
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తగ్గింది.
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తగ్గింది. సర్వ దర్శనానికి 5 గంటల సమయం, కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. 4 కాంపార్ట్మెంట్లలో భక్తులు వెంకన్న దర్శనం కోసం వేచి ఉన్నారు.
ఇదిలాఉండగా, ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 14 కంపార్ట్మెంట్లు నిండాయి. భక్తుల కోసం ఉచిత, రూ. 50, రూ. 100, రూ. 500 గదులు సులభంగా లభిస్తున్నాయి. భక్తులకు ఉచిత గదులు 69 ఖాళీగా ఉన్నాయి. రూ. 50 గదులు 105, రూ. 100 గదులు 71, రూ. 500 గదులు 29 ఖాళీగా ఉన్నాయి.
మంగళవారం ప్రత్యేక సేవ- అష్టదళ పాదపద్మారాధన