తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి 28 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుండగా.. మార్చి 12న పోలింగ్ జరగనుంది. మార్చి1 నుంచి నామినేషన్ల పరిశీలన జరగ్గా.. ఉపసంహరణకు మార్చి5న తుదిగడువుగా అవకాశం ఇచ్చారు.