ఫోర్జరీ సంతకాలతో భూవిక్రయం | land sale with forged signatures | Sakshi
Sakshi News home page

ఫోర్జరీ సంతకాలతో భూవిక్రయం

Published Fri, Aug 8 2014 12:44 AM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM

land sale with forged signatures

 మంచాల:  ఫోర్జరీ పత్రాలు సృష్టించి 10 ఎకరాల భూమిని విక్రయించిన నిందితులు కటకటాలపాలయ్యారు. మరికొందరు పరారీలో ఉన్నారు. మంచాల సీఐ జగదీశ్వర్ గురువారం సాయంత్రం స్థానిక ఠాణాలో కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని ఆగాపల్లి గ్రామంలోని 182,183 సర్వే నంబర్లలోని 10 ఎకరాల భూమిని గతంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన లింగాల నాగభూషణ్‌కొనుగోలు చేశాడు.

ఆయనకు తెలియకుండా 2012లో ఫోర్జరీ పత్రాలు సృష్టించి  ఈ భూమిని కొందరు ఇతరులకు రూ. కోటి రెండు లక్షలకు విక్రయించారు. ఈవిషయం తెలుసుకున్న నాగభూషణ్ గత జూన్ 4న మంచాల పోలీసులతో పాటు కోర్టును ఆశ్రయించాడు. ఈ ‘అక్రమ’ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన రాయపోల్ గ్రామానికి చెందిన ముత్యంరెడ్డితో పాటు ఆగాపల్లి గ్రామస్తులు పందుగుల సత్తయ్య, పందుగుల యాదయ్య, పందుగుల వీరస్వామి, పందుగుల శ్రీకాంత్‌గౌడ్, దూసరి నాగభూషణ్‌గౌడ్, నాగన్‌పల్లి గ్రామానికి చెందిన శివకుమార్‌గౌడ్, గున్‌గల్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు యాదయ్యతో పాటు మరో పదిహేను మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ముత్యంరెడ్డితో పాటు మరో ఏడు మందిని రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు. మిగ తా వారు పరారీలో ఉన్నారని, వారినీ త్వరలో అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు. కాగా ఈ ‘అక్రమ’ వ్యవహారంలో పలువురు  నాయకలు, అధికారుల హస్తం  ఉందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement