శ్రీవారి మెట్టు మార్గాన్ని ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్‌ | TTD Opens Srivari Mettu Footpath for Pilgrims | Sakshi
Sakshi News home page

శ్రీవారి మెట్టు మార్గాన్ని ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

Published Thu, May 5 2022 5:28 PM | Last Updated on Thu, May 5 2022 6:36 PM

TTD Opens Srivari Mettu Footpath for Pilgrims - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గాన్ని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు అనుమతివ్వనున్నారు. గత నవంబర్‌లో కురిసిన వర్షానికి తిరుమల మెట్ల మార్గం, ఘాట్‌ రోడ్‌ ధ్వంసమవగా టీటీడీ యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీటీడీ అధికారులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

చదవండి: (పసికందును లాలించిన సీఎం వైఎస్‌ జగన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement