక కోణంలోనే ఎంపిక!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం సామాజిక సమీకరణాల తూకం పాటించింది. రెడ్డి, మైనార్టీ కోటాలో కూడా పలు పేర్లను పరిశీలించినప్పటికీ భవిష్యత్తులో చేపట్టాల్సిన మంత్రివర్గ విస్తరణ, పార్టీ కార్యవర్గ కూర్పు, ఇతర నామినేటెడ్ పదవులకు ఎంపికలను పరిగణనలోకి తీసుకుని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఇద్దరు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం.ఢిల్లీలో చక్రం తిప్పిన విజయశాంతిఈసారి ఎమ్మెల్సీగా మహిళకు అవకాశమివ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఎస్టీ కోటాలో మహిళను ఎంపిక చేయాలని తొలుత భావించింది. కానీ అనూహ్యంగా మహిళా కోటాలో సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి తెరపైకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో విజయశాంతి ఎక్కడా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో కనిపించకపోవడం గమనార్హం. ఆమె రెండు రోజుల క్రితమే ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. మహిళ, బీసీ కోటాలో తనకు చాన్స్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు.పార్టీ కూడా ఆమె పట్ల సానుకూలంగా స్పందించడంతో.. పేరు ఖరారైందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాష్ట్ర కేబినెట్లో ఈసారి ఎస్టీ (లంబాడా) సామాజిక వర్గానికి అవకాశం కల్పించలేని పరిస్థితులున్న నేపథ్యంలో.. ఆ వర్గానికి ఎమ్మెల్సీగా అవకాశమివ్వాలని ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలు భావించారు. ఈ కోటాలో కొందరి పేర్లు పరిశీలించారు. అయితే మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి చొరవతో ఆయన సన్నిహితుడు, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కె.శంకర్‌నాయక్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఆయన చేస్తున్న సేవలను కూడా అధిష్టానం గుర్తించినట్లయింది.మరోవైపు మొదటి నుంచీ ఊహిస్తున్న విధంగానే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి ఉన్నా.. అప్పటి పరిస్థితుల మేరకు తన స్థానాన్ని త్యాగం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఆయన పేరును పరిశీలించినా చివరి నిమిషంలో ఆగిపోయింది. ఎస్సీ (మాల) సామాజికవర్గానికి చెందిన ఆయనను ఈసారి మండలికి పంపాలని పార్టీ నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడైన అద్దంకి దయాకర్‌కు అవకాశం కల్పించడం ద్వారా రేవంత్ మాటకు కూడా అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. ఓసీ కోటా మినహాయింపుఈ దఫా ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఓసీ కోటాను కాంగ్రెస్ అధిష్టానం మినహాయించింది. ఇద్దరు ఓసీ నేతల మధ్య తీవ్ర పోటీ ఏర్పడటంతోనే ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఓసీ కోటాలో ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పేరు వినిపించింది. ఆయన పేరును సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారని, కచ్చితంగా అవకాశం వస్తుందనే ప్రచారం జరిగింది. మరోవైపు శాసనమండలిలో కాంగ్రెస్‌పక్ష నేత టి.జీవన్‌రెడ్డి పదవీకాలం త్వరలో ముగుస్తోంది. ఈ క్రమంలో ఆయనను మళ్లీ మండలికి ఎంపిక చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌లోని ముగ్గురు సీనియర్ మంత్రులు పట్టుబట్టినట్టు తెలిసింది.ఈ ఇద్దరు నేతల మధ్య ఏర్పడిన పోటీ కారణంగానే అధిష్టానం ఈసారి ఓసీ కోటాను మినహాయించిందని, ఇందుకు ప్రతిగా కేబినెట్ విస్తరణలో రెండు బెర్తులు ఓసీలకు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. జీవన్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోవడంతో మండలిలో కాంగ్రెస్‌పక్ష నేతగా కొత్త వారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇక బీసీల కోటాలో అనేక పేర్లు వినిపించినప్పటికీ చివరకు సినీనటి విజయశాంతి వైపు అధిష్టానం మొగ్గు చూపడం అనూహ్య పరిణామం. పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ కూడా ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికే ఎమ్మెల్సీ అవకాశం దక్కేలా తన వంతు ప్రయత్నం చేశారు.ఎంఐఎంకు స్థానిక సంస్థల కోటాఅసెంబ్లీ ఎన్నికలకు ముందు సీపీఐతో అధికారికంగా పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ.. సీపీఐకి రెండు ఎమ్మెల్సీ స్థా నాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పు డు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మరోవైపు తమ సభ్యుడు రియాజుల్ హసన్ ఎమ్మెల్సీగా పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో.. తమకు ఇప్పుడే అవకాశమివ్వాలని ఎంఐఎం నేతలు కాంగ్రెస్ పార్టీని కోరారు. కానీ సీపీఐకి ఇవ్వాల్సి వస్తున్నందున ఈసారికి సర్దుకోవాలని.. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా లో అవకాశం ఇస్తామని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. -
ఎన్నిక ఏకగ్రీవమే!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఎన్నిక జరిగే ఐదు స్థానాల్లో కాంగ్రెస్ మూడు, సీపీఐ, బీఆర్ఎస్ చెరో స్థానాన్ని దక్కించుకోనున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా అధికార కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌లను అభ్యర్థులుగా ప్రకటించడంతోపాటు మరో స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకి కేటాయించింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరు ఖరారైంది. సీపీఐ తరఫున నెల్లికంటి సత్యం బరిలో ఉన్నారు.ఐదుగురు రిటైర్ అవుతుండటంతో.. ప్రస్తుతం శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఉన్న సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్‌ల పదవీకాలం ఈ నెల 29న ముగుస్తోంది. ఖాళీ అవుతున్న ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక కోసం ఈ నెల 3న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారంతో ఈ గడువు ముగుస్తోంది. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు ఉంది. ఎన్నిక అనివార్యమయ్యే పక్షంలో ఈ నెల 20న పోలింగ్ జరుగుతుంది. కానీ ఖాళీ అవుతున్న ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే బరిలోకి దిగుతుండటంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విజయశాంతికి ఎమ్మెల్సీ చాన్స్⇒ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసిన ఏఐసీసీ⇒ శంకర్‌నాయక్, అద్దంకి దయాకర్లకూ అవకాశం⇒ ఆదివారం సాయంత్రం ప్రకటించిన కేసీ వేణుగోపాల్సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఏఐసీసీ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. రాష్ట్ర నేతల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు, పార్టీలో పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ముగ్గురు నేతలు అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్‌నాయక్, విజయశాంతిలకు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. ఎవరూ ఊహించని విధంగా సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి పేరును ఎంపిక చేయడం మాత్రం టీపీసీసీ వర్గాలను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.నాలుగు స్థానాలకుగాను.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై వారం రోజులుగా సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు ఏఐసీసీ పెద్దలతో చర్చలు జరిపారు. ఎమ్మెల్యే కోటా కింద కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశం ఉండగా.. సీపీఐకి ఒక స్థానం కేటాయించడంపై విస్తృతస్థాయిలో చర్చలు జరిగాయి. ఎన్నికల ముందు పొత్తులో భాగంగా తమకు ఇచ్చిన హామీ మేరకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్‌ను సీపీఐ జాతీయ కమిటీ బలంగా కోరింది. సీపీఐ జాతీయ నేత డి.రాజా, మరికొందరు నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఈ అంశంపై మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేందుకు ఏఐసీసీ, టీపీసీసీ నిర్ణయం తీసుకున్నాయి. మిగతా మూడు స్థానాలకుగాను విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌లను ఎంపిక చేశారు.నేడు ఉదయం 11 తర్వాత నామినేషన్లుసాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఏఐసీసీ ప్రకటించిన ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు సోమవారం ఉదయం 11 గంటల తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తారని సీఎల్పీ వర్గాలు వెల్లడించాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లతోపాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ మేరకు సోమవారం అందుబాటులో ఉన్న వారంతా రావాలని సీఎల్పీ నుంచి పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. -
TG: ఊహించని విధంగా విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు పూర్తయింది. కొద్ది సేపటి క్రితమే ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖారారు చేసింది. ఎవరూ ఊహించని విధంగా పార్టీ అధిష్టానం విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్, కెతావత్ శంకర్ నాయక్‌కు టికెట్లు ఇచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. సీపీఐ నుంచి ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించింది.తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.అయితే, చివరి నిమిషంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లేకపోవడంతో తెలంగాణ నేతల ఢిల్లీ పర్యటన రద్దయ్యింది. అయినప్పటికీ రాష్ట్ర అగ్రనేతలతో కేసీ వేణుగోపాల్ ఫోన్లో మంతనాలు జరిపారు. ముగ్గురు అభ్యర్థుల ఎంపికను ఖరారు చేయడంతో ఉత్కంఠతకు తెరపడింది. మరోవైపు ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్‌లో భారీ పోటీ నెలకొంది. తమకు అవకాశం కల్పించాలంటూ ఆశావహులు పెద్ద ఎత్తున లాబియింగ్‌లు జరిపారు. చివరికి పార్టీ అధిష్టానం విజయశాంతి, అద్దంకి దయాకర్, కెతావత్ శంకర్ నాయక్ పేర్లను ఫైనల్ చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బరిలో ఓసీ కేటగిరి నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కుమార్ రావు, కుసుమ కుమార్ పేర్లు బలంగా వినిపించాయి. వీరితో పాటు బీసీ కేటగిరి నుండి ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జెర్పేటి జైపాల్, గాలి అనిల్, ఎస్సీ కేటగిరి నుండి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్, ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్, బానోతు విజయాభాయి, రేఖా నాయక్ పేర్లు వినిపించాయి. -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లపై కాంగ్రెస్ సూత్రప్రాయ నిర్ణయం
-
4 స్థానాలు.. 40 మంది పోటీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలాఖరు నాటికి ఎన్నికలు జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో హడావుడి మొదలైంది. మార్చి 29 నాటికి ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. పార్టీల బలాబలాలను బట్టి వీటిలో నాలుగు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు, ఒకటి బీఆర్ఎస్కు దక్కే అవకాశముంది. ఎమ్మెల్యే కోటాలోనే తమకు ఎమ్మెల్సీ ఇవ్వాలని ఎంఐఎం అడిగితే మాత్రం కాంగ్రెస్‌కు మూడు మాత్రమే దక్కుతాయి.కానీ, తమకు ఈసారి నాలుగు స్థానాలు వస్తాయని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు ఒక్కో స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. బీసీ నేతలు తమ వర్గానికి రెండు సీట్లు ఇస్తారనే ఆశతో ఉన్నారు. దీంతో బీసీ వర్గాల్లో ఎమ్మెల్సీ కోసం పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. మొత్తంగా నాలుగు సీట్ల కోసం 40 మంది వరకు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఆశావహుల్లో కొందరు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిరాగా, మరికొందరు కొత్త ఇన్చార్జ్ని కలిసి ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా!ఈసారి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అయితే ఒక్కో సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున పేర్లు వినిపిస్తున్నాయి. ఓసీల నుంచి టి. జీవన్‌రెడ్డి, టి. జగ్గారెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, సామ రామ్మోహన్‌రెడ్డి, పారిజాతా నర్సింహారెడ్డి, హరివర్ధన్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు, అల్గుబెల్లి ప్రవీణ్‌రెడ్డి, నర్సారెడ్డి భూపతిరెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎస్సీల కోటాలో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తోపాటు అద్దంకి దయాకర్, సింగాపురం ఇందిర, కొండ్రు పుష్పలీల, పిడమర్తి రవి, దొమ్మాట సాంబయ్య, రాచమళ్ల సిద్ధేశ్వర్, దర్శన్, జ్ఞానసుందర్, భీంభరత్‌ల పేర్లపై చర్చ జరుగుతోంది.మైనార్టీల నుంచి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, మహ్మద్ అజారుద్దీన్, అజ్మతుల్లా హుస్సేనీల పేర్లు వినిపిస్తున్నాయి. బీసీ వర్గాల నుంచి మధుయాష్కీగౌడ్, ఎగ్గె మల్లేశం, ఈరావత్రి అనిల్, చరణ్‌కౌశిక్ యాదవ్, సునీతా ముదిరాజ్, నీలం మధు, వజ్రేశ్‌యాదవ్, చెవిటి వెంకన్న, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, పున్నా కైలాశ్‌నేత, నవీన్ యాదవ్ పేర్లు ప్రధానంగా చర్చలో ఉన్నాయి. -
రాజ్యసభ అభ్యర్థిగా నేడు సింఘ్వి నామినేషన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటా రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో తన నామినేషన్ పత్రాలను రిటరి్నంగ్ అధికారికి అందజేస్తారని, ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా ఆదివారం సాయంత్రం నానక్‌రామ్‌గూడలోని షెరటాన్ హోటల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎలీ్ప) సమావేశంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సింఘ్విని రేవంత్ పరిచయం చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించారు. సింఘ్వి వాదనలతో రాష్ట్రానికి ప్రయోజనం: సీఎం సీఎల్పీ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్విని ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పునరి్వభజన చట్టం అమలులో అనేక రాజ్యాంగ, న్యాయ చిక్కులు, అవాంతరాలు ఉత్పన్నమయ్యాయని, ఈ చట్టంలోని అంశాలపై చట్టసభలతో పాటు సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. అపరిష్కృత అంశాలపై వాదించేందుకు వీలుగా న్యాయ కోవిదుడు సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కోరామని చెప్పారు. తన రాజ్యసభ సభ్యత్వానికి పెద్ద మనసుతో రాజీనామా చేసిన కేకే క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా వ్యవహరించారని ప్రశంసించారు. త్వరలోనే రైతు కృతజ్ఞత సభ త్వరలోనే రైతు కృతజ్ఞత సభ ఉంటుందని సీఎం చెప్పారు. సీఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మా ట్లాడారు. ఈనెల 20న రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నా వీలు కాలేదని చెప్పారు. రైతు కృతజ్ఞత సభ,రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంపై త్వరలో ఢిల్లీ పెద్దలతో మాట్లాడి తేదీలు వెల్లడిస్తామని అన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..దేశంలోని ప్రముఖ న్యాయవాదుల్లో సింఘ్వి ఒకరని, ఆయన రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ హక్కులపై మాట్లాడుతూనే ఉంటా: సింఘ్విసింఘ్వి మాట్లాడుతూ తనను తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఏఐసీసీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల విషయంలో తాను మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. శంషాబాద్‌లో ఘన స్వాగతంసింఘ్వి ఆదివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సింఘ్వి అక్కడి నుంచి నేరుగా మాజీ ఎంపీ కె.కేశవరావు నివాసానికి వెళ్లారు. అక్కడ కొద్దిసేపు ఉన్న సింఘ్వి ఆ తర్వాత సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ సింఘ్విని కలిసి కర్మన్‌ఘాట్ హనుమాన్ ప్రసాదాన్ని అందజేశారు. తర్వాత సింఘ్వి ప్రజాభవన్‌కు వచ్చారు. సింఘ్వి దంపతులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన సింఘ్వి ఆయనతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.మహిళా సాధికారతే లక్ష్యం: సీఎం రేవంత్సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల సాధికా రతతో పాటు వారిని కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ మహిళలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఏపీలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 12న ఉప ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీతో పాటు కర్ణాటక, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని ఒక్కో స్థానానికి మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జూలై 12న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. వీటిలో మూడు స్థానాలకు ఎమ్మెల్సీల రాజీనామా కారణంగా, రెండు స్థానాలకు అనర్హత వేటు కారణంగా ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది.ఏపీలో సి.రామచంద్రయ్యపై అనర్హత వేటు పడగా, షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఇద్దరి పదవీకాలం 2027 మార్చి 29 వరకు ఉంది. ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. -
AP: ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఈనెల ఆఖరుకు ఖాళీ అవుతున్న ఏడు ఎంఎల్ఏ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సంయుక్త కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా, శాసన మండలి సభ్యులు చల్లా భగీరధ్ రెడ్డి పదవీ కాలం గత నవంబరు 2వ తేదీతో పూర్తి కాగా, ప్రస్తుత సభ్యులు నారా లోకేశ్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద రావు, వరాహ వెంకట సూర్యనారాయణ రాజు పెనుమత్స, గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం ఈనెల 29తో ముగియనుంది. ఈ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖాళీల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గతనెల 27వతేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. దీంతో, సోమవారం ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రకటనను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఎంఎల్ఏ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎన్నికకు సంబంధించి ఫారమ్-1 ద్వారా ఎన్నికల ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసే అభ్యర్ధులు స్వయంగా లేదా వారి ప్రతిపాదకుడి ద్వారా అయినా వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభా భవనంలో రిటర్నింగ్ అధికారి వద్ద లేదా సహాయ రిటర్నింగ్ అధికారి, శాసన మండలి ఉపకార్యదర్శికి వారి నామినేషన్లను సమర్పించవచ్చని సుబ్బారెడ్డి తెలిపారు. ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నాం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలను పైన పేర్కొన్న స్థలం, సమయాల్లో పొందవచ్చని వివరించారు. ఈ నెల 14వతేదీన ఉదయం 11గంటలకు అసెంబ్లీ భవనంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుందని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈనెల 16వతేది మధ్యాహ్నం 3గంటల వరకూ నామినేష్ల ఉసంహరణకు గడువు ఉంటుందన్నారు. ఆ గడువులోగా ఎవరైనా అభ్యర్ధులు వారి నామినేష్లనను ఉపసంహరించుకోవచ్చునని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 23వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ అసెంబ్లీలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పూర్తైన వెంటనే అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
చివరి వరకు ఎదురుచూపులే!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగియనుంది. కాగా సోమవారం అర్ధరాత్రి వరకు టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల కాకపోవడంతో ఆశావహులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మంగళవారం ఉదయం ఈ జాబితా అధికారికంగా వెలువడుతుందని పార్టీ వర్గాల సమాచారం. వాస్తవానికి ఈ జాబితా సోమవారమే వెలువడుతుందని భావించినా అర్ధరాత్రి వరకు స్పష్టత రాలేదు. ప్రగతి భవన్ పిలుపు కోసం.. పార్టీ నేతల్లో ఒకపక్క ఉత్కంఠ కొనసాగుతుండగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. సోమవారం శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కల్లపల్లి రవీందర్‌రావుతో ఫోన్లో మాట్లాడి అభినందించినట్లు తెలిసింది. మిగతా నాలుగు స్థానాలకు సంబంధించి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్లు ఖరారైనట్లు సోమవారం ఉదయం ప్రచారం జరిగినా పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పార్టీ అధినేత నుంచి పిలుపు వస్తుందనే ఉద్దేశంతో కడియం శ్రీహరి, మధుసూధనాచారి వంటి నేతలు హైదరాబాద్‌లో మకాం వేశారు. ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్న నాగార్జునసాగర్ నియోజకవర్గం నేత ఎంసీ కోటిరెడ్డికి కూడా అందుబాటులో ఉండాల్సిందిగా పార్టీ పరంగా సమాచారం అందినట్లు తెలిసింది. మరోవైపు ఎర్రోళ్ల శ్రీనివాస్ సోమవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసినట్లు సమాచారం. గవర్నర్ కోటాలో గతంలో నామినేట్ అయిన పాడి కౌశిక్‌రెడ్డి కూడా తన అభ్యర్థిత్వానికి ఎలాంటి ఢోకా లేదనే ధీమాతో ఉన్నారు. పద్మశాలి సామాజికవర్గం కోటాలో చోటు దక్కుతుందని భావించిన ఎల్.రమణ కూడా ప్రగతిభవన్ నుంచి పిలుపు వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. మున్నూరు కాపు సామాజికవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు ఖరారైనా, ఇతర స్థానాలకు సంబంధించి ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉన్నందున జాబితా విడుదలలో ఆలస్యం జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆచితూచి వ్యవహరిస్తున్న అధినేత గవర్నర్ కోటాలో గతంలో నామినేట్ చేసిన పాడి కౌశిక్‌రెడ్డికి బదులుగా గుత్తా సుఖేందర్ రెడ్డిని ఖరారు చేస్తారని భావించినా, కేసీఆర్ ఆయనను ఎమ్మెల్యే కోటాలోనే మండలికి పంపేందుకు మొగ్గు చూపినట్లు తెలిసింది. ఆరు స్థానాల్లో రెడ్లు, బీసీలకు రెండేసి స్థానాలు, వెలమ, ఎస్సీలకు ఒకటి చొప్పున ఇవ్వాలని కేసీఆర్ భావించారు. అయితే సామాజికవర్గాలు, కులాల వారీగా లెక్కలపై కసరత్తు పూర్తి కాకపోవడంతో అభ్యర్థుల జాబితా విడుదలలో ఆలస్యం జరుగుతోంది. ఎస్సీ కోటాలో కడియం శ్రీహరి, ఎర్రోళ్ల శ్రీనివాస్ నడుమ తీవ్ర పోటీ నెలకొనడంతో బీసీ సామాజికవర్గం నుంచి అభ్యర్థుల ఎంపిక క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. బీసీలకు కనీసం రెండు స్థానాలు అందులో ఒకటి ఖచ్చితంగా మున్నూరుకాపు కులానికి చెందిన వారికి ఇవ్వాల్సి ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే అభ్యర్థులు ఎవరైనా నామినేషన్ల దాఖలుకు స్వల్ప సమయమే ఉండటంతో పార్టీ ఇప్పటికే ప్రతిపాదకులుగా వ్యవహరించే ఎమ్మెల్యేల సంతకాలను తీసుకుని నామినేషన్ పత్రాలను సిద్ధం చేసింది. ఇదిలా ఉంటే మంగళవారం నుంచి స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతోంది. ఈ కోటా అభ్యర్థులను కూడా మంగళవారమే ప్రకటించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది. -
ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్ధం..!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ఎమ్మెల్యే కోటాలోని ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. ఈ మేరకు అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. ఈ జాబితాను ఆదివారం విడుదల చేయనున్నారు. మరోవైపు నామినేషన్ల దాఖలు గడువు ఈ నెల 16న ముగియనుంది. దీంతో ఎంపికైన అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేస్తారు. ఒక్కో అభ్యర్థికి మద్దతుగా కనీసం పదిమంది ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ పత్రాలపై వారి పేర్లను ప్రతిపాదిస్తూ సంతకాలు చేసేందుకు అందుబాటులో ఉండాల్సిందిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో నియోజకవర్గాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు శాసనమండలి స్థానికసంస్థల కోటాలో ఖాళీ అవుతున్న 12 సీట్లకు వచ్చేనెల 10న పోలింగ్ జరగనుంది. ఈ నెల 16 నుంచి 23 వరకు స్థానికసంస్థల కోటా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుండగా, ఈ నెల 22న టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న గవర్నర్ కోటాస్థానానికి ఈ ఏడాది ఆగస్టు 2న పాడి కౌశిక్‌రెడ్డి పేరును ప్రతిపాదించినా పోలీసు కేసులను కారణాలుగా చూపుతూ గవర్నర్ ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే కేబినెట్ భేటీలో కౌశిక్ స్థానంలో మరొకరి పేరును ప్రతిపాదించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటా కసరత్తు కొలిక్కి... 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో టీఆర్ఎస్కు 103 మంది సభ్యుల బలం ఉంది. పార్టీ మిత్రపక్షం ఎంఐఎంకు కూడా ఏడుగురు సభ్యులు ఉండటంతో 110 మంది ఎమ్మెల్యేల మద్దతుతో టీఆర్ఎస్ ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సామాజిక సమీకరణాలు, జిల్లాలవారీగా ఎమ్మెల్సీల లెక్కలను వేసుకుని అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే కోటా ఆరుస్థానాల్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు కూడా పరిశీలించినా, వచ్చే సాధారణ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ నుంచి ఆయనను పోటీ చేయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఎస్టీ సామాజికవర్గం నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తే మాజీ ఎంపీ సీతారాం నాయక్, గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ ధరావత్ గాంధీనాయక్ ఆశావహులుగా ఉన్నారు. ప్రస్తుతం మండలిలో మంత్రి సత్యవతి రాథోడ్ ఒక్కరే ఎస్టీ సామాజికవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీసీ సామాజికవర్గానికి ప్రాధాన్యత బీసీ సామాజిక వర్గానికి రెండు లేదా మూడు స్థానాలను ఇవ్వాలనే ఉద్దేశంతో ఎల్.రమణ, మధుసూదనాచారితోపాటు మరో ఐదు పేర్లు ప్రధానంగా పరిశీలించినట్లు తెలిసింది. మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ విప్ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ జాబితాలో ఉన్నారు. మండలి పట్టభద్రుల ఎన్నిక సమయంలో హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్‌నగర్ స్థానం నుంచి అవకాశం ఆశించిన పీఎల్ శ్రీనివాస్ పేరు కూడా బీసీ కోటాలో పరిశీలనలో ఉంది. నేతి విద్యాసాగర్, ఆకుల లలిత పదవీకాలం పూర్తి కావడంతో మున్నూరుకాపు సామాజికవర్గానికి శాసనమండలిలో ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఆకుల లలిత, పీఎల్ శ్రీనివాస్‌లో ఒకరికి అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. వెలమ సామాజికవర్గం నుంచి తక్కళ్లపల్లి రవీందర్రావు పేరు దాదాపు ఖాయం కాగా, రెడ్డి సామాజికవర్గంలో ఇద్దరికి అవకాశం దక్కనుంది. గవర్నర్ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డి స్థానంలో మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నామినేట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఎమ్మెల్యే కోటాలో ఎంసీ కోటిరెడ్డి, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఆశావహుల జాబితాలో ఉండగా, ఇద్దరికి అవకాశం దక్కనుంది. 22న స్థానిక సంస్థల కోటా జాబితా శాసనమండలి స్థానిక సంస్థల కోటాలో 12 సీట్లకుగాను ఈ నెల 16 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించాల్సి ఉండగా, ఈ నెల 22న అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌తోపాటు రెండేసి స్థానాలున్న కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల సిట్టింగ్ ఎమ్మెల్సీల్లో ఒకరిద్దరికి మళ్లీ అవకాశం దక్కడం అనుమానమే. భానుప్రసాద్ (కరీంనగర్), పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), దామోదర్‌రెడ్డి (మహబూబ్‌నగర్) తిరిగి స్థానిక సంస్థల కోటాలో పోటీకి విముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేందర్‌రెడ్డి, భానుప్రసాద్ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతుండగా, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ఎమ్మెల్యే కోటా అభ్యర్థిత్వంపై ఆసక్తి చూపుతున్నారు. ఆయన స్థానంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా ఎంపికయ్యే అవకాశం ఉంది. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), తేరా చిన్నపరెడ్డి (నల్లగొండ), కల్వకుంట్ల కవిత(నిజామాబాద్), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్), శంభీపూర్ రాజు (రంగారెడ్డి), వి.భూపాల్‌రెడ్డి (మెదక్) పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం. -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పాలవలస విక్రాంత్(శ్రీకాకుళం), ఇషాక్ బాషా(కర్నూలు), డీసీ గోవిందరెడ్డి(కడప)లను వైఎస్సార్సీపీ ఖరారు చేసింది. ఈ మేరకు అభ్యర్థులను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. చదవండి: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు -
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూలు విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన మొత్తం మూడు స్థానాలకు నవంబరు 29న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుందని వెల్లడించింది. రాష్ట్రంలో దేవశాని చిన్న గోవిందరెడ్డి, మహ్మద్ అహ్మద్ షరీఫ్, సోము వీర్రాజుల పదవీ కాలం 2021 మే 31న ముగియడంతో ఎన్నిక జరగనుంది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో పరిస్థితులు చక్కబడ్డ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని మే 13, 2021న ఈసీఐ ప్రకటించిన విషయం విదితమే. తెలంగాణలో ఆరు స్థానాలకు.. మరోవైపు.. తెలంగాణలో కూడా అదేరోజు ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఆకుల లలిత, మహమ్మద్ ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల పదవీ కాలం 2021 జూన్ 3న ముగిసింది. ఎన్నికల షెడ్యూలు ఇలా.. నోటిఫికేషన్ : నవంబరు 9 నామినేషన్ల దాఖలుకు గడువు : నవంబరు 16 నామినేషన్ల పరిశీలన : నవంబరు 17 ఉపసంహరణకు గడువు : నవంబరు 22 పోలింగ్ : నవంబరు 22 (ఉ.9 నుంచి సా.4 వరకు) ఓట్ల లెక్కింపు : నవంబరు 29 చదవండి: (ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండంటూ సీఎం కేసీఆర్‌కు లేఖ.. నిరుద్యోగి ఆత్మహత్య) -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై కరోనా ఎఫెక్ట్
-
ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. పోటీలో ఆయనొక్కడే ఉండడంతో.. ఎన్నిక ఏకగ్రీవంగా అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ మేరకు నవీన్‌రావుకు ఎన్నిక ధ్రువపత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి అందచేశారు. ప్రకటన అనంతరం గన్‌పార్క్ వద్దగల అమరుల స్తూపానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మహమూద్ అలీ పాల్గొని.. అయనకు అభినందనలు తెలిపారు. కాగా తెలంగాణ అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్‌కు సభ్యులు తక్కువగా ఉండడంతో పోటీకి దూరంగా ఉన్నారు. అధికార టీఆర్ఎస్కు సంపూర్ణమైన మెజార్టీ ఉండడంతో ఎన్నిక జరగకుండానే ఏకగ్రీవంగా ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి, నవీన్‌రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక ఖాళీ ఏర్పడటంతో నవీన్‌రావును ఎంపిక చేశారు. త్వరలో ఖాళీ కానున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గుత్తాకు అవకాశం ఇస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్‌రావు
సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్‌రావు పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి, నవీన్‌రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక ఖాళీ ఏర్పడటంతో నవీన్‌రావును ఎంపిక చేశారు. త్వరలో ఖాళీ కానున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గుత్తాకు అవకాశం ఇస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు. కాగా, మంగళవారం ఉదయం 11 గంటలకు నవీన్‌రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
కాంగ్రెస్ ‘ఎమ్మెల్సీ’ బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ తరఫున గూడూరు నారాయణరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నప్పటికీ టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, పార్టీ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్కలు సోమవారం ప్రక టించారు. సంఖ్యాపరంగా తమకు ఒక స్థానం దక్కే అవకాశం ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేస్తూ పార్టీ ఫిరాయింపులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు మంగళవారం జరిగే పోలింగ్‌కు దూరం గా ఉండాలని, ఎవరూ ఓటేయొద్దని భట్టి విక్రమార్క విప్ జారీ చేశారు. మరోవైపు పార్టీ ఫిరాయింపులపై న్యాయస్థానాలను ఆశ్రయించాలని కూడా కాంగ్రెస్ నిర్ణయించింది. సీఎం తీరుపై హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయాలని నిర్ణయించింది. ఆ ఐదుగురు ఏం చేస్తారు? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోలింగ్‌ను బహిష్కరించాలని కాంగ్రెస్ విప్ జారీ చేసిన నేపథ్యంలో.. టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయిన ఆ ఐదుగురు ఎమ్మె ల్యేలు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తు తం కాంగ్రెస్ పక్షాన ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూస్తే.. మిగిలిన ఎమ్మెల్యేలు పోలింగ్‌లో పాల్గొన్నా, పాల్గొనకపోయినా ఫలితంలో మార్పు ఉండదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి వస్తున్న ఎమ్మెల్యేలు ఓటేయకపోయినా ఐదుగురు అధికార పక్ష ఎమ్మెల్యేల విజయం దాదాపు ఖాయమే. ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియానాయక్‌లు కేసీఆర్ బాటలో పయనిస్తామని తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి మాత్రం ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రకటించిన వారు కూడా అధికారికంగా టీఆర్ఎస్లో చేరలేదు. దీంతో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరనున్న ఎమ్మెల్యేలు ఓటేసిన పక్షంలో కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించినట్టవుతుంది. తద్వారా చట్టపరమైన చర్యలకు ఊతమిచ్చినట్టవుతుంది. దీంతో ఈ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు రాకపోవచ్చనే తెలుస్తోంది. కానీ, కేసీఆర్ తన∙బలాన్ని చాటు కునేందుకు, ఆసక్తికర నిర్ణయాలు తీసుకునేందుకు ముందు వరుసలో ఉంటారనేది బహిరంగ రహస్య మే. దీంతో తన పక్షానికి వస్తున్నట్టు ప్రకటించిన వారిని కూడా పోలింగ్‌లో పాల్గొనాలని ఆదేశాలిచ్చి నా ఆశ్చర్యం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దీనిపై టీఆర్ఎస్లోకి వెళ్తున్నట్టు ప్రకటించిన ఓ ఎమ్మెల్యే ‘సాక్షి’తో మాట్లాడు తూ.. ఇప్పటివరకు తమకు ఎలాంటి ఆదేశాలు లేవని, కేసీఆర్ నిర్ణయం మేరకు నడుచుకుంటామని, అవసరమైతే పోలింగ్‌లో పాల్గొనేందుకు కూడా వెనుకాడేది లేదని చెప్పడం గమనార్హం. -
ఐదో అభ్యర్థిని నిలపడం అక్రమాలకు తెరతీయడమే
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే బలం లేకున్నా టీఆర్ఎస్ ఐదో అభ్యర్థిని బరిలో దింప డం అక్రమాలకు తెరతీయడమేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అనైతిక ప్రయత్నాలకు అధికార పార్టీ పాల్పడకుండా ఉంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమింపబడిన చల్లా నర్సింహారెడ్డి శనివారం గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉత్తమ్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేల కోటాలో గూడూరు నారాయణరెడ్డి, పట్టభద్రుల స్థానంనుంచి జీవన్‌రెడ్డిల విజయం ఖాయమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ గెలిచినా తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ విజయంకోసం కాంగ్రెస్ కార్యకర్తలు శ్రమించాలన్నారు. నేడు కాంగ్రెస్ పట్టభద్రుల ఎన్నికల సమీక్ష హాజరు కానున్న ఉత్తమ్, భట్టి సాక్షి, హైదరాబాద్: కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గాన్ని దక్కించుకునేందుకు గాను కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమీక్షలు నిర్వహించడంతో పాటు పార్లమెంటరీ స్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆదివారం మంచిర్యాలలో సమావేశం నిర్వహించనుంది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ, బ్లాక్, మం డల కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్కలు హాజరై పట్టభద్రులు,రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థిగా గూడూరు నామినేషన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ అభ్యర్థిగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ ఖరారు చేయడంతో గురువారం మధ్యాహ్నం నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, పోదెం వీరయ్య, ఆత్రం సక్కు, జాజుల సురేం దర్ పాల్గొన్నారు. అంతకుముందు గూడూరు పేరు ఖరారులో జాప్యం జరిగింది. గురువారం ఉదయమే ఆయన పేరు ప్రకటిస్తారని అనుకున్నా మధ్యాహ్నం వరకు ఢిల్లీ నుంచి సమాచారం రాలేదు. చివరకు ఒంటి గంట ప్రాంతంలో అధికారిక సమాచారం రావడంతో 1:30కి గూడూరు అసెంబ్లీకి చేరుకున్నారు. 2:55కి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం ఏడు నామినేషన్లు... టీఆర్ఎస్ నుంచి మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, యెగ్గె మల్లేశం, శేరి సుభాశ్‌రెడ్డి, ఎంఐఎం నుంచి మీర్జా అలీ హసన్ ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయగా గురువారం గూడూరుతోపాటు జాజుల భాస్కర్ అనే వ్యక్తి కూడా నామినేషన్ వేయడంతో మొత్తం నామినేషన్ల సంఖ్య ఏడుకు చేరింది. నేడు స్క్రూటినీ... ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లను శుక్రవారం పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని ఆమోదించనున్నారు. ఈ నెల 5 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉం డటంతో ఆలోగా ఎవరూ నామినేషన్లు ఉపసంహరించకపోతే 12న పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌం టింగ్ కూడా ఉంటుంది. కాగా, తనపై నమ్మకం ఉం చి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానానికి గూడూరు కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ దాఖలు అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తన అభ్యర్థిత్వం ఖరారులో సహకరించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, భట్టి విక్రమార్క, కుంతియా తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. -
రసవత్తరంగా ఎమ్మెల్సీ పోరు
సాక్షి, హైదరాబాద్: ఊహించినట్టుగానే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీలను మండలికి పంపే ఈ ఎన్నికలో.. అధికార టీఆర్ఎస్ పక్షం ఐదుగురు అభ్యర్థులను పోటీలో నిలపగా (ఎంఐఎంతో కలిపి), కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థిని బరిలోకి దింపడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో తమ ఐదుగురు అభ్యర్థులను గెలిపించుకునేందుకు టీఆర్ఎస్, టీడీపీ సభ్యులను కలుపుకుంటే గెలిచే బలం ఉన్న కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నాయన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. లెక్కల ప్రకారం చూస్తే టీఆర్ఎస్ పక్షం 4, కాంగ్రెస్ ఒకటి (టీడీపీ మద్దతిస్తే) గెలిచే అవకాశాలుండగా, అధికార పక్షం ఐదో అభ్యర్థిని బరిలోకి దించడంతో రాజకీయంగా రాష్ట్రంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. మూడింటిలో ఏది జరిగినా? ప్రస్తుతం శాసనసభకు ఎంపికైన 119 మంది ఎమ్మెల్యేలు, నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిస్తే 120 మందికి ఈ ఎన్నికల్లో ఓటు హక్కుంటుంది. పార్టీల వారీగా బలాబలాలను చూస్తే టీఆర్ఎస్కు 88 మంది, ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒక నామినేటెడ్ సభ్యుడు, ఏడుగురు ఎంఐఎం సభ్యులు కలిపి అధికార టీఆర్ఎస్ పక్షాన 98 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌కు 19 మంది, టీడీపీకి ఇద్దరు, బీజేపీకి ఒక సభ్యుడున్నారు. ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే 20 ఓట్లు అవసరం. కాంగ్రెస్ 19 మందితో పాటు టీడీపీ నుంచి ఒకరు లేదా ఇద్దరు ఓట్లేస్తే కాంగ్రెస్ అభ్యర్థి గూడూ రు నారాయణరెడ్డి సునాయాసంగా విజయం సాధిస్తారు. కానీ, ఐదుగురు అభ్యర్థులను బరిలో దింపిన అధికార పక్షం ఇంత సునాయాసంగా కాంగ్రెస్‌కు ఓ ఎమ్మెల్సీ సీటును ఇస్తుందా అన్నదే చర్చనీయాం శంమైంది. టీఆర్ఎస్ పక్షాన బరిలో ఉన్న ఐదుగురిలో నలుగురు అభ్యర్థులకు 20 చొప్పున ఓట్లు పడితే ఐదో అభ్యర్థికి 18 ఓట్లు మాత్రమే మిగులుతాయి. అంటే మరో 2 ఓట్లు వస్తే కానీ ఆ అభ్యర్థి గెలవడం సాధ్యం కాదు. రెండు ప్లాన్లతో పద్మవ్యూహం దీనిలో భాగంగానే టీఆర్ఎస్ ప్లాన్–ఏ, ప్లాన్–బీలను తయారు చేసుకుంటోంది. ప్లాన్–ఏలో నలుగురు అభ్యర్థులకు 20 ఓట్లు చొప్పున వేయించి, ఐదో అభ్యర్థికి అదనంగా అవసరమయ్యే 2 ఓట్లను కాంగ్రెస్ లేదా టీడీపీల నుంచి పొందాలనే ప్రణాళికలో ఉంది. ఇతర పార్టీల నుంచి ఓట్లు తెచ్చుకున్నామనే పేరు రాకుండా ప్లాన్–బీ గురించి కూడా కేసీఆర్ యోచిస్తున్నారు. ప్లాన్–బీలో భాగంగా అధికార పక్షం నుంచి బరిలో ఉన్న ఐదుగురు అభ్యర్థుల్లో ముగ్గురికి మాత్ర మే నేరుగా గెలుపునకు అవసరమయ్యే 20 ఓట్లు వేయిస్తారు. మిగిలిన ఇద్దరికీ 19 ఓట్లు చొప్పున వేయిస్తారు. ఒకవేళ కాంగ్రెస్ నుంచి రావాల్సిన 21 ఓట్లలో 2 ఓట్లు రాకపోయినా (సభ్యులు గైర్హాజరయి నా), రెండు ఓట్లు చెల్లకపోయినా కాంగ్రెస్ అభ్యర్థికి కూడా 19 ఓట్లు మాత్రమే వస్తాయి. అప్పుడు అనివార్యంగా రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వస్తే అధికార పక్షం నుంచి ఉన్న ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోవడం సులభం. ఈ 2 ప్లాన్లలో దేన్ని ఎంచుకుంటారు? నేరుగా ఇతర పార్టీల ఓట్లు తెచ్చుకుంటారా? లేక ప్లాన్–బీలో భాగంగా సాంకేతికంగా విజయం సాధించేలా ప్రణాళిక రూపొందిస్తారా? అసలు సీఎం కేసీఆర్ మదిలో ఏముంది?ఆయన ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారనేది ఇప్పుడు అన్ని వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అంతా సజావుగా సాగితేనే! ఇక 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు టీడీపీ సభ్యులు పొల్లుపోకుండా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తేనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ గెలుపు సాధ్యమవుతుంది. దీనికో సం కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేల ఓట్లు జారిపోకుండా ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించాలని భావిస్తోంది. టీడీపీ మద్దతు కోసం ఢిల్లీ పెద్దల ద్వారా చంద్రబాబు సహకారం తీసుకో వాలని నిర్ణయించింది. ఈ విషయంపై టీపీసీసీ ముఖ్యనేత ఒకరు మాట్లాడుతూ ‘అధికార పక్షం ఐదుగురు అభ్యర్థులను నిలబెట్టినా మా సభ్యులపై ఉన్న నమ్మకంతోనే పోటీకి దిగాం. బరిలో నిలిచాక ఏ రాజకీయ పార్టీ కూడా ఓటమిని అంగీకరించదు. ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే. ఇప్పుడు మేం కూడా గెలవబోతున్నాం. మా సభ్యులపై మాకు ఆ నమ్మకం ఉంది. అందరూ మాతో టచ్‌లోనే ఉన్నారు. అందరితో మాట్లాడిన తర్వాతే ఎమ్మెల్సీ బరిలో ఉండాలని నిర్ణయించాం. ఒకవేళ జరగరానిది జరిగినా.. నీళ్లకు నీళ్లు, పాలకు పాలు ఈ ఎన్నికలతో తేలిపోతాయి’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ముగ్గురు గైర్హాజరయితేనే.. ఈ ఎన్నికల్లో అధికార పక్షం గెలవాలంటే క్రాస్ ఓటింగ్ అయినా జరగాలి లేదంటే ముగ్గురు ప్రతిపక్ష సభ్యులు గైర్హాజరు కావాలి. లేదా.. కాంగ్రెస్ అభ్యర్థికి పడే మూడు ఓట్లు చెల్లకుండా పోవాలి. ఈ మూడింటిలో ఏది జరిగినా ద్వితీయ ప్రాధాన్యత ఓటుతో అధికార పక్షం సునాయాసంగా గెలిచే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాజాసింగ్ గైర్హాజరీకి మాత్రమే అవకాశం ఉంది. ఆయన ఓటు వేయకుండా, టీడీపీకి చెందిన ఇద్దరు ఓటింగ్‌కు దూరంగా ఉన్నా టీఆర్ఎస్ గెలుపు ఖాయమే. అలా కాకుండా ఆయన కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి, టీడీపీకి చెందిన ఇద్దరు గైర్హాజరయినా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు వచ్చిన ఇబ్బందేం ఉండదు. అప్పుడు కాంగ్రెస్‌కు చెందిన 19 మంది సభ్యులు తమ పార్టీ అభ్యర్థికి చెల్లిన ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ అందరు సభ్యులు హాజరయి కాంగ్రెస్ అభ్యర్థికి పడాల్సిన ఓట్లలో రెండు లేదా మూడు ఓట్లు చెల్లకపోయినా ద్వితీయ ప్రాధాన్యత ఓటు ద్వారా టీఆర్ఎస్ పక్ష అభ్యర్థులంతా విజయం సాధిస్తారు. ఓటు విలువ నిర్ధారిస్తారిలా.. ఎమ్మెల్యే కోటాలో ఈ దఫా ఐదుగురు సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది. అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 120. అంటే 120 ఓట్లున్నాయి. ఎమ్మెల్యే కోటాలో వేసే ప్రతి ఓటు 100తో సమానం. 120 ఓట్లు 12,000తో సమానం. దీనిని మొత్తం ఖాళీలకు (5) అదనంగా మరొకటి కలిపి 6తో భాగి స్తారు. అలా చేస్తే 2,000 వస్తుంది. దీనికి 1 కలుపుతారు. అప్పుడు 2,001 అవుతుంది. దీన్ని డెసిమల్స్‌లో లెక్కిస్తే 20.01 అవుతుంది. అది 20తో సమానం. అంటే ఒక్క ఎమ్మెల్సీ గెలవడానికి 20 ఓట్లు రావాలన్న మాట. సభ్యులు గైర్హాజరైతే! 120 మంది ఓట్లు వేస్తే ఒక్కో అభ్యర్థి గెలుపుకోసం 20 మొదటి ప్రాధాన్యత ఓట్లు రావాల్సి ఉంటుంది. ఒక సభ్యుడు గైర్హాజరు అయితే అసెంబ్లీ సభ్యుల సంఖ్య 119 అవుతుంది. దీన్ని 100తో హెచ్చించి ఆరుతో భాగిస్తే 1983 అవుతుంది. దానికి ఒకటి కలిపితే 1984. దాన్ని డెసిమల్స్‌లో తీసుకుంటే 19.84 అవుతుంది. ఇది 20తో సమానమే. అంటే అప్పుడు కూడా 20 ఓట్లు కావాలి. ఇలా ఎంత మంది సభ్యులు గైర్హాజరు అయితే ఒక్కో అభ్యర్థి గెలవడానికి కావాల్సిన మొదటి ప్రాధాన్యత ఓట్ల సంఖ్య అంత తగ్గిపోతుంది. రెండో ప్రాధాన్యతకు వెళ్తే.. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవకుండా రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వస్తే.. అప్పుడు ఒక్కో ఓటు విలువ 100తో సమానం కాదు. 100లో కొంత భాగం కింద తీసుకుని వాటిని లెక్కిస్తారు. ఇక మూడో ప్రాధాన్యతకు వెళ్లాల్సి వస్తే కనుక ఆ భాగం మరింతగా తగ్గిపోతూ వస్తుంది. అలా ప్రాధాన్యత సంఖ్య పెరిగిన కొద్దీ ఎమ్మెల్యేల ఓటు విలువ 100లో కొంత భాగం తగ్గిపోతూ ఉంటుంది. చెల్లకుండా పోతాయిలా.. ఓటు వేసే విషయంలో కూడా సభ్యులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తాము ఏ ప్రాధాన్యత కింద ఏ అభ్యర్థికి ఓటు వేయాలనుకుంటున్నామో ఆ నంబర్‌ను మాత్రమే ఆ అభ్యర్థి పేరుకు ఎదురుగా వేయాల్సి ఉంటుంది. టిక్ పెట్టకూడదు. రోమన్ నంబర్లు వేయకూడదు. ఈ రెండింటిలో ఏది జరిగినా ఓటు చెల్లకుండా పోతుంది. అప్పుడు గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. -
కాంగ్రెస్ ‘ఎమ్మెల్సీ’ ఎంపిక కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ని సిఫారసు చేసేందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 9 మంది సీనియర్ ఎమ్మెల్యేలతో దీన్ని ఏర్పాటు చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, పొదెం వీరయ్య, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్యలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని, ఈ నెల 25న వారు సమావేశమై ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని సిఫారసు చేస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ కమిటీ ఎమ్మెల్సీ ఆశావహుల పేర్లను పరిశీలించిన అనంతరం 2 లేదా 3 పేర్లను ప్రదేశ్ ఎన్నికల కమిటీ సిఫారసు చేస్తుందని పార్టీ నేతలంటున్నారు. ఈనెల 26న జరగనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ)లో ఈ పేర్లను పరిశీలించి అధిష్టానానికి ప్రతిపాదిస్తారని, ఆమోదం వచ్చాక ఈనెల 27 లేదా 28 తేదీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం. టీపీసీసీ కోశాధికారి గూడూరుకు చాన్సిస్తారా? ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై కాంగ్రెస్ పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు రిటైర్ అవుతున్న షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతో పాటు మాజీ మంత్రి మర్రిశశిధర్‌రెడ్డి ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. షబ్బీర్, పొంగులేటిలకు ఇప్పటికే రెండుసార్లు అధిష్టానం అవకాశమిచ్చింది. దీంతో పాటు ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇచ్చినా మరొకరిని విస్మరించారనే అభిప్రాయం వస్తుంది. అధిష్టానం కూడా కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నందున ఈ ఇద్దరినీ పక్కనపెట్టినట్టేననే చర్చ జరుగుతోంది. మర్రి శశిధర్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీగా పనిచేయాలనే ఆలోచనలో ఉన్నా గతంలో ఆయన నిర్వహించిన పదవులను బట్టి ఎమ్మెల్సీగా ఆయన్ను ఎంపిక చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. యూపీఏ హయాంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ వైస్ చైర్మన్‌గా కేంద్ర మంత్రి హోదాలో పనిచేసిన ఆయన్ను ఎమ్మెల్సీకి పరిమితం చేయడం మంచిది కాదనే భావనలో పార్టీ వర్గాలున్నట్టు సమాచారం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారం వస్తే శశిధర్‌రెడ్డిని జాతీయ స్థాయిలో ఉపయోగించుకో వాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోం ది. జాతీయ స్థాయిలో ఏదైనా పెద్ద హోదా లేదంటే ఏదైనా రాష్ట్రం నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపుతారని సమాచారం. దీంతో టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఏపీలో పార్టీ కోశాధికారులుగా పనిచేసిన చేబ్రోలు హనుమయ్య, సుబ్బిరామిరెడ్డి, విఠల్‌రావు, రాయపాటి సాంబశివరావు, ఆదికేశవులు నాయుడుతో సహా అందరికీ చట్టసభల్లో ప్రాతిని« ద్యం వహించే అవకాశం వచ్చింది. దీంతో ఈసారి టీపీసీసీ కోశాధికారి హోదాలో గూడూరుని ఎంపిక చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలంటున్నా యి. చాలా కాలంగా పార్టీకి అన్ని విధాలుగా ఉపయోగపడుతున్న గూడూరు పేరును పరి శీలనలోకి తీసుకుందని, స్థానిక నేతలతో ఉన్న సత్సంబం ధాలు, గులాం నబీ ఆజాద్, సుశీల్‌కుమార్‌షిండే లాంటి నేతలతో ఉన్న చొరవ కూడా ఆయనకు కలి సి రానుందనే చర్చ జరుగుతోంది. ఇటీవలి అసెం బ్లీ ఎన్నికల్లో కూడా అన్ని విధాలుగా పార్టీ విజయం కోసం శ్రమించి రాహుల్ దృష్టిలో పడిన గూడూరు ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. -
టీఆర్ఎస్లో ఎమ్మెల్సీకి పోటాపోటీ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో అధికార పార్టీలో ఎమ్మెల్సీ పదవుల పంపకంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న మహమూద్ అలీ (టీఆర్ఎస్), మహమ్మ ద్ సలీం (టీఆర్ఎస్), తిరువరంగరం సంతోష్ కుమార్ (టీఆర్ఎస్), మహమ్మద్ షబ్బీర్ అలీ (కాంగ్రెస్), పొంగులేటి సుధాకర్‌రెడ్డి (కాంగ్రె స్) పదవీకాలం మార్చి ఆఖరుతో ముగియనుంది. మార్చి 12న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. నామినే షన్ల దాఖలు ప్రక్రియ ముగిసే ఫిబ్రవరి 28 లోపే అభ్యర్థులను ఖరారు చేయాలి. నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి అసెంబ్లీలో 120 మంది సభ్యులు ఉన్నారు. 5 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండటంతో ఒక్కో స్థానానికి 24 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. అసెంబ్లీలో ప్రస్తుత బలాల ప్రకారం అన్ని స్థానాలూ టీఆర్ఎస్కే వచ్చే అవకాశముంది. టీఆర్ఎస్కు 90, కాంగ్రె స్ 19, ఎంఐఎం 7, టీడీపీ 2, బీజేపీ 1 చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసినా ఒక్క స్థానాన్ని గెలుచుకోలేదు. దీంతో ఎన్నికలు జరగనున్న 5 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకో నుంది. హోంమంత్రి మహమూద్ అలీకి మరోసారి అవకాశం అనివార్యం కానుంది. ఇతర పార్టీల్లో ఎమ్మెల్సీలుగా ఉండి టీఆర్ఎస్లో చేరిన అందరికీ సీఎం కేసీఆర్ మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇదే ప్రాతిపదికన మహమ్మద్ సలీంకు కూడా ఈసారీ అవకాశం దక్కనుంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన సంతోష్ కుమార్‌కు మరోసారి అవకాశం ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. వాటిపైనే ఆశలు.. షబ్బీర్ అలీ, పొంగులేటి సీట్లపైనే టీఆర్ఎస్లోని ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మండలి చైర్మన్ స్వామిగౌడ్ పదవీకాలం మార్చి ఆఖరుతో ముగియనుంది. పట్టభద్రుల నియోజకవర్గంలో మరోసారి పోటీ చేసేందుకు స్వామిగౌడ్ సుముఖంగా లేరు. ఎమ్మెల్యే కోటా లో అవకాశం వస్తుందని భావిస్తున్నారు. కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తక్కళ్లపల్లి రవీందర్రావు, సత్యవతిరాథోడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేర్లను ఈ స్థానాల కోసం పరిశీలిస్తున్నారు. త్వరలో మరో రెండింటికి.. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానంలో విజయం సాధించిన మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్సీ పదవికి రాజీ నామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముం దు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన యాదవరెడ్డిపై అనర్హత వేటు పడింది. దీంతో ఈ 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన షెడ్యూల్లో ఈ స్థానాలను పేర్కొనలేదు. త్వరలో ఈ రెండు స్థానాలకు మరోసారి నోటిఫికేషన్ జారీ చేయనుంది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో మూడు ఎమ్మెల్సీ (ఎమ్మెల్యే కోటా) స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. టీఆర్ఎస్ అభ్యర్థులు వి.గంగాధర్‌గౌడ్, మైనంపల్లి హనుమంతరావు, ఎలిమినేటి కృష్ణారెడ్డిలు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ రాజాసదారాం ప్రకటించారు. ఈ ముగ్గురికీ ఎన్నిక ధ్రువీకరణపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి నాయిని, పలువురు ఎమ్మెల్యేలు హాజరై ఎమ్మెల్సీలకు అభినందనలు తెలిపారు. -
టీడీపీ 'ఎమ్మెల్యే కోటా' ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
-
టీడీపీ 'ఎమ్మెల్యే కోటా' ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
- లోకేశ్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించిన పార్టీ - కరణం బలరాం, డొక్కా మాణిక్యలకూ ఛాన్స్ సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌కు గతంలో నిర్ణయించిన మేరకు సీటు ఖరారు చేశారు. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, గుంటూరుకు చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీతలను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. టీడీపీ నేత టీడీ జనార్దన్ ఆదివారం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఎమ్మెల్సీ సీటు ఆశించిన విజయవాడకు చెందిన నాగుల్‌మీరాను పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎంపిక చేసినట్లు తెలిపారు. -
ఆళ్ల నానికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని)ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ఎమ్మెల్యేల కోటాలో ఆయనను ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదిస్తూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రకటన చేశారు. నాని అభ్యర్థిత్వంపై జిల్లాలో హర్షం వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యేల కోటాలో వైఎస్సార్ సీపీకి రెండు సీట్లు రాగా, ఒక దానిని జిల్లాకు కేటాయించడం ద్వారా ఈ జిల్లా తనకు ఎంత ప్రాధాన్యమో జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆళ్ల నాని 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2013లో ఆయన ఎమ్మెల్యే పదవిని వదులుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చవిచూశారు. ఆయనకు 2014లోను, ఆ తరువాత 2016లో పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న అక్రమాలను ఎండగడుతూ, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న నానికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని రెండు నెలల క్రితమే అధినేత నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ప్రకటన చేశారు. నానికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ప్రకటించడంతో ఏలూరు నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. -
ఆళ్ల నానికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని)ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ఎమ్మెల్యేల కోటాలో ఆయనను ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదిస్తూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రకటన చేశారు. నాని అభ్యర్థిత్వంపై జిల్లాలో హర్షం వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యేల కోటాలో వైఎస్సార్ సీపీకి రెండు సీట్లు రాగా, ఒక దానిని జిల్లాకు కేటాయించడం ద్వారా ఈ జిల్లా తనకు ఎంత ప్రాధాన్యమో జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆళ్ల నాని 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2013లో ఆయన ఎమ్మెల్యే పదవిని వదులుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చవిచూశారు. ఆయనకు 2014లోను, ఆ తరువాత 2016లో పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న అక్రమాలను ఎండగడుతూ, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న నానికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని రెండు నెలల క్రితమే అధినేత నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ప్రకటన చేశారు. నానికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ప్రకటించడంతో ఏలూరు నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. -
టీడీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి
-
ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ ప్రమాణస్వీకారం
హైదరాబాద్: ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఫరీదుద్దీన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలిచిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గెలవడం, అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. -
ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ ఏకగ్రీవం!
- నామినేషన్ వేసింది ఆయనొక్కరే - ముగిసిన నామినేషన్ల ప్రక్రియ హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక జరుగుతున్న ఒక ఎమ్మెల్సీ స్థానం అధికార టీఆర్ఎస్ ఖాతాలోనే పడనుంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికవడం ఖాయమైంది. సోమవారం నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్టు స్క్రుటినీ, ఉపసంహరణ గడువు ముగిశాక ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలిచిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గెలవడం, అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఫరీదుద్దీన్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఆయనతో పాటు శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనపై నమ్మకముంచి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయబోనని ఫరీదుద్దీన్ ఈ సందర్భంగా విలేకరులతో అన్నారు. ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని కొనియాడారు. బంగారు తెలంగాణ సాధనలో భాగస్వామి అయ్యేందుకు తనకు అందివచ్చిన అవకాశంగా దీన్ని భావిస్తున్నట్టు చెప్పారు. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని నాయిని అన్నారు. విపక్షాలు ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నాయని, ఏ ఎన్నికల్లోనూ గెలవలేమని అవి ఆందోళనలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఫరీదుద్దీన్, తాను ఒకే మంత్రివర్గంలో కలిసి పని చేశామని గుర్తు చేసుకున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరు
-
పాంచ్ పటాకా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయఢంకా కాంగ్రెస్‌కు ఒక స్థానం ఓటమి పాలైన టీడీపీ మొత్తం పోలైన ఓట్లు 118 పోలింగ్‌కు దూరంగా సీపీఐ, సీపీఎం టీడీపీకి పోలైంది 15 ఓట్లు చెల్లని 1 టీడీపీ, 5 బీజేపీ ఓట్లు హైదరాబాద్: అందరూ ఊహించినట్లుగానే జరిగింది. రాష్ట్ర శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఐదు స్థానాలను గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తన అభ్యర్థిని గెలిపించుకోగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ మాత్రం తన అభ్యర్థి ఓటమితో అభాసుపాలైంది. అసెంబ్లీ ఆవరణలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో మొత్తం 120 మంది ఎమ్మెల్యేలకుగాను సీపీఐ, సీపీఎంకు చెందిన చెరో ఎమ్మెల్యే ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో 118 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్లను అభ్యర్థులకు పంచగా ఒక్కో అభ్యర్థి విజయానికి 17 (16.86) ప్రథమ ప్రాధాన్య ఓట్లు అవసరమని తేల్చారు. టీఆర్ఎస్ తాను పోటీకి పెట్టిన అభ్యర్థులైన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కె.యాదవరెడ్డిల విజయానికి అవసరమైన 85 ఓట్లను (ఒక్కొక్కరికీ 17 ఓట్ల చొప్పున) ఎంఐఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సమీకరించుకొని ఐదు స్థానాలనూ గెలుచుకుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఉన్న 18 ఓట్లు ఆ పార్టీ అభ్యర్థి ఆకుల లలితకే పోలయ్యాయి. మొత్తం ఆరుగురు అభ్యర్థుల్లో ఆమెకే అత్యధిక ఓట్లు లభించాయి. దీంతో ఈ ఆరుగురు ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి 15 ఓట్లు పోలైనా, వాటిలో ఆరు ఓట్లు చెల్లకుండా పోయాయి. నోటా తెచ్చిన తంటా విజయానికి కావాల్సిన 17 ఓట్లలో టీడీపీ అభ్యర్ధికి 15 ఓట్లు పోలైనా, వాటిలో ఆరు చెల్లని ఓట్లుగా అధికారులు తేల్చారు. ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే రెండో ప్రాధాన్యత కింద నోటాకు ఓటు వేయడంతో అవి చె ల్లకుండా పోయాయి. దీంతో టీడీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 9 మాత్రమేనని అధికారులు తేల్చారు. ముందుగా అనుకున్న ప్రకారమే ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నోటాకు ఓటేయడంతో ఈ పరిస్ధితి తలెత్తింది. ఉదయం నుంచే కోలాహలం సోమవారం ఉదయం నుంచే అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఉదయం ఎనిమిది గంటలకే శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో ఏజెంట్లుగా ఉన్న ఐదుగురితో ఆయన భేటీ అయ్యారు. పోలింగ్ 9 గంటలకు మొదలుకాగా, శాసనసభ స్పీకర్ ఎస్. మధుసూదనాచారి తొలి ఓటు వేశారు. టీఆర్ఎస్ ఐదుగురు అభ్యర్థులకు ఓట్లేయాల్సిన వారిని 17 మందిని ఒక గ్రూపు చొప్పున విభజించారు. ఈ గ్రూప్‌కు ఒక్కో మంత్రికి బాధ్యతలు అప్పజెప్పారు. మంత్రులు కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జూపల్లి కృష్ణారావు, మహేందర్‌రెడ్డి, కె.తారక రామారావులు తమ గ్రూపు ఎమ్మెల్యేలతో ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లారు. ఉదయం 11 గంటలకల్లా పోలింగ్ దాదాపుగా పూర్తయ్యింది. రేవంత్‌రెడ్డి సహా టీడీపీ ఎమ్మెల్యేలు అంతా కలసి ఒకేసారి ఓటింగ్ వచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 18 మంది సైతం ఒకేసారి మధ్యాహ్నం 12.40 గంటల ప్రాంతంలో వచ్చి ఓట్లేశారు. ఆ తర్వాత ఎంఐఎం ఎమ్మెల్యేలతో మంత్రి హరీశ్‌రావు కలసి వెళ్లి ఓట్లేశారు. అందరి కంటే ఆఖరుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన ఓటును మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత వినియోగించుకున్నారు. దీంతో మొత్తం 118 ఓట్ల పోలింగ్ పూర్తయింది. -
ఎమ్మెల్సీ చేజారుతుందా?
టీఆర్ఎస్ తీరుతో కాంగ్రెస్ అధిష్టానం ఆందోళన హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై ఆ పార్టీ అధిష్టానం ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అధికార పార్టీ సంప్రదింపులు జరుపుతోందన్న వార్తలతో అధిష్టానం గురువారం మధ్యాహ్నం హుటాహుటిన పార్టీ సీనియర్లు గులాంనబీ ఆజాద్, వయలార్ రవిని ఎన్నికల పర్యవేక్షకులుగా హైదరాబాద్‌కు పంపించింది. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకుల లలితను గెలిపించే బాధ్యతను వీరికి అప్పగించింది. హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే వారిద్దరూ ఓ హోటల్లో పార్టీ ముఖ్యులు, పలువురు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలతో విడివిడిగా కూడా ఆజాద్, వయలార్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు, దాని ప్రలోభాలను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రెండో ప్రాధాన్యత ఓటు, పార్టీ విప్‌ను జారీ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్రాస్ ఓటింగ్‌ను అరికట్టడం తదితర అంశాలపై సమాలోచనలు జరిపారు. మిగిలిన ఎమ్మెల్యేలతోనూ శుక్రవారంవిడిగా సమావేశమవ్వాలని నిర్ణయించారు. పార్టీ అనుబంధ సభ్యునిగా ఉన్న దొంతి మాధవ రెడ్డికి వరంగల్ డీసీసీ అధ్యక్షునిగా అవకాశం కల్పించడంతో పాటు ఆయన అనుచరులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అధిష్టానం పెద్దలు హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే మాజీ ఎంపీ రాజగోపాల్‌రెడ్డికి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. -
నామినేషన్ల ఉపసంహరణ నేడు
టీఆర్ఎస్ ఐదో అభ్యర్థి బరిలోనే ఉంటారా? ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ తన ఐదో అభ్యర్థిని పోటీలో కొనసాగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే కోటా ఎన్నికలకు సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు కావడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఆరు ఖాళీలకు ఏడుగురు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. అయితే అధికార పార్టీ నాలుగు స్థానాలతో తృప్తి పడి, ఐదో అభ్యర్థిని ఉపసంహరించుకుంటే ఆరుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. కానీ, టీఆర్ఎస్ తనకున్న ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని కాకుండా ‘అంకెల గారడీ’ని నమ్ముకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీజేపీ మద్దతుతో ఎమ్మెల్సీ సీటుకు 2 ఓట్ల దూరంలో నిలిచిపోయిన టీడీపీ తన విజయంపై విశ్వాసంతోనే ఉంది. కానీ, టీఆర్ఎస్ ఎక్కడ తమ ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్ చేయిస్తుందోనన్న ఆందోళన అటు టీడీపీతోపాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లోనూ ఉంది. దీంతో నామినేషన్ ఉపసంహరణపై సోమవారం టీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ ఊపందుకుంది. మండలిలో టీడీపీకి ఎట్టి పరిస్థితుల్లో స్థానం లేకుండా చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని టీటీడీపీ నేతలు ఆరోపిస్తుండగా, ఎమ్మెల్యేలంతా ఆత్మప్రభోదం ప్రకారం ఓట్లేయాలని టీఆర్ఎస్ నాయకులు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే గులాబీ గూటికి చేరగా, మరో ఇద్దరు అదే బాటలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు, రాజేందర్‌నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడమే తరువాయి అన్న ప్రచారం జరుగుతోంది. వీరిలో ప్రకాశ్ గౌడ్ తన నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారేందుకు సిద్ధమని ప్రకటించారు. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేస్తారన్న అంచనాలు మొదలయ్యాయి. -
టీడీపీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి
అరికెల, అరవింద్‌కుమార్ గౌడ్ అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటాలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. గురువారం మధ్యాహ్నం 3గంటల వరకే నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు కాగా, పార్టీ నేతలు, బీజేపీ నేతలతో చర్చల అనంతరం ఒంటి గంటకు నరేందర్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. 2.30 గంటలకు శాసనసభా కార్యదర్శి, ఎన్నికల అధికారి రాజా సదారాంకు మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డిని ఖరారు చేయడంతో టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. పార్టీని నమ్ముకొని ఉన్న తనకు అన్యాయం జరిగిందని సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. అరవింద్‌కుమార్ గౌడ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా పార్టీకి గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. మేమే గెలుస్తం: ‘టీడీపీ, బీజేపీకి ఉన్న సీట్లు 20. మావోళ్లు నలుగురు టీఆర్ఎస్లో చేరినా 16 సీట్లు మాయే. ఎమ్మెల్సీ గెలవాలంటే ఇంకో ఇద్దరే కావాలి. అవసరమైతే వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం సభ్యుల మద్దతు కోరతాం. అదే టీఆర్ఎస్ ఐదో అభ్యర్థిని గెలిపించుకోవాలంటే కనీసం 8 మంది కావాలి. అవకాశాలు మాకే ఎక్కువ’ అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. -
ఏపీలో నాలుగు ఎమ్మెల్సీల ఎన్నికలు ఏకగ్రీవమే
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో జరిగే సాధారణ, ఉప ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. గడువు ముగిసే సమయానికి నాలుగు స్థానాలకు నలుగురు అభ్యర్ధులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణ గడువు ముగిసిన తర్వాత వీరి ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. వైఎస్సార్సీపీ అభ్యర్ధి డీసీ గోవిందరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేయగా, గురువారం టీడీపీ అభ్యర్థులు ఎంఏ షరీఫ్, కావలి ప్రతిభా భారతి, బీజేపీ నుంచి సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. వీరు రెండేసి సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. షరీఫ్, వీర్రాజు సాధారణ కోటా కింద నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిభా భారతి మాత్రం పాలడుగు వెంకట్రావు మృతితో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు జరగనున్న ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె. సత్యనారాయణకు అందచేశారు. ఇటీవలే టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు పేరును ఖరారు చేసినప్పటికీ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఓటరుగా నమోదు కాకపోవడంతో పోటీ చేయడానికి వీలులేకపోవడంతో చివరి నిమిషంలో ప్రతిభా భారతి పేరును ఖరారు చేశారు. షరీఫ్, ప్రతిభా భారతిల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రి కె. అచ్చాన్నాయుడు, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినీబాల, ఎమ్మెల్యేలు గౌతు శ్యామసుందర శివాజీ, కాగిత వెంకట్రావు, గద్దె రామ్మోహన్, వేగుల జోగేశ్వరరావు, అరిమిల్లి రాధాకృష్ణ, బోండా ఉమామహేశ్వరరావు, పులపర్తి నారాయణమూర్తి, వర్మ, టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి కోనేరు వెంకట సురేష్, పార్టీ నేతలు ఏఎం రాధాకృష్ణ, రవియాదవ్, బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు షరీఫ్‌తో పాటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఖరారైన టీడీ జనార్ధనరావును పార్టీ నేతలు ఎన్టీఆర్ భవన్లో సత్కరించారు. బీజేపీ అభ్యర్ధి సోము వీర్రాజు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, బీజేఎల్పీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణలతో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు వీర్రాజు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం నుంచి ర్యాలీగా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. అభ్యర్ధుల నామినేషన్ల పరిశీలన శుక్రవారం జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు సోమవరం వరకూ గడువు ఉంది. అయితే నలుగురు అభ్యర్ధులు మాత్రమే నామినేషన్ దాఖలు చేయటంతో వారు ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు సోమవారం ప్రకటిస్తారు. నామినేషన్ వేసిన సందర్భంగా షరీఫ్, ప్రతిభా భారతి మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామన్నారు. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందనేందుకు తమ ఎన్నిక నిదర్శనమన్నారు. షరీఫ్ సుదీర్ఘకాలంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ప్రతిభా భారతి గతంలో స్పీకర్‌గా, మంత్రిగా పనిచేశారు. 2004, 2009 సాధారణ ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకమారు ఓటమిని చవి చూశారు. -
ఏపీలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
-
ఏపీలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల నోటిఫికేషన్ ను గురువారం విడుదల చేశారు. రాష్ట్ర విభజనతో శాసనమండలిలో పెరిగిన మూడింటితోపాటు పాలడుగు వెంకట్రావు మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. దీనిలో భాగంగా ఈనెల 21 వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ ఉండగా, 22 న నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుంది. అనంతరం మే 25 వ తేదీన నామినేషన్ల ఉప సంహరణ కార్యక్రమం ఉంటుంది. జూన్ 1 వ తేదీన నిర్వహించే పోలింగ్ ఉదయం 9గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. అదే రోజు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
మహిళా నేతకే ఎమ్మెల్సీ పదవి?
8 మంది మహిళానేతల పేర్లను కోరిన ఏఐసీసీ సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో మండలి ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారిం చింది. త్వరలో ఖాళీ అవనున్న సీట్లలో కాం గ్రెస్‌కు దక్కనున్న ఏకైక స్థానాన్ని మహిళ తో భర్తీ చేయాలని ఏఐసీసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే తెలంగాణ నుంచి పార్టీ జాతీయస్థాయి పదవుల్లో ముగ్గురు సీనియర్లకు అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఇటీవలే పీసీసీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులను మార్చిన ఏఐసీసీ.. మరిన్ని మార్పులను చేపట్టనుందని పార్టీ ముఖ్యుడొకరు వెల్లడించారు. ఎమ్మెల్యే కోటా నుంచి పార్టీకి పూర్తికాలం పనిచేయగలిగే ఒక మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ఏఐసీసీ భావిస్తోంది. దీనికోసం పీసీసీ నుంచి 8మంది మహిళానేతల పేర్లతో జాబితాను పంపించాలంటూ ఆదేశించిదని సమాచారం. పార్టీకోసం ఇప్పటిదాకా పని చేసినా ప్రజాప్రతినిధిగా పనిచేయడానికి, గత ఎన్నికల్లో పోటీచేయడానికి అవకాశం రాని మహిళానేతకు అవకాశం కల్పించాలని నిర్దేశిం చింది. అయితే విధేయత, అంకిత భావం కలి గి, పార్టీ పటిష్టానికి ఉపయోగపడగలరనుకుం టే గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసినా జాబితాలో చోటు కల్పించవచ్చని పేర్కొంది. దీంతో అధిష్టానం సూచనలకు అనుగుణంగా జాబితా రూపకల్పనలో పీసీసీ నిమగ్నమైంది. మాజీమంత్రి వి.సునీతాలక్ష్మారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, కరీంనగర్ జిల్లాకు చెందిన నేరెళ్ల శారద వంటివారికి ఇప్పటికే జాబితాలో చోటు దక్కినట్టుగా తెలుస్తోంది. మరో ఐదుగురు నేతల పేర్లకోసంపీసీసీ ఇంకా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం పదవీ కాలం ముగుస్తున్న డి.శ్రీనివాస్ కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని మరోసారి ఆశిస్తున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్‌రెడ్డి వంటివారు కూడా పోటీపడుతున్నారు. అధిష్టానం మాత్రం మహిళానేతకే అవకాశం కల్పించాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. జాతీయ స్థాయి పదవుల్లోకి ముఖ్యులు రాష్ట్రం నుంచి పార్టీ జాతీయ స్థాయి పదవుల్లో కొందరికి చోటు దక్కే అవకాశముందని తెలుస్తోంది. కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌లలో ఒకరికి సీడబ్ల్యూసీలో చోటు దక్కనుందని సమాచారం. అలాగే ఏఐసీసీలో పొన్నాల లక్ష్మయ్యకు అవకాశం దక్కనుందని తెలుస్తోంది. -
రూ.100 కోట్లు ఉన్నా ఏం లాభం?
రూ.100 కోట్లు... ఇది జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న నిధుల మొత్తం. ఈ సొమ్ముతో రోడ్లు, తాగునీరు,సాగునీరు, ఇళ్ల నిర్మాణాలు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేయవచ్చు. అయితే సర్కార్ ఆంక్షలతో ఈ సొమ్ము ఇప్పుడు ఎందుకూ అక్కరకు రాకుండా పోతోంది. నిరుపయోగంగా ఖజానాలో మూలుగుతోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయకపోగా, గతంలో మంజూరైన వాటిపైనా ఆంక్షలు విధించడంతో జిల్లా వాసులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘అమ్మ పెట్టదు... అన్న చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వకపోగా గత ప్రభుత్వం హయాంలో మంజూరైన నిధులను సైతం ఖర్చు పెట్టనివ్వకుండా అడ్డుకుంటోంది. దీంతో ఎక్కడికక్కడ అభివృద్ధి స్తంభించిపోతోంది. ప్రగతి కుంటుపడిపోయింది. ఆధార్ అని, సర్వేలనీ కబుర్లు చెప్పడం తప్ప జనాలకు చేసిందేమీ కన్పించడం లేదు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు గాను నియోజకవర్గ అభివృద్ధి నిధి(సీడీపీ) పథకాన్ని ప్రతీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం కింద సంవత్సరానికి రూ.కోటి చొప్పున కేటాయిస్తారు. ఇందులో ఎమ్మెల్యే కోటా కింద రూ.50 లక్షలు, ఇన్చార్జ్ మంత్రి కోటా కింద రూ.50 లక్షలు విడుదల చేసేవారు. ఈ నిధులు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడేవి. అయితే, ఈసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి ఆ భాగ్యం లేకుండా పోయింది. నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద ప్రత్యేక కేటాయింపులు చేయలేదు. దీంతో ఈ ఏడాది నిధులొచ్చే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా పనులను ప్రతిపాదించలేని పరిస్థితి దాపురించింది. వారిపై ఆశలు పెట్టుకున్న ప్రజలు పరిస్థితి దయనీయంగా తయారైంది. అధికారంలోకి వచ్చిన టీడీపీ నిధులివ్వకపోగా గత ప్రభుత్వ హయాంలో విడుదలైన నిధులపైనా ఆంక్షలు పెట్టింది. వాటినైనా ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామంటే ఆ అవకాశాన్ని కూడా లేకుండా చేస్తోంది. గతంలో మంజూరైన నిధులను ఖర్చు పెట్టొద్దని, పనులు ప్రారంభమైతే ఎక్కడికక్కడ ఆపేయాలని, పనులు ప్రారంభించకుండా ఉంటే వాటి జోలికెళ్లొద్దని కచ్చితమైన ఆదేశాలిచ్చింది. ఒకవేళ ఎవరైనా పనులు చేస్తే వాటికి బిల్లులు చెల్లించవద్దని ట్రెజరీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇంజినీరింగ్ అధికారులు ఆ పనులు ఊసే ఎత్తడం లేదు. పని చేశామని ఎవరైనా బిల్లుకొస్తే ఇచ్చేది లేదంటూ ట్రెజరీ అధికారులు వెనక్కి పంపించేస్తున్నారు. ఫలితంగా ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. చెప్పాలంటే అభివృద్ధి ఆగిపోయింది. గత ప్రభుత్వం హయాంలో మంజూరైన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్‌నే ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. దీనికింద రూ.40.86 కోట్లతో 1,046 పనులు మంజూరయ్యాయి. ఇందులో 543 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా వాటిలో 131పనులు ప్రారంభించగా, 372పనులు ప్రారంభానికి నోచుకోలేదు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులన్నింటినీ నిలిపేయాలని ఆదేశించడంతో ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. దీంతో రూ.14.4 కోట్లు ట్రెజరీలో మురుగుతున్నాయి. ఇదే తరహాలో ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, రోడ్లు భవనాలు, హౌసింగ్, ఇరిగేషన్ తదితర శాఖల్లో కోట్లాది రూపాయల పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. సుమారు రూ.100 కోట్ల నిధులు అక్కరకు రాకుండా ఉన్నాయి. ఎన్నికైన ప్రజాప్రతినిధుల వివరాలు తెలుసుకుని బాధపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఉద్దేశమేంటో అర్థం కాక అధికారులు జత్తు పీక్కోవల్సి వస్తోంది. ఉన్న నిధులను వెనక్కి లాగేసి ఇతర పనులకు వినియోగిస్తారా ? ప్రారంభించని పనులను రద్దు చేసేస్తారా ? అనేది తెలియక గందరగోళంలో వారు ఉన్నారు. -
ఎమ్మెల్సీగా నేడు మంత్రి నారాయణ నామినేషన్
హైదరాబాద్: శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికకు ఆంధ్రప్రదేశ్ మంత్రి డాక్టర్ పి.నారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో నారాయణ ఉదయం 11 గంటలకు తన నామినేషన్‌ను అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి సత్యనారాయణకు అందించనున్నారు. కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఈనెల 21న ఎన్నిక జరగనుంది. ఆదివారం వరకూ ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు. 12న నామినేషన్ల పరిశీలన, 14న ఉపసంహరణ ఉంది. -
అంగ్లో ఇండియన్‌కు మరో ఎమ్మెల్యే పోస్టు..