ఒకే షిఫ్టులో పీసీఎస్‌ ప్రిలిమినరీ పరీక్ష | The UP government PCS exam will now be conducted in one day | Sakshi
Sakshi News home page

ఒకే షిఫ్టులో పీసీఎస్‌ ప్రిలిమినరీ పరీక్ష

Published Thu, Nov 14 2024 5:34 PM | Last Updated on Fri, Nov 15 2024 5:28 AM

The UP government PCS exam will now be conducted in one day

ప్రయాగ్‌రాజ్‌: ప్రావిన్షియల్‌ సివిల్‌ సర్వీసెస్‌(పీసీఎస్‌) ప్రిలిమినరీ పరీక్ష–2024 వ్యవహారం తీవ్ర అలజడి సృష్టించింది. ఈ పరీక్షను ఒకే రోజు కాకుండా వేర్వేరు రోజుల్లో వేర్వేరు షిఫ్టుల్లో నిర్వహించాలని ఉత్తరప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(యూపీపీఎస్సీ) నిర్ణయించడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం కమిషన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. 

ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరీక్షను పాత విధానంలోనే ఒకే రోజు ఒకే షిఫ్టులో నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. దీనిపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. పాత విధానంలోనే పరీక్షలు నిర్వహించాలంటూ యూపీపీఎస్సీ అధికారులను ఆదేశించారు. దీంతో యూపీపీఎస్సీ వెనక్కి తగ్గింది. పీసీఎస్‌ ప్రిలిమినరీ పరీక్షను ఒకే రోజు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అలాగే రివ్యూ ఆఫీసర్‌(ఆర్‌ఓ), అసిస్టెంట్‌ రివ్యూ ఆఫీసర్‌(ఏఆర్‌ఓ) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలియజేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement