28న ఎమ్మెల్సీ నోటిఫికేషన్‌..17న పోలింగ్‌ | telangana, ap mlc notification will be come out on feb 28 | Sakshi
Sakshi News home page

28న ఎమ్మెల్సీ నోటిఫికేషన్‌..17న పోలింగ్‌

Published Tue, Feb 21 2017 6:27 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

telangana, ap mlc notification will be come out on feb 28

హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటాలోని పది మండలి స్థానాలకు ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. ఈ నెల (ఫిబ్రవరి) 28న నోటిఫికేషన్‌ రానుంది. వచ్చే నెల 17న పోలింగ్‌ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చెంగల రాయుడు, రామచంద్రయ్య, సుధాకర్ బాబు, వెంకట సతీష్ కుమార్ రెడ్డి , శేఖర్ రావు, భారతి, మహ్మద్ జానీ, తెలంగాణాకు చెందిన సయ్యద్ అల్తాఫ్ హైజర్ రజ్వి, రంగారెడ్డి , గంగాధర్ గౌడ్‌ల పదవీ కాలం పూర్తి కానుంది. పది మండలి స్థానాలకు నామినేషన్లకు మార్చి 7న చివరి తేదీగా పేర్కొన్నారు. అలాగే, 8న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 10ని ఆఖరిగడువుగా పెట్టారు. మార్చి 29తో పదిమంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో ఈ ఎన్నికలకు తెరలేచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement