
సాక్షి, తాడేపల్లి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ ఫెయిల్యూర్‌పై ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేనకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. పరిధిలో లేని అంశంపై తమకు ఫిర్యాదు చేశారని సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎన్డీఏ సభ ఫెయిల్యూర్‌ని పోలీసులపై నెట్టేందుకు టీడీపీ, జనసేన ప్రయత్నించింది. బీజేపీ, టీడీపీ, జనసేన సభ విఫలం కావడానికి పోలీసులే కారణమంటూ గగ్గోలు పెట్టింది. పోలీసులను బ్లాక్ మెయిల్ చేయడానికి ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేన బండారం.. సీఈవో ముఖేష్ కుమార్ మీనా సమాధానంతో బట్టబయలైంది.
ప్రధానమంత్రి భద్రత అంశం మా పరిధిలో లేదు..
ప్రధానమంత్రి భద్రత అంశం తమ పరిధిలో లేదని సీఈవో ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ‘ప్రధాని సభ భద్రత కేంద్ర హోంశాఖ, ఎస్ పీజీ పరిధిలో ఉంటాయి. ప్రధాని పర్యటన భద్రత అంతా హోమ్ శాఖనే చూస్తుంది. ఎన్నికల కమిషన్‌కు ఇందులో ఎటువంటి పాత్ర ఉండదు. నాకు ఫిర్యాదు చేసినా నేను ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని సీఈవో ముఖేష్ కుమార్ మీనా అన్నారు.
ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు.. పిఠాపురం వర్మ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment