శాసన మండలి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల | Legislative council election Schedule Release | Sakshi
Sakshi News home page

శాసన మండలి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Published Tue, Feb 19 2019 3:37 AM | Last Updated on Sat, Mar 9 2019 4:19 PM

Legislative council election Schedule Release - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో 10 శాసనమండలి స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి 12న ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభ సభ్యుల కోటాలో ఎన్నికైన తెలంగాణలోని ఐదుగురు, ఏపీలోని ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29న పూర్తికానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఏపీలో ఎమ్మెల్సీలు పి.నారాయణ, ఎ.లక్ష్మీశివకుమారి, పి.శమంతకమణి, యనమల రామకృష్ణుడు, ఆదిరెడ్డి అప్పారావు, తెలంగాణలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, టి.సంతోష్‌కుమార్, మహ్మద్‌ సలీం, మహమూద్‌ అలీ పదవీకాలం పూర్తికానుండడంతో ఆయా స్థానాలు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement