
ఉత్సాహంగా పస్క పండుగ
నర్సాపూర్:స్థానిక సీఎస్‌ఐ చర్చి ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన పస్క పండుగ కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల కోసం ప్రతి ఏటా నిర్వహించే పండుగను ఆదివారం మండలంలోని పెద్దచింతకుంట శివారులోని మామిడితోటలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా సీఎస్‌ఐ చర్చి ఫాస్టర్ రెవరెండ్ విజయరావు మాట్లాడుతూ వర్షాలు బాగా కురవాలని అందరూ ప్రార్థనలు చేయాలని భక్తులకు సూచించారు.
వర్షాలు బాగా కురిస్తేనే పంటలు పండి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. అనంతరం మహిళలకు పాటల పోటీలు, పిల్లలకు మ్యూజికల్ చైర్ తదితర ఆటలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా చర్చిల ఫాస్టర్లు లెనిన్, న్యూటన్, ప్రభుదాస్‌లు మాట్లాడుతూ భక్తులకు పలు సూచనలు చేశారు. కాగా నర్సాపూర్ సీఎస్‌ఐ చర్చి సభ్యులు అరున్, వినోద్, టాగూర్, ప్రేం, తారాభాయి, మేరీ వసంత, ఇందిర, జయశీల తదితరులు పాల్గొన్నారు.
-