మెక్సికో: సెంట్రల్ మెక్సికోలో విషాదం చోటు చేసుకుంది. ఊరేగింపుగా వెళ్తున్న ప్రజలపైకి ట్రాక్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదం 16 మంది మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. మజ్జపిల్ పట్టణంలో బుధవారం సాయంత్రం మత సంబంధమైన ఊరేగింపు జరుగుతోంది. ఆ ఊరేగింపులో భారీగా ప్రజలు పాల్గొన్నారు.
అయితే ఆ దే సమయంలో వేగంతో వస్తున్న ట్రక్ బ్రేకులు ఫెయిల్ అయి... ఊరేగింపు మీదకు దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాగా ఈ ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ డ్రైవర్ పరారైయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.