హైదరాబాద్: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వ దర్శనానికి 8 గంటలు, నడకదారి భక్తులకు 4 గంటలు, పత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. కాగా తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించనున్నారు. దీన్ని ప్రభోదోత్వవం, ఉత్తాన ద్వాదశి అని కూడా అంటారు. స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొలిపే పర్వదినాన్ని కైశిక ద్వాదశిగా వ్యవహరిస్తారు.
ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు గాఢ నిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువును కైశిక ద్వాదశిన మేల్కొల్పడం రివాజు. ఈ సందర్భంగా వేకువజాము 4.30 నుంచి 5.30 గంటల మధ్యలో ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనిమస్తారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published Tue, Nov 4 2014 6:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM
Advertisement
Advertisement