అంగారిక సంకష్టికి..అంతా రెడీ
సాక్షి, ముంబై : ముంబై ప్రభాదేవిలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటైన సిద్ధివినాయకుని ఆలయంలో అంగారికి సంకష్టి కోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఆరు నెలలకోసారి వచ్చే ఈ సంకష్టి ఈ సారి జూలె 15వ తేదీ మంగళవారం వచ్చింది. దీన్ని పురస్కరించుకుని ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాం తాల నుంచి లక్షలాది మంది భక్తులు సిద్దివినాయకున్ని దర్శించుకునేందుకు తరలివస్తారు. ఈ నేపథ్యంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేం దుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
దర్శన వేళలు
* సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము 3.15 గంటల వరకు
* మళ్లీ 3.50 నుంచి రాత్రి 8.10 వరకు
* రాత్రి 10.55 నుంచి అర్ధరాత్రి 2.00 గంటల వరకు మహాపూజ, హారతి వేళలు
* సోమవారం అర్ధరాత్రి 12.10 నుంచి 1.30 వరకు
* మంగళవారం తెల్లవారు జాము 3.15 నుంచి 3.50 గంటల వరకు
* మంగళవారం రాత్రి 8.55 నుంచి 10.55 గంటల వరకు
రోజు వారి పూజలు
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము 3.15 గంటల వరకు సిద్ధివినాయకుని దర్శనం కోసం ఆలయం ద్వారాలు తెరిచి ఉంచనున్నారు. తెల్లవారుజాము 3.30 గంటల నుంచి రాత్రి 8.15 గంటల వరకు, అనంతరం రాత్రి 101.5 గంటల నుంచి తెల్లవారుజాము రెండు గంటల వరకు గర్భగుడిలోకి భక్తులకు అనుమతిస్తారు. ఇక కాకడ్ హారతి, మహాపూజను అర్ధరాత్రి 12.10 గంటల నుం చి అర్ధరాత్రి 1.30 గంటల వరకు, తెల్లవారుజాము 3.15 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల వరకు హారతి, రాత్రి 8.15 గంటల నుంచి రాత్రి 10.15 గంటల వరకు మహాపూజతోపాటు నైవేద్యం, హారతిని అందించనున్నారు.
ప్రత్యేక వసతులు
ముఖ్యంగా వికలాంగులు, గర్భిణులు, సీనియర్ సిటీజన్లు, పిల్లతల్లుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీరికోసం గేట్ నెంబర్ మూడు నుంచి లోనికి అనుమతించనున్నారు. మరోవైపు భక్తుల కోసం ఏర్పాటు చేసిన మండపంలో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు అక్కడక్కడా ఫ్యాన్లు బిగించారు. అలాగే లైట్లు, తాగునీరు, టీ, అల్పాహారం, సంచార మరుగుదొడ్లు సౌకర్యాలు కల్పించా రు. మండపంలో అగ్నిమాపక పరికాలు అందుబాటులో ఉంచారు. ఒక ఫైరిం జన్, అంబులెన్స్, వైద ్య బృందం, ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు అందులో ఉంచారు. భక్తులు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కెమరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని ట్రస్టీ విజ్ఞప్తి చేసింది. సిద్ధివినాయకుని అందరూ క్యూను పాటించి దర్శించుకోవాలని ఈఓ మంగేష్ షిందే కోరారు.
ట్రాఫిక్ మళ్లింపు
అంగారకి సంకష్టిని పురస్కరించుకుని జూలై 14 నుంచి ప్రభాదేవి సిద్ధివినాయకుని ఆలయం చుట్టుపక్కల పరిసరాలలోని రోడ్లపై ట్రాఫిక్‌లో పలు మార్పులు చేశారు. అంగారికి సంకష్టి జూలై 15 మంగళవారం అయినప్పటికీ సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు దర్శనం చేసు కోవాలన్న తపనతో అనేక మంది భక్తులు ఆలయం వద్దకి చేరుకుంటారు. ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు, కొన్ని మార్గాల్లో రాకపోకలను నిలిపివేయనున్నారు.