
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో మూడు ఎమ్మెల్సీ (ఎమ్మెల్యే కోటా) స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. టీఆర్‌ఎస్ అభ్యర్థులు వి.గంగాధర్‌గౌడ్, మైనంపల్లి హనుమంతరావు, ఎలిమినేటి కృష్ణారెడ్డిలు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ రాజాసదారాం ప్రకటించారు. ఈ ముగ్గురికీ ఎన్నిక ధ్రువీకరణపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి నాయిని, పలువురు ఎమ్మెల్యేలు హాజరై ఎమ్మెల్సీలకు అభినందనలు తెలిపారు.