పొత్తులో కమలానికి కేటాయించిన అనపర్తి సీటు విషయంలో చంద్రబాబు డ్రామా
అక్కడ మొదట టీడీపీ అభ్యర్థిని ప్రకటించి ఆ తర్వాత బీజేపీకి కేటాయింపు
అయినా.. బీజేపీ అభ్యర్థితో పోటాపోటీగా టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి ప్రచారం
రాజమండ్రి టీడీపీ పార్లమెంట్ సమావేశానికి సైతం ఆయనకు బాబు ఆహా్వనం
ఆయనే అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తారంటూ టీడీపీ దొంగాట
ఈ పరిణామాలను ఏమాత్రం పట్టించుకోని బీజేపీ రాష్ట్ర అధినేత్రి పురందేశ్వరి
అక్కడ టీడీపీ అభ్యర్థి పోటీలో ఉంటేనే తనకు ప్రయోజనమనే ఆమె మౌనం?
మొదట నుంచి పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతున్నా
ఆమె పట్టించుకోకపోవడంపై శ్రేణుల్లో ఆగ్రహం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మిత్రపక్షమైన బీజేపీపట్ల తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న తీరు.. ఇందుకు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యవహారశైలితో కమలనాథులు తీవ్రంగా రగిలిపోతున్నారు. చంద్రబాబు తమ పార్టీని ఇష్టానుసారం ఆడిస్తున్నా ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా లోలోపల టీడీపీకి వత్తాసు పలికేలా ప్రేక్షకపాత్ర వహిస్తూ బీజేపీకి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. 2014లోనూ టీడీపీ అధినేత పొత్తు ధర్మాన్ని విస్మరించి తమ పార్టీ పోటీచేసిన పలు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టి దొంగదెబ్బ తీశారని వారు గుర్తుచేస్తున్నారు.
ఇప్పుడు కూడా చంద్రబాబు తన వదినతో కలిసి ఇలాంటి డ్రామానే ఆడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా వారు అనపర్తి నియోజకవర్గాన్ని ఉదహరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించినప్పటికీ అక్కడ బీజేపీ, టీడీపీ అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటున్నారు.
పొత్తులో బీజేపీకి కేటాయించిన ఆ స్థానంలో చంద్రబాబు రాజకీయ డ్రామాలు అడుతుంటే, ఆ నియోజకవర్గం ఉన్న రాజమండ్రి లోకసభ స్థానం నుంచి బీజేపీ తరఫున పురందేశ్వరి పోటీచేస్తూ కూడా అక్కడి పరిణామాలపై కిమ్మనకుండా ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఇది బీజేపీని వెన్నుపోటు పొడవడమేనని వారు స్పష్టంచేస్తున్నారు.
పురందేశ్వరి ప్రేక్షకపాత్ర..
ఇక ఈ సీట్ల విషయంలో చంద్రబాబు ఆడుతున్న డ్రామాలను బీజేపీ రాష్ట్ర పార్టీ అ«ధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి ఏమాత్రం పట్టించుకోవడంలేదని కమలనాథుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నిజానికి.. పురందేశ్వరి రాజమండ్రి లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి కన్నా చంద్రబాబు తొలుత ప్రకటించిన టీడీపీ అభ్యర్ధి పోటీలో ఉంటే పురందేశ్వరికి అక్కడ ఎక్కువ ఓట్లు పడతాయని చెప్పి టీడీపీ నాయకత్వం ఆమెను ఒప్పించిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో బీజేపీకి, పారీ్టనే నమ్ముకున్న నాయకులకు టీడీపీవల్ల అన్యాయం జరుగుతున్నా ఆమె మౌనంగా ఉంటున్నారని వారంటున్నారు. అవసరమైతే, బీజేపీ ఆ స్థానాన్ని వదులుకునేందుకు కూడా పురందేశ్వరి సిద్ధంగా ఉన్నట్లు ఆ పారీ్టలో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
అప్పట్లో మోదీపై బాబు విమర్శలను
ఖండించడంవల్లే..
వాస్తవానికి.. 2019 ఎన్నికలకు ముందు బీజేపీని, ప్రధాని మోదీని చంద్రబాబు టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేశారు. వీటిని అప్పట్లో ప్రస్తుత అనపర్తి బీజేపీ అభ్యర్థి ఎం. శివరామకృష్ణంరాజు ఖండించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడీయన అభ్యర్థిగా కొనసాగితే టీడీపీ ఓట్లు బదలాయించడం కష్టమని కొత్త ప్రచారం మొదలుపెట్టినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పట్లో మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలను వదిలేసి వాటిని ఖండించినందుకు శివరామకృష్ణంరాజును బలిపశువును చేయాలని టీడీపీ ప్రయతి్నస్తోందని.. కానీ, పురందేశ్వరి టీడీపీ కుట్రను ఏమాత్రం అడ్డుకోకపోవడం ద్వారా బీజేపీకి వెన్నుపోటు పొడవడాన్ని కమలం శ్రేణులు జీరి్ణంచుకోలేకపోతున్నారు.
2014లో మాదిరిగానే ఇప్పుడూ వెన్నుపోటు
మరోవైపు.. చంద్రబాబు–పురందేశ్వరి తమ రాజకీయ డ్రామాను రక్తికట్టించేందుకు శివరామకృష్ణంరాజు బలమైన అభ్యర్థి కాదని ఇంకో కొత్త ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో ఇలాంటి ప్రచారాలే చేసి చంద్రబాబు బీజేపీకి వెన్నుపోటు పోడిచారని.. ఇప్పుడు పురందేశ్వరి ఆయనకు తోడైందని వారంటున్నారు. అప్పట్లో బీజేపీకి ఐదు లోక్‌సభ, 15 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ముందు చెప్పి ఆ తర్వాత నాలుగు లోక్‌సభ 14 అసెంబ్లీ స్థానాలకు పరిమితం చేశారు.
ఆ అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వారు బలమైన వారు కాదంటూ సంతనూతలపాడు, గుంతకల్లు, కడప అసెంబ్లీ స్థానాల్లో చంద్రబాబు పోటీగా టీడీపీ వారికి సైతం బి–ఫారాలిచ్చారు. ఆ తరహాలోనే చంద్రబాబు ఇప్పుడు కూడా బీజేపీకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నంలో పురందేశ్వరి భాగస్వామ్యం కావడంపట్ల కమల దళంలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బాబు–పురందేశ్వరి కలిసి నాటకం
బీజేపీతో పొత్తు కుదరక ముందే గత ఫిబ్రవరి 24న చంద్రబాబు 94 అసెంబ్లీ స్థానాలకు ప్రకటించిన టీడీపీ అభ్యర్థుల జాబితాలో అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించారు. ఆ తర్వాత మార్చిలో పొత్తులు ఖరారయ్యాక టీడీపీ ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. దీంతో బీజేపీ జాతీయ నాయకత్వం అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఎం. శివరామకృష్ణంరాజు పేరును ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తున్నారు.
రెండ్రోజుల క్రితం చంద్రబాబు నిర్వహించిన రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ప్రధాన నాయకుల సమావేశానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కూడా పిలిచారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశం తర్వాత కూడా అనపర్తి టీడీపీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పోటీచేస్తున్నట్లు టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తుండడంపై బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. పురందేశ్వరి ఈ పరిణామాలను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో చంద్రబాబు–పురందేశ్వరి ఇద్దరూ కలిసే ఈ డ్రామాను ఆడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment