ఆళ్ల నానికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు | YSRCP MLC CANDIDAT AALLA NANI | Sakshi
Sakshi News home page

ఆళ్ల నానికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు

Published Fri, Mar 3 2017 1:33 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని)ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ఎమ్మెల్యేల కోటాలో ఆయనను ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదిస్తూ వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రకటన చేశారు.

సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని)ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ఎమ్మెల్యేల కోటాలో ఆయనను ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదిస్తూ వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రకటన చేశారు. నాని అభ్యర్థిత్వంపై జిల్లాలో హర్షం వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యేల కోటాలో వైఎస్సార్‌ సీపీకి రెండు సీట్లు రాగా, ఒక దానిని జిల్లాకు కేటాయించడం ద్వారా ఈ జిల్లా తనకు ఎంత ప్రాధాన్యమో జగన్‌ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆళ్ల నాని 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2013లో ఆయన ఎమ్మెల్యే పదవిని వదులుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చవిచూశారు. ఆయనకు 2014లోను, ఆ తరువాత 2016లో పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న అక్రమాలను ఎండగడుతూ, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న నానికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని రెండు నెలల క్రితమే అధినేత నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ప్రకటన చేశారు. నానికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ప్రకటించడంతో ఏలూరు నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement