ఒంగోలు: బీజేపీతో పొత్తుకోసం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. నిజాయతీగా సమైక్య ఉద్యమం చేస్తున్న వైఎస్ఆర్ సీపీపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోనని ధైర్యంగా ప్రకటించే దమ్ము బాబుకు ఉందా? అని బాలినేని ప్రశ్నించారు.
బిజెపితో పొత్తుపెట్టుకొని తెలంగాణలో సీట్లు గెలుసుకోవాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బిజెపి ఆసరాతో నిలబడే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. ఈ నేపధ్యంలో బిజెపితో పొత్తుకోసం బాబు ఆరాటపడుతున్నట్లు బాలినేని విమర్శించారు.
బిజెపితో పొత్తుకోసం బాబు తహతహ: బాలినేని
Published Mon, Sep 2 2013 3:37 PM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
Advertisement