ఛత్తీస్‌గడ్: భారతదేశం దేవాలయాలకు నిలయంగా పిలుస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక దేవాలయాల్లో...కొన్ని రహస్యాలు, కొన్ని అద్భుతాలు, మరికొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ఇక ఛార్‌ధామ్ వంటి కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ప్రస్తుతం అలాంటి ప్రత్యేకత సంతరించుకున్న దేవాలయం గురించి మనం తెలుసుకోబోతున్నాం.
ఏడాదిలో కేవలం ఐదు గంటలే దర్శనం
ఛతీస్‌గఢ్‌లోని నిరయ్ మాతా ఆలయాన్ని ఏడాదిలో కేవలం 5 గంటలే గంటలే తెరుస్తారట. సమయం తక్కువ ఉండడంతో ఆ రోజున వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. గరియాబంద్ జిల్లా కేంద్రానికి 12 కి.మి దూరంలో ఉన్న కొండపై ఈ గుడి ఉంటుంది. ప్రతి ఏడాది ఛైత్ర నవరాత్రి రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉ.9 గంటల వరకే భక్తులకు దర్శనం కల్పిస్తారు. తిరిగి వచ్చే ఏడాది ఛైత్ర నవరాత్రి వరకు ప్రవేశం ఉండదు.
గుడి ప్రత్యేకతలు
ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఆలయంలో పూజా విధానం విషయానికొస్తే.. సాధారణంగా దేవాలయాల్లో అర్చనలకు ఉపయోగించే కుంకుమ, తేనె, అలంకరణలు లాంటి సామగ్రిని ఉపయోగించరు. కేవలం కొబ్బరికాయ, అగరబత్తులతో మాత్రమే అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఐదు గంటలు దర్శన సమయం అనంతరం తిరిగి మరుసటి ఏడాది ఛైత్ర నవరాత్రి వచ్చేదాక ఆలయంలోకి ఎవరూ రాకూడదని నిబంధనలున్నాయి. అలాగే ఈ గుడిలోకి మహిళల ప్రవేశం నిషేధం ఉంది. ప్రవేశిస్తే చెడు జరుగుతుందని అక్కడి ప్రజలు విశ్వాసమట.
Comments
Please login to add a commentAdd a comment