న్యూఢిల్లీ: కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా హోటల్స్ నేమ్ ప్లేట్లపై ప్రదర్శించాలన్న ఉత్తర్వులను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సమర్థించుకుంది. తీర్థయాత్ర శాంతియుతంగా, క్రమబద్ధంగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని సుప్రీం కోర్టు కోరగా.. ఈమేరకు కోర్టుకు తాజాగా యూపీ ప్రభుత్వం తమ వివరణను తెలియజేసింది. ‘‘హోటల్స్, తినుబండారాల పేర్ల విషయంలో అనుమానాలు ఉన్నాయని యాత్రికులు ఫిర్యాదు చేశారు. వారి ఆందోళనలను పరిష్కరించేందుకే ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. అందుకు అనుగుణంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు’’ అని వివరించింది. ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ (యూపీ) శివభక్తుల కన్వర్ యాత్ర నేమ్ ప్లేట్ల వివాదం పిటిషన్లపై ఇవాళ (జులై 26) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment