rush normal
-
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
హైదరాబాద్: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సర్వ దర్శనానికి 12 గంటల సమయం పట్టనుంది. ప్రస్తుతం 18 కంపార్టమెంట్లలో భక్తులు వెంకన్న దర్శనం కోసం వేచి ఉన్నారు. కాగా కాలినడక భక్తులకు ప్రవేశం రద్దు చేశారు. ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కూడా రద్దు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
హైదరాబాద్: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగనుంది. సర్వ దర్శనానికి 8 గంటలు, కాలినడక భక్తులకు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పట్టనుంది.ప్రస్తుతం ఏడు కంపార్టమెంట్లలో భక్తులు వెంకన్న దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇదిలా ఉండగా గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శ్రీకల్యాణ వెంకన్న గరుడ వాహనంపై ఉరేగారు. నిన్న 50 వేలకు మందికిపైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఉచిత గదులు, రూ. 50, రూ. 100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. అయితే రూ.500 గదులు ఖాళీ లేవు. శుక్రవారం ప్రత్యేక సేవ- పూరాభిషేకం -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
హైదరాబాద్: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తగ్గింది. సర్వ దర్శనానికి 6 గంటలు, నడకదారి భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇతర పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీశైలం, విజయవాడ తదితర ప్రాంతాలు భక్తులతో పోటెత్తాయి. -
తిరుమలలో సర్వ దర్శనానికి 9 గంటలు
హైదరాబాద్: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వ దర్శనానికి 9 గంటలు, నడకదారి భక్తులకు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. 11 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
హైదరాబాద్: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వ దర్శనానికి 8 గంటలు, నడకదారి భక్తులకు 4 గంటలు, పత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. కాగా తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించనున్నారు. దీన్ని ప్రభోదోత్వవం, ఉత్తాన ద్వాదశి అని కూడా అంటారు. స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొలిపే పర్వదినాన్ని కైశిక ద్వాదశిగా వ్యవహరిస్తారు. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు గాఢ నిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువును కైశిక ద్వాదశిన మేల్కొల్పడం రివాజు. ఈ సందర్భంగా వేకువజాము 4.30 నుంచి 5.30 గంటల మధ్యలో ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనిమస్తారు.