
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
హైదరాబాద్: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగనుంది. సర్వ దర్శనానికి 8 గంటలు, కాలినడక భక్తులకు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పట్టనుంది.ప్రస్తుతం ఏడు కంపార్టమెంట్లలో భక్తులు వెంకన్న దర్శనం కోసం వేచి ఉన్నారు.
ఇదిలా ఉండగా గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శ్రీకల్యాణ వెంకన్న గరుడ వాహనంపై ఉరేగారు. నిన్న 50 వేలకు మందికిపైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఉచిత గదులు, రూ. 50, రూ. 100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. అయితే రూ.500 గదులు ఖాళీ లేవు.
శుక్రవారం ప్రత్యేక సేవ- పూరాభిషేకం