ఘోర ప్రమాదం: వాహనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు | CCTV footage shows truck crashing into everything in its way, after the brakes failed | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం: వాహనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు

Published Wed, May 24 2017 8:44 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

ఘోర ప్రమాదం: వాహనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు - Sakshi

ఘోర ప్రమాదం: వాహనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్‌ రాడ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు బ్రేక్స్‌ ఫెయిల్‌ కావడంతో హైవేపై ఎదురుగా నిలిపివున్న వాహానాలపైకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే ఓ వీడియోను అక్కడి మీడియాకు అధికారులు విడుదల చేశారు.

స్ధానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వెళ్తున్న ట్రక్కు బ్రేక్స్‌ ఫెయిల్‌ కావడంతో మొదట ఎదుటి వాహనాలను ఢీ కొట్టింది. ఆ తర్వాత ట్రక్కులోని రాడ్లు గాల్లొకి లేచి మిగిలిన వాహనదారులపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ట్రక్కు పూర్తిగా ధ్వంసం అయింది. హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement