mlc notification
-
AP: ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఈనెల ఆఖరుకు ఖాళీ అవుతున్న ఏడు ఎంఎల్ఏ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సంయుక్త కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా, శాసన మండలి సభ్యులు చల్లా భగీరధ్ రెడ్డి పదవీ కాలం గత నవంబరు 2వ తేదీతో పూర్తి కాగా, ప్రస్తుత సభ్యులు నారా లోకేశ్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద రావు, వరాహ వెంకట సూర్యనారాయణ రాజు పెనుమత్స, గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం ఈనెల 29తో ముగియనుంది. ఈ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖాళీల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గతనెల 27వతేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. దీంతో, సోమవారం ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రకటనను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఎంఎల్ఏ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎన్నికకు సంబంధించి ఫారమ్-1 ద్వారా ఎన్నికల ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసే అభ్యర్ధులు స్వయంగా లేదా వారి ప్రతిపాదకుడి ద్వారా అయినా వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభా భవనంలో రిటర్నింగ్ అధికారి వద్ద లేదా సహాయ రిటర్నింగ్ అధికారి, శాసన మండలి ఉపకార్యదర్శికి వారి నామినేషన్లను సమర్పించవచ్చని సుబ్బారెడ్డి తెలిపారు. ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నాం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలను పైన పేర్కొన్న స్థలం, సమయాల్లో పొందవచ్చని వివరించారు. ఈ నెల 14వతేదీన ఉదయం 11గంటలకు అసెంబ్లీ భవనంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుందని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈనెల 16వతేది మధ్యాహ్నం 3గంటల వరకూ నామినేష్ల ఉసంహరణకు గడువు ఉంటుందన్నారు. ఆ గడువులోగా ఎవరైనా అభ్యర్ధులు వారి నామినేష్లనను ఉపసంహరించుకోవచ్చునని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 23వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ అసెంబ్లీలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పూర్తైన వెంటనే అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూలు విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన మొత్తం మూడు స్థానాలకు నవంబరు 29న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుందని వెల్లడించింది. రాష్ట్రంలో దేవశాని చిన్న గోవిందరెడ్డి, మహ్మద్ అహ్మద్ షరీఫ్, సోము వీర్రాజుల పదవీ కాలం 2021 మే 31న ముగియడంతో ఎన్నిక జరగనుంది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో పరిస్థితులు చక్కబడ్డ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని మే 13, 2021న ఈసీఐ ప్రకటించిన విషయం విదితమే. తెలంగాణలో ఆరు స్థానాలకు.. మరోవైపు.. తెలంగాణలో కూడా అదేరోజు ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఆకుల లలిత, మహమ్మద్ ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల పదవీ కాలం 2021 జూన్ 3న ముగిసింది. ఎన్నికల షెడ్యూలు ఇలా.. నోటిఫికేషన్ : నవంబరు 9 నామినేషన్ల దాఖలుకు గడువు : నవంబరు 16 నామినేషన్ల పరిశీలన : నవంబరు 17 ఉపసంహరణకు గడువు : నవంబరు 22 పోలింగ్ : నవంబరు 22 (ఉ.9 నుంచి సా.4 వరకు) ఓట్ల లెక్కింపు : నవంబరు 29 చదవండి: (ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండంటూ సీఎం కేసీఆర్‌కు లేఖ.. నిరుద్యోగి ఆత్మహత్య) -
ఎమ్మెల్సీ నగారా
సాక్షి, వికారాబాద్: ప్రాదేశిక సమరం పూర్తి కాకముందే మరో ఎన్నికకు నగరా మోగింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మంగళవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఒక స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం నరేందర్‌రెడ్డి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ సీటు ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు మే 14వ తేదీలోగా నామినేషన్ దాఖలు చేయాలి. మే 17న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మే 31వ తేదీన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరుగుతాయి. జూన్ 3వ తేదీన ఉప ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఉప ఎన్నికలు జరిగే ఎమ్మెల్సీ స్థానంలో గెలిచిన అభ్యర్థి జనవరి 2, 2022 వరకు పదవిలో కొనసాగుతారు. స్థానిక సంస్థల కోటాలో ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. డిసెంబర్ 28, 2015లో వీటికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు పోటీ చేయగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన శంబీపూర్ రాజు, పట్నం నరేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నరేందర్‌రెడ్డి కొడంగల్నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ స్థానానికి ఎలక్షన్ నిర్వహించనున్నారు. ఈఉప ఎనికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 771 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం జూలై 2 వరకు ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్లు వేస్తారు. కొత్తగా ఎన్నికకాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఓటింగ్ అవకాశం ఉండదని అధికారవర్గాల సమాచారం. టీఆర్ఎస్ నుంచి మహేందర్‌రెడ్డి.. స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచిమాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేసే అభ్యర్థి ఎంపికపై సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది. రాబోయే రెండు, మూడు రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడి, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించనున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం అధికారికంగా పట్నం మహేందర్‌రెడ్డి పేరు ప్రకటించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆపార్టీ నాయకులుచెబుతున్నారు. జిల్లాలో మెజార్టీ జెడ్పీటీసీ,ఎంపీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారని, తప్పకుండాటీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల అసెంబ్లీఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలైన మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా గెలుపొందితే జిల్లా రాజకీయాలపై ఆయన పట్టు మరింత పెరగనుంది. కాంగ్రెస్‌లో ఆశావహులు ఎక్కువే.. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయటంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై కోర్టును ఆశ్రయించే అవకాశంపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీటికెట్ కోసం కాంగ్రెస్‌లోనూ ఆశావహులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఇటీవల అసెంబ్లీఎన్నికల్లో ఓటమిపాలైన పలువురు నాయకులుఈ టికెట్ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాకు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్,మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డితోపాటురంగారెడ్డి జిల్లాకు చెందిన కేఎల్ఆర్,రవియాదవ్ తదితరులు టికెట్ రేసులోఉన్నట్లు వినికిడి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి ఎంపికపై త్వరలోనిర్ణయం తీసుకుంటామని రోహిత్‌రెడ్డి తెలిపారు. -
‘పెద్దల’ పోరుకు సై!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘పెద్ద’ల పోరుకు తెరలేచింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ స్థానానికి ప్రాతినిథ్యం వహించిన పట్నం నరేందర్‌రెడ్డి శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఎన్నికల సంఘం నగారా మోగించింది. ఈ నేపథ్యంలో తాజాగా మండలి బరిలో ఎవరు నిలబడతారనే అంశంపై సర్వత్రా ఆసక్తిగా మారింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య అధికంగానే ఉంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఎమ్మెల్సీ స్థానంపై దృష్టిపెట్టారు. ఆయన ఇటీవల ఎంపీగా పోటీచేయాలని భావించినా.. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ టికెట్ తనకే దక్కుతుందని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. సోదరుడు నరేందర్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీచేయడానికి మహేందర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. అయితే, తాజాగా ఆయన సతీమణి సునీతకు జిల్లా పరిషత్ పీఠం కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మహేందర్‌రెడ్డి వ్యూహం ఫలిస్తుందా? అన్న చర్చ కూడా పార్టీలో కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన కుటుంబీకులకు రెండు పదవులు ఉండడం.. సోదరుడి కుమారుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలబడడం.. ఆయన అభ్యర్థిత్వంపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ‘హస్త’వాసి పరీక్షించుకుంటారా? స్థానిక సంస్థల్లో సాంకేతికంగా చూస్తే కాంగ్రెస్‌కు అత్యధిక సభ్యుల బలం ఉంది. అయితే, 2014 ఎన్నికల అనంతరం ఆపరేషన్ ఆకర్‡్షకు ఆ పార్టీ కకావికలమైంది. ఈ క్రమంలో ఎంపీటీసీలు, కౌన్సిలర్లు టీఆర్ఎస్ గూటికి చేరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఆఖండ విజయం నమోదు చేసింది. దీంతో కాంగ్రెస్ బలం తగ్గింది. అయినప్పటికీ, గత ఎన్నికల్లో బరిలో నిలవడం ద్వారా అధికార పార్టీ శిబిరాలు నిర్వహించేలా చేసింది. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఉప ఎన్నికలో గెలిచిన ఎమ్మెల్సీ సభ్యుడి పదవీ కాలం 2022 జనవరి 4తో ముగియనుంది. అంటే 31 నెలలు మాత్రమే పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. ఈ స్వల్ప సమయం పదవిలో ఉండేందుకు కాంగ్రెస్ తీవ్రంగా శ్రమించక తప్పదు. పైగా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో పార్టీ అంతర్మథంలో పడినట్లు తెలిసింది. ఓటర్ల కోసం శిబిరాలు నిర్వహించి అధికార పార్టీని ఢీకొంటామా అనే సందిగ్ధంలో పడినట్లు సమాచారం. అయితే పార్టీ తరఫున అభ్యర్థిని బరిలోకి దించకపోతే పోటీ ఏకపక్షం కావడంతోపాటు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందన్న కోణంలోనూ పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఒకరిని బరిలో ఉంచేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి రేసులో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. -
‘కోడ్’ కూసినా.. కొనసాగుతున్న టీడీపీ ‘ప్రచారం’
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా పూర్తిస్థాయిలో జిల్లా యంత్రాంగం మేల్కొన్నట్లు లేదు. జిల్లా అంతటా సీఎం, ఇతర మంత్రుల ఫొటోలతో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్సు లు, గోడలపై ప్రచార హోరు కొనసాగుతూనే ఉంది. నిబంధనల ప్రకారం రాజకీయ నాయకులవిగ్రహాలకు మూసుగులు వేయాల్సి ఉన్నా, అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు–కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం నుంచి అమలులోకి రావటంతో జిల్లాలో ఎన్నికల వేడి పెరిగింది. జిల్లా కలెక్టర్, ఇతర అధికార యంత్రాంగం వరుస సమావేశాలతో అధికారులు, రాజకీయ నాయకులకు ఎన్నికల కోడ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ప్రభుత్వ, రాజకీయ పార్టీల ప్రచార ఫ్లెక్సీలు, బ్యానర్లు, వాల్‌పెయింట్లను తొలగించాల్సి ఉంది. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం కోడ్ అమలులోకి వచ్చి రెండు రోజులు గడచిపోయినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. విజయవాడ, మచిలీపట్నం మొదలు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో సీఎం చంద్రబాబునాయుడు, తన కేబినెట్ మంత్రుల ఫోటోలతో కూడిన ప్రచార ఫ్లెక్సీలు కనిపిస్తున్నప్పటికీ వాటిని తొలిగించే ప్రక్రియ చేపట్టడం లేదు. ప్రతిపక్ష పార్టీ ఫ్లెక్సీలను సోమవారమే తొలగింపు సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీ నాయకుల ఫ్లెక్సీలను తీయటంలో అలసత్వం ప్రదర్శిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లను మాత్రం సోమవారం నుంచే తొలగింపు ప్రక్రియను చేపట్టింది. గన్నవరం, మైలవరం, మచిలీపట్నం నియోజవర్గాల్లో పంచాయితీ కార్మికుల చేత టీడీపీ నేతలు దగ్గరుండి మరీ ఈ ప్రక్రియను పూర్తిచేయిస్తున్నారు. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరులో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావ్ ఫ్లెక్సీని స్థానిక తెలుగుదేశం కార్యకర్త దగ్గరుండి పంచాయితీ కార్మికులతో కలసి తొలగిస్తుండటంతో స్వల్ప వివాదం ఏర్పడింది. ముసుగు వేయలేదు.. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే రాజకీయనాయకులు విగ్రహాలకు మూసుగులు వేయాలి. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మ గాంధీ, అంబేడ్కర్, రాష్ట్రపతి, గవర్నర్ ఫోటోలనే ఉంచి, ఇతర ఫోటోలను తొలగించాలి. కానీ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు, ఆయా శాఖల మంత్రుల ఫోటోలు దర్శనమిస్తున్నాయి. అన్నా క్యాంటీన్లలో ఎన్టీఆర్, సీఎం చంద్రబాబుల ఫోటోలను అధికారులు పట్టించుకోలేదు. జిల్లాలో 1,05,037 మంది ఓటర్లు గుంటూరు–కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు మార్చి నెల 5ను గడువుగా నిర్ణయించారు. ఎన్నిక మార్చి 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. రెండు జిల్లాల్లో 2,44,635 మంది పట్టభద్రులు ఓటు కలిగి ఉన్నారు. కృష్ణా జిల్లాలో 1,05,037 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 64,443 మంది, మహిళలు 40,584 మంది, ఇతరులు పదిమంది చొప్పున ఉన్నారు. గుంటూరు జిల్లాలో 1,39,598 మంది ఓట ర్లు ఉండగా అందులో పురుషులు 89,383 మంది, మహిళలు 50,202 మంది, ఇతరులు 12 మంది చొప్పున నమోదు చేసుకున్నారు. -
ఎమ్మెల్సీ నోటిఫికేషన్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల దాఖలుకు మార్చి 5 వరకు అవకాశముంది. 6న నామినేషన్ల పరిశీలన ఉండగా, 8న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. ప్రభుత్వ సెలవు దినాలు మినహా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల లోపు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమితులైన జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (రెవెన్యూ, ప్రకటనలు, ట్రేడ్ లైసెన్సు)కు గానీ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా నియమితులైన అడిషనల్ కమిషనర్(ఎన్నికలు)కు గానీ నామినేషన్ పత్రాలు అందజేయొచ్చు. అర్హతలతో కూడిన నామినేషన్ ఒక్కటే దాఖలైతే పోలింగ్ అవసరం ఉండదు. ఒకవేళ ఎన్నిక నిర్వహించాల్సి వస్తే మార్చి 22న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ఉంటుందని రిటర్నింగ్ అధికారి అద్వైత్‌కుమార్‌సింగ్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఎస్ ప్రభాకర్‌రావు పదవీ కాలం మే 1న ముగియనుండడంతో ఎన్నిక నిర్వహిస్తున్నారు. పోలింగ్ నిర్వహించే పక్షంలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని 84మంది కార్పొరేటర్లు, 15 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఓటు వేసేందుకు అర్హులని జీహెచ్ఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. ఎంఎస్ ప్రభాకర్‌రావు కాంగ్రెస్ తరఫున రెండు పర్యాయాలు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న ఆయన మరోసారి తనకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరారు. తిరిగి టికెట్ లభిస్తే హైదరాబాద్ స్థానిక నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టనున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి 28 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుండగా.. మార్చి 12న పోలింగ్ జరగనుంది. మార్చి1 నుంచి నామినేషన్ల పరిశీలన జరగ్గా.. ఉపసంహరణకు మార్చి5న తుదిగడువుగా అవకాశం ఇచ్చారు. పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. నోటిఫికేషన్ విడుదలతో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చినట్లైంది. ఏపీ మండలి నుంచి పి.నారాయణ, ఎ.లక్ష్మీశివకుమారి, పి.శమంతకమణి, యనమల రామకృష్ణుడు, ఆదిరెడ్డి అప్పారావు రిటైరవుతుండగా.. తెలంగాణ శాసన మండలి నుంచి పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీ, టీ. సంతోష్‌కుమార్, మహ్మద్ సలీమ్, మహముద్ అలీలు తమ పదవీకాలాన్ని పూర్తిచేసుకోనున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
28న ఎమ్మెల్సీ నోటిఫికేషన్..17న పోలింగ్
-
28న ఎమ్మెల్సీ నోటిఫికేషన్..17న పోలింగ్
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటాలోని పది మండలి స్థానాలకు ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. ఈ నెల (ఫిబ్రవరి) 28న నోటిఫికేషన్ రానుంది. వచ్చే నెల 17న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చెంగల రాయుడు, రామచంద్రయ్య, సుధాకర్ బాబు, వెంకట సతీష్ కుమార్ రెడ్డి , శేఖర్ రావు, భారతి, మహ్మద్ జానీ, తెలంగాణాకు చెందిన సయ్యద్ అల్తాఫ్ హైజర్ రజ్వి, రంగారెడ్డి , గంగాధర్ గౌడ్ల పదవీ కాలం పూర్తి కానుంది. పది మండలి స్థానాలకు నామినేషన్లకు మార్చి 7న చివరి తేదీగా పేర్కొన్నారు. అలాగే, 8న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 10ని ఆఖరిగడువుగా పెట్టారు. మార్చి 29తో పదిమంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో ఈ ఎన్నికలకు తెరలేచింది. -
తప్పులు సరిదిద్దాం.. జాబితా సిద్ధం
∙కలెక్టర్ కోన శశిధర్ ∙ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ (వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు) నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల జాబితాలోని తప్పులు సరిదిద్ధి కచ్చితమైన జాబితా సిద్ధం చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. సోమవారం ఆయన తన చాంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను ప్రారంభించారు. అలాగే సింగిల్ విండో సిస్టమ్ కౌంటర్‌ను జాయింట్ కలెక్టర్ బి.లక్షీ్మకాంతం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్, డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి, డీఎస్పీ మల్లికార్జున వర్మతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఓటరు జాబితాపై వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేసి పూర్తి స్థాయిలో తప్పులు సరిదిద్ధామన్నారు. దాదాపు 500 ఓట్లను తొలగించామన్నారు. క్లరికల్ తప్పులను కూడా సరిచేశామన్నారు. తొలగించిన ఓట్లకు సంబంధించి సప్లమెంటరీ జాబితాను ఈ నెల 20న రాజకీయ పార్టీలకు అందిస్తామన్నారు. ∙నామినేష¯ŒS సందర్భంలో అభ్యర్థులు దాఖలు చేసే అఫిడవిట్లో ఇచ్చిన సమాచారం ఆధారంగా నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. వారు తప్పుడు సమాచారం ఇచ్చి నా, కేసులు వంటివి పొందపర్చకపోయినా ఎన్నికల అధికారికి సంబంధం లేదన్నారు. అలాంటి ఫిర్యాదులు ఉన్నా యని ఆరోపించేవారు నేరుగా ఎన్నికల కమిషన్ వద్ద పిటిషన్దా ఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ∙ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో 30 పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జేసీ లక్మికాంతం తెలిపారు. ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, లౌడ్ స్పీకర్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసేందుకు సింగిల్ విండో సిస్టం కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ట్రాన్స్ పోర్ట్, రెవెన్యూ, పోలీసు శాఖల నుంచి ఒక్కొక్క అధికారి ఉంటారన్నారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా ఎన్నికల అధికారి అనుమతి మంజూరు చేస్తారన్నారు. తొలిరోజు నామిషన్లు నిల్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం సోమవారం ప్రారంభమైంది. తొలిరోజున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ తెలిపారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్
–20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ – 21న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు 23వ తేదీ ఆఖరు – మార్చి 9న పోలింగ్, 15న ఓట్ల లెక్కింపు అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ (అనంతపురం, వైఎస్సార్, కర్నూలు) పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశిధర్ సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ని విడుదల చేస్తారు. అభ్యర్థులు సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 21వ తేదీన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 23 చివరి గడువుగా విధించారు. మార్చి 9న పోలింగ్, 15న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎన్నికలకు సంబంధించిన నియమ, నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని కలెక్టర్ శశిధర్ ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు. నామినేషన్లు దాఖలు ఇలా.. అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి 3 గంటలలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత వచ్చే నామినేషన్లను స్వీకరించరు. నామినేషన్ వేసే సందర్భంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5 వేలు, ఇతరులకు రూ.10 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని 10 మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది. వీరంతా నియోజకవర్గ పరిధిలో ఓటరు అయి ఉండాలి. ప్రతి అభ్యర్థి నాలుగు సెట్లు దాఖలు చేయవచ్చు. రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేయాలి పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వద్ద అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ వేసే సందర్భంలో అభ్యర్థితో పాటు నలుగురిని లోనికి అనుమతిస్తారు. వెంట వచ్చిన వారు నిర్దేశించిన ప్రదేశంలో ఉండిపోవాలి. ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరణ చేస్తారు. ఎన్నిక ప్రచార ఖర్చుపై ఆంక్షలు లేవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచార ఖర్చుకు సంబంధించిన ఆంక్షలు లేవు. అయితే ఓటర్లు డబ్బులు పంపిణీ చేయడం, నేరపూరితమైన ఘటనలకు పాల్పడితే చర్యలు తీసుకుంటారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలు, కేబుల్ టీవీలో ఇచ్చే ప్రకటనలకు తప్పని సరిగా ఎంసీఎంసీ (మీడియా సర్టిఫికేషన్ ఆఫ్ మానటరింగ్ కమిటీ) ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఎంసీఎంసీ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వ్యవహరిస్తారు. సభ్యులుగా డీఆర్ఓ, జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆకాశవాణి మేనేజర్, ఒక సీనియర్ జర్నలిస్టు ఉంటారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచార ప్రకటనలను వీరు పరిశీలించిన ఆమోదించిన తర్వాతే ముద్రణకు అర్హత పొందుతాయి. కమిటీ ఆమోదం లేకుండా ప్రచార ప్రకటనలు వస్తే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటారు. -
ఎమ్మెల్సీ స్థానానికి ఫరీదుద్దీన్ ఏకగ్రీవ ఎన్నిక !
హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలకు సోమవారం మధ్యాహ్నంతో గడువు ముగిసింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఫరీదుద్దీన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఎన్నిక జరగనుంది. నామినేషన్ ఉపసంహరణకు అక్టోబర్ 17 వరకు గడువుంది. ఆ రోజున ఫరీదుద్దీన్ ఎన్నికను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. -
తుమ్మల ఖాళీచేసిన ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్
హైదరాబాద్ : రోడ్లు, భవనాల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖాళీ చేసిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 26 వరకూ నామినేషన్ల స్వీకరిస్తారు. అలాగే నామినేషన్ల స్వీకరణకు తుది గడువు అక్టోబర్ 3వ తేదీ. అక్టోబర్ 17న ఎన్నిక జరిపి అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఫరీదుద్దీన్‌ను ఆపార్టీ ఇప్పటికే ప్రకటించింది. కాగా ఎమ్మెల్సీగా తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున రికార్డు మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. -
ఎలా నిర్వహించాలి?
- ఎమ్మెల్సీల ఎన్నికపై అస్పష్టత..! - సింగిల్ బ్యాలెట్టా..? డబుల్ బ్యాలెట్టా..? - ఆ స్థానం పదవీకాలం నాలుగేళ్లా..?..ఆరేళ్లా..? - 2007లో ఒకే బ్యాలెట్లో నిర్వహణ - అలాగే నిర్వహించాలంటున్న నిపుణులు - ఎన్నికల సంఘానికి లేఖ రాసిన అధికారులు సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీల నోటిఫికేషన్లో గందరగోళం నెలకొంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకే బ్యాలెట్లో నిర్వహించాలా? లేక రెండు బ్యాలెట్లో నిర్వహించాలా? అనే సందిగ్దత నెలకొంది. ఒకస్థానం 2013లోనే ఖాళీకాగా, మరో స్థానం గతనెల 1వ తేదీతో ముగిసింది. దీంతో ఖాళీ అయిన రెండేళ్లకు ఎన్నిక నిర్వహిస్తున్నందున ఆస్థానానికి తదుపరి పదవీ కాలం నాలుగేళ్లుంటుందా? లేక మిగిలిన స్థానాల మాదిరిగా ఆరేళ్లుంటుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నిర్వహణ..పదవీకాలాల విషయంలో అధికారుల్లో గందరగోళం నెలకొంది. ఈ అంశాలపై ఇప్పటికే జిల్లా యంత్రాంగం అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను రాష్ర్ట ఎన్నికల సంఘం వివరణ కోరేందుకు లేఖ రాసింది. ఒకే బ్యాలట్ నిర్వహించాలి ఒకే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించిన విధంగానే నిర్వహించాలంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాను నియోజకవర్గంగా పరిగణిస్తారని చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వలేదు. గుంటూరు జిల్లాలో రెండు స్థానాలకు ఒకే బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తామనడం వివాదాస్పదవుతోంది. 2007లో శాసనమండలి పునరుద్ధరించిప్పుడు స్థానిక సంస్థల సభ్యుల సంఖ్యను బట్టి జిల్లాలకు ఎమ్మెల్సీస్థానాలను కేటాయించారు. ఈ విధంగా విశాఖకు రెండు కేటాయించారు. ఎన్ని స్థానాలున్నా..మండలిపరంగా జిల్లాను ఒక స్థానిక సంస్థల నియోజక వర్గంగా పరిగణిస్తారు. అందుకే 2007లో ఒకే బ్యాలెట్‌తోనే రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ తరపున దాడి వీరభద్రరావులు ఎన్నికయ్యారు. లాటరీలో కిడారికి రెండేళ్ల పదవీకాలం, దాడికి ఆరేళ్ల పదవీకాలం దక్కింది. కిడారి స్థానం ఖాళీ 2009లో పూర్తికావడంతో కాంగ్రెస్ తరపున దాట్ల సూర్య నారాయణరాజు ఎన్నికయ్యారు. దాడి పదవీ కాలం 2013తో ముగిసింది. అదే సమయంలో స్థానిక సంస్థల పదవీకాలం ముగియడంతో వాటి ఎన్నికలతో ఈ ఎమ్మెల్సీ స్థానం ముడిపడి ఉన్నందున వాయిదాపడక తప్పలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల ముందే స్థానిక ఎన్నికలు జరిగాయి. దాంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందుబాటులోకి రావడంతో దాడి స్థానానికి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఏర్పడింది. ఏడాదిగా నిర్వహించలేదు. డీఎస్ఎన్ రాజు పదవీ కాలం కూడా మే 1తో ముగియడంతో రెండు స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. పదవీకాలం ఎప్పుడు ముగిసినా ఒకే నియోక వర్గానికి చెందిన రెండు స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నందున 2007లో మాదిరిగానే ఒకే బ్యాలెట్లో ఎన్నికలు నిర్వహించాలని నిపుణులు చెబుతున్నారు. ప్రాధాన్యతా క్రమంలో ఓట్లు వేయాల్సి ఉన్నందున ఒకే ఓటరు రెండు మొదటి ప్రాధాన్యతా ఓట్లు వేసే అవకాశం ఉండదంటున్నారు. రెండు స్థానాలకు ఇద్దరు మాత్రమే బరిలో ఉంటే ఆటోమేటిక్‌గా ఏకగ్రీవమవుతారని..అదే ఇద్దరు కంటే ఎక్కువ మంది పోటీపడితే మాత్రం ఒకే బ్యాలెట్లో ఎన్నికలు జరిగితే ఓటర్లు ప్రాధాన్యతా క్రమంలో ఓట్లు వేస్తారని, అప్పుడు మొదటి ప్రాధాన్యతా ఓట్లు(51శాతం) ఏ ఇద్దరు తెచ్చు కుంటే వారే విజేతలువుతారని వివరిస్తున్నారు. జిల్లా యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఎలా నిర్వహించాలన్నదానిపై స్పష్టత కోరింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కొంత గందరగోళానికి గురవుతోంది. దాంతో రాష్ట్రంలో పరిస్థితిని వివరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి(సీఈసీ)ని సంప్రదించాలని భావిస్తోంది. సీఈసీ ఆదేశాలమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా ఉన్నతాధికారులకు సరైన మార్గనిర్దేశం చేసే అవకాశాలున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి కె.నాగేశ్వరరావును ‘సాక్షి’ సంప్రదించగా మార్గదర్శకాల కోసం ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. -
రేపే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్!
హైదరాబాద్ సిటీ: ఎమ్మెల్యే కోటాలో జరగాల్సిన ఆరు ఎమ్మెల్సీ పదవుల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు ఎమ్మెల్యే కోటాలో 14 ఎమ్మెల్సీ స్థానాలను కేటాయించారు. అయితే, విభజన సమయంలో ఒక స్థానం అధికంగా రావడంతో గత నెల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక స్థానాన్ని తగ్గించాలని సూచించింది. దీంతో గత నెల 29వ తేదీన ఏడు స్థానాలు ఖాళీ అయినా, ఆరు స్థానాలుగానే పరిగణించి నోటిఫికేషన్ విడుదల చే యనున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన కె.ఆర్.ఆమోస్ ఖాళీ చేసిన స్థానాన్ని తొలగించినట్లు ఎన్నికల సంఘం అధికారులు అధికారికంగానే ప్రకటించారు. ఆయనతో పాటు మార్చి 29వ తేదీన పదవీ విరమణ చేసిన నాగపురి రాజలింగం, పీర్ షబ్బీర్ అహ్మద్, బాలసాని లక్ష్మీనారాయణ, బోడకుంటి వెంకటేశ్వర్లు, కె.యాదవరెడ్డి, డి.శ్రీనివాస్‌ల స్థానాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేష్ జారీ అయిన రోజు నుంచే (14వ తేదీ / గురువారం) నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 21వ తేదీ నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువుగా నిర్ణయించారు. జూన్ 1వ తేదీన రాష్ట్ర శాసన మండలి సభ్యుల ఎన్నికకు పోలింగ్ జరగుతుంది. అదే రోజు సాయంత్ర అయిదు గంటలకు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ జారీ