- 2003 పుష్కరాలతో పోలిస్తే 27.25 లక్షల మంది పెరుగుదల
- అప్పట్లో 10 రోజుల్లో 93.45 లక్షల మంది రాక
- ఇప్పటివరకూ నమోదైన స్నానాల సంఖ్య 1.21 కోట్లు
- చివరి రెండు రోజుల్లో మరో 30 లక్షల మంది వస్తారని అంచనా
సాక్షి, కొవ్వూరు : గోదావరి పుష్కర యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత పుష్కరాల నేపథ్యంలో గురువారం సాయంత్రం 6గంటల వరకు 1 కోటి 20 లక్షల 70 వేల 439 మంది పుష్కర స్నానాలు చేసినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. 2003 పుష్కరాలతో పోలిస్తే జిల్లాలో ఘాట్ల సంఖ్య పెరగడంతో పాటు యాత్రికుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. 2003 పుష్కరాల సందర్భంగా మొదటి పది రోజుల్లో 93,45,730 మంది పుష్కర స్నానాలు ఆచరించగా, ప్రస్తుత పుష్కరాల్లో గురువారం సాయంత్రం 6గంటల సమయానికి 1,20,70,439 మంది పుష్కర స్నానాలు చేశారు.
గత పుష్కరాలతో పోలిస్తే ఈ పుష్కరాలకు మొదటి 10 రోజుల్లో 27.25 లక్షల మంది భక్తులు పెరిగారు. 2003లో చివరి రెండు రోజుల్లో 29,49,929 మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ క్రమంలో శుక్ర, శనివారాల్లో పుష్కర స్నానాలు ఆచరించే వారి సంఖ్య 30 లక్షలు దాటే అవకాశం ఉంది. ఈ పుష్కరాల్లో ఈనెల 18న రికార్డు స్థాయిలో 20,23,246 మంది స్నానాలు ఆచరించారు. రాష్ట్రం నుంచేకాక తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు రాగా, దేశంలోని పలు ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు పుష్కర స్నానాలకు తరలివచ్చారు. ప్రధానంగా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం, నరసాపురంలోని వలంధరరేవు ఘాట్లలో రోజూ లక్ష మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
అంచనాలకు మించి..
Published Fri, Jul 24 2015 1:36 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement
Advertisement