తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వ దర్శనానికి 5 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం, నడకదారి భక్తుల దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. ఇదిలాఉండగా, ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కొన్ని కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.