సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులకు తృటిలో ప్రమాదం తప్పింది. రెండవ ఘాట్ రోడ్డులో కారు అదుపు తప్పి పిట్టగోడను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ధ్వంసం అయింది. ప్రమాద సమయంలో సెఫ్టీ బెలూన్ ఒపెన్ అవ్వడంతో భక్తులు స్వల్ప గాయాలతో సురక్షితంగా భయటపడ్డారు.
క్షతగాత్రులను తిరుపతిలోని రూయ ఆసుపత్రికి తరలించారు. రెండవ ఘాట్‌లోని లింక్ రోడ్డులో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో కారులో ఐదు మంది ఉన్నారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ జామ్ అయింది. రంగంలోకి దిగిన విజిలెన్స్ సిబ్బంది కారును సైడ్‌కు మళ్లించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
రెండు బస్సులు ఢీ..
కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని స్థానిక ఖాలేఖాన్ పేట వద్ద రెండు బస్సులు ఒక్కదానికొక్కటి ఢీ కొట్టాయి. వివరాలివి.. మచిలీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఆర్కే కాలేజీకి చెందిన బస్సు ఎదురుగా ఢీకొనడంతో ప్రయాణికులకు స్వల్పగాయలయ్యాయి. కాలేజీ బస్సు డ్రైవర్, మరో ఇద్దరి విద్యార్థులకు స్వల్ప గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment