తిరుమల: తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టిక్కెట్లను టీటీడీ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన 192మంది భక్తులు తిరుమల యాత్ర మండలి పేరుతో ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టిక్కెట్లు తీసుకుని వచ్చారు. వీరిని ప్రశాంత్ అనే దళారీ మోసగించినట్లు తెలుస్తోంది. వీరంతా దర్శనానికి వచ్చిన సమయంలో తనిఖీల్లో ఈ బాగోతం బయటపడింది. ఆలయ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment