సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూలు విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన మొత్తం మూడు స్థానాలకు నవంబరు 29న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుందని వెల్లడించింది. రాష్ట్రంలో దేవశాని చిన్న గోవిందరెడ్డి, మహ్మద్ అహ్మద్ షరీఫ్, సోము వీర్రాజుల పదవీ కాలం 2021 మే 31న ముగియడంతో ఎన్నిక జరగనుంది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో పరిస్థితులు చక్కబడ్డ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని మే 13, 2021న ఈసీఐ ప్రకటించిన విషయం విదితమే.
తెలంగాణలో ఆరు స్థానాలకు..
మరోవైపు.. తెలంగాణలో కూడా అదేరోజు ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఆకుల లలిత, మహమ్మద్ ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల పదవీ కాలం 2021 జూన్ 3న ముగిసింది.
ఎన్నికల షెడ్యూలు ఇలా..
నోటిఫికేషన్ : నవంబరు 9
నామినేషన్ల దాఖలుకు గడువు : నవంబరు 16
నామినేషన్ల పరిశీలన : నవంబరు 17
ఉపసంహరణకు గడువు : నవంబరు 22
పోలింగ్ : నవంబరు 22
(ఉ.9 నుంచి సా.4 వరకు)
ఓట్ల లెక్కింపు : నవంబరు 29
చదవండి: (ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండంటూ సీఎం కేసీఆర్‌కు లేఖ.. నిరుద్యోగి ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment