లోయలో పడ్డ బస్సు, 22 మంది మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి | Uttarakhand Bus With 40 Pilgrims Falls Into Gorge Way To Yamunotri | Sakshi
Sakshi News home page

Uttarakhand Bus Accident: లోయలో పడ్డ బస్సు, 22 మంది మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Published Sun, Jun 5 2022 8:16 PM | Last Updated on Sun, Jun 5 2022 10:06 PM

Uttarakhand Bus With 40 Pilgrims Falls Into Gorge Way To Yamunotri - Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో ఆదివారం సాయంత్రం ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. గంగోత్రి-యమునోత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న చార్‌ధామ్‌ యాత్రికుల బస్సు దమ్టా వద్ద లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 22 యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్టుగా తెలిసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చార్‌ధామ్‌ యాత్రికులు యమునోత్రి వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది.
చదవండి👉🏻 వివాదాస్పద వ్యాఖ్యలు.. నూపుర్‌ శర్మను సస్పెండ్‌ చేసిన బీజేపీ

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
బస్సు ప్రమాదంపై  ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement