Gudivada Amarnath Key Comments On Chandrababu And Purandeswari - Sakshi
Sakshi News home page

‘పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ టీడీపీకి పనిచేస్తున్నారా?’

Published Fri, Jul 28 2023 6:19 PM | Last Updated on Fri, Jul 28 2023 6:56 PM

Gudivada Amarnath Comments On Chandrababu And Purandeswari - Sakshi

చంద్రబాబు స్క్రిప్ట్‌లా పురంధేశ్వరి మాటలున్నాయని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు స్క్రిప్ట్‌లా పురంధేశ్వరి మాటలున్నాయని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు పార్టీని గెలిపించడానికి పురంధేశ్వరి తాపత్రయ పడుతున్నారని, రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆమె దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బీజేపీకి కనిపించడం లేదా?. దేశంలో ఎక్కడాలేని పథకాలు ఏపీలో అమలవుతున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. రాష్ట్రాలు ఇచ్చే ఆదాయాన్ని కేంద్రం తిరిగి ఇస్తోంది’’ అని మంత్రి పేర్కొన్నారు.

‘‘పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ అనధికారికంగా టీడీపీకి పనిచేస్తున్నారు. విశాఖలో చంద్రబాబు హయాంలో జరిగిన భూ దందాపై పురంధేశ్వరి మాట్లాడవచ్చు కదా?. ఎన్ని కుట్రలు, ఎందరూ కలిసినా మళ్లీ జగన్‌ ప్రభుత్వమే వస్తుంది’’ అని మంత్రి అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు.
చదవండి: మొసలికన్నీరు సంగతి సరే.. మరి ఈనాడుకు ఆ దమ్ముందా?


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement