తప్పులు సరిదిద్దాం.. జాబితా సిద్ధం
Published Tue, Feb 14 2017 1:35 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
∙కలెక్టర్ కోన శశిధర్
∙ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ (వైఎస్‌ఆర్, అనంతపురం, కర్నూలు) నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల జాబితాలోని తప్పులు సరిదిద్ధి కచ్చితమైన జాబితా సిద్ధం చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. సోమవారం ఆయన తన చాంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను ప్రారంభించారు. అలాగే సింగిల్ విండో సిస్టమ్ కౌంటర్‌ను జాయింట్ కలెక్టర్ బి.లక్షీ్మకాంతం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్, డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి, డీఎస్పీ మల్లికార్జున వర్మతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఓటరు జాబితాపై వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేసి పూర్తి స్థాయిలో తప్పులు సరిదిద్ధామన్నారు. దాదాపు 500 ఓట్లను తొలగించామన్నారు. క్లరికల్ తప్పులను కూడా సరిచేశామన్నారు. తొలగించిన ఓట్లకు సంబంధించి సప్లమెంటరీ జాబితాను ఈ నెల 20న రాజకీయ పార్టీలకు అందిస్తామన్నారు.
∙నామినేష¯ŒS సందర్భంలో అభ్యర్థులు దాఖలు చేసే అఫిడవిట్‌లో ఇచ్చిన సమాచారం ఆధారంగా నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. వారు తప్పుడు సమాచారం ఇచ్చి నా, కేసులు వంటివి పొందపర్చకపోయినా ఎన్నికల అధికారికి సంబంధం లేదన్నారు. అలాంటి ఫిర్యాదులు ఉన్నా యని ఆరోపించేవారు నేరుగా ఎన్నికల కమిషన్ వద్ద పిటిషన్దా ఖలు చేయాల్సి ఉంటుందన్నారు.
∙ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో 30 పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జేసీ లక్మికాంతం తెలిపారు. ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, లౌడ్ స్పీకర్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసేందుకు సింగిల్ విండో సిస్టం కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ట్రాన్స్ పోర్ట్, రెవెన్యూ, పోలీసు శాఖల నుంచి ఒక్కొక్క అధికారి ఉంటారన్నారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా ఎన్నికల అధికారి అనుమతి మంజూరు చేస్తారన్నారు.
తొలిరోజు నామిషన్లు నిల్
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం సోమవారం ప్రారంభమైంది. తొలిరోజున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ తెలిపారు.
Advertisement