అందరూ ఊహించినట్లుగానే జరిగింది. రాష్ట్ర శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఐదు స్థానాలను గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తన అభ్యర్థిని గెలిపించుకోగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ మాత్రం తన అభ్యర్థి ఓటమితో అభాసుపాలైంది.