
జమ్ము-కశ్మీర్ రియాసి జిల్లాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జమ్మూలోని రాయసి జిల్లాలో ఉన్న శివఖోడి గుహను సందర్శించేందుకు వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
ఈ దుర్ఘటనలో 9మంది యాత్రికులు మరణించారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎంతమందికి బుల్లెట్ గాయాలు అయ్యాయో ఇంకా తెలియరాలేదని రియాసి జిల్లా మేజిస్ట్రేట్ విశేష్ మహాజన్ తెలిపారు
ఉగ్రవాదుల దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు,భద్రతా బలగాలు బాధితుల్ని రక్షించేందుకు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంలో గాయపడ్డ బాధితుల్ని రక్షించేందుకు స్థానికులు సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment