Jagadiswar
-
శేరిలింగంపల్లి టీఆర్ఎస్లో అసమ్మతి రాగం!
మియాపూర్: మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్‌కు శేరిలింగంపల్లి టికెట్ ఇవ్వకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని డివిజన్ కార్యకర్తలు, అభిమానులు హెచ్చరించారు. శుక్రవారం హఫీజ్‌పేట్ డివిజన్లోని ఇంజినీర్స్ ఎన్క్లేవ్ కమ్యూనిటీ హాల్లో కార్యకర్తలు పలువురు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న బీసీ నాయకుడు జగదీశ్వర్‌గౌడ్‌కు వారం రోజుల్లోగా శేరిలింగంపల్లి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 10 డివిజన్లలోని నాయకులు, కార్యకర్తలను ఏకం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికీ అధిష్టానం తలొగ్గకుంటే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని తేల్చిచెప్పారు. అయినా పార్టీ విధానంలో మార్పు రాకపోతే తమ నాయకుడు జగదీశ్వర్‌గౌడ్ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో ఉంటారని తెలిపారు. ఆయన గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అన్ని విధాలా అర్హుడైన జగదీశ్వర్‌గౌడ్‌ను కాదని టీడీపీ నుంచి వచ్చిన ఆరెకపూడి గాం«ధీకి టికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. సమావేశంలో స్థానిక పార్టీ నాయకులు నల్లా సంజీవరెడ్డి, తయార్ హుస్సేన్, నాగేశ్వర్రావు, మోహన్ నాయక్, జీవీ రెడ్డి, లక్ష్మీనారాయణ, దేవేందర్, సాదిక్, సయ్యద్ సత్తార్ హుస్సేన్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్, మోసిన్, అజీజ్, సాజిద్, భాగ్యారావు, శ్యామ్, కృష్ణ, రాధారాణి, సరోజ, దేవి, బిందు, రత్నమ్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు. -
ఫోర్జరీ సంతకాలతో భూవిక్రయం
మంచాల: ఫోర్జరీ పత్రాలు సృష్టించి 10 ఎకరాల భూమిని విక్రయించిన నిందితులు కటకటాలపాలయ్యారు. మరికొందరు పరారీలో ఉన్నారు. మంచాల సీఐ జగదీశ్వర్ గురువారం సాయంత్రం స్థానిక ఠాణాలో కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని ఆగాపల్లి గ్రామంలోని 182,183 సర్వే నంబర్లలోని 10 ఎకరాల భూమిని గతంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన లింగాల నాగభూషణ్‌కొనుగోలు చేశాడు. ఆయనకు తెలియకుండా 2012లో ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఈ భూమిని కొందరు ఇతరులకు రూ. కోటి రెండు లక్షలకు విక్రయించారు. ఈవిషయం తెలుసుకున్న నాగభూషణ్ గత జూన్ 4న మంచాల పోలీసులతో పాటు కోర్టును ఆశ్రయించాడు. ఈ ‘అక్రమ’ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన రాయపోల్ గ్రామానికి చెందిన ముత్యంరెడ్డితో పాటు ఆగాపల్లి గ్రామస్తులు పందుగుల సత్తయ్య, పందుగుల యాదయ్య, పందుగుల వీరస్వామి, పందుగుల శ్రీకాంత్‌గౌడ్, దూసరి నాగభూషణ్‌గౌడ్, నాగన్‌పల్లి గ్రామానికి చెందిన శివకుమార్‌గౌడ్, గున్‌గల్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు యాదయ్యతో పాటు మరో పదిహేను మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ముత్యంరెడ్డితో పాటు మరో ఏడు మందిని రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు. మిగ తా వారు పరారీలో ఉన్నారని, వారినీ త్వరలో అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు. కాగా ఈ ‘అక్రమ’ వ్యవహారంలో పలువురు నాయకలు, అధికారుల హస్తం ఉందని సమాచారం. -
జలమండలికి ఇద్దరు కొత్త సారథులు..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కీల కమైన మంచినీటి సరఫరా విభా గం జలమండలికి ప్రభుత్వం ఇద్దరు కొత్త సారథులను నియమించింది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిని బదిలీ చేసి కొత్త వారికి పోస్టింగ్ ఇచ్చింది. గురువారం జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో మేనేజింగ్ డెరైక్టర్‌గా ఎం.జగదీశ్వర్ (1993 బ్యాచ్ ఐఏఎస్), ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా అహ్మద్ బాబు (2003 బ్యాచ్ ఐఏఎస్) నియమితులయ్యారు. జగదీశ్వర్ గతంలో రెండున్నరేళ్లకుపైగా జలమండలి ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటివరకు ఇక్కడ ఎండీగా పనిచేసిన జె.శ్యామలరావును తప్పించారు. ఆయన ఏపీ సర్కార్‌లో పనిచేసేందుకు ఆప్షన్ ఇచ్చినందునే ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదని తెలి సింది. ఆయన సుమారు 22 నెలలుగా ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. జలమండలి ఈడీగా ఉన్న జగన్మోహన్ ఆదిలాబాద్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. అక్కడి కలెక్టర్ అహ్మద్ బాబు జలమండలి ఈడీగా నియమితులయ్యారు. బదిలీల్లో కన్పించిన హరీష్‌రావు మార్క్..! జలమండలి ఎండీ, ఈడీల బదిలీ విషయంలో బోర్డు గుర్తింపు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులైన ఇరిగేషన్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు ప్రమేయమున్నట్టు తెలుస్తోంది. గతంలో జలమండలి మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేసిన ఎం.జగదీశ్వర్‌కు హరీష్‌రావు ఆశీస్సులున్నట్టు సమాచారం. అందుకే ఆయనకు తిరిగి కీలకమైన ఎండీ బాధ్యతలు అప్పగించడంలో హరీష్ చక్రం తిప్పినట్టు తెలిసింది. కలెక్టర్ పోస్టు కోసం ఎదురుచూస్తున్న ఈడీ డాక్టర్ జగన్మోహన్కు ఆదిలాబాద్ కలెక్టర్ బాధ్యతలు దక్కడం వెనుక హరీష్‌రావు సహకారం ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త ఎండీకి సమస్యలే స్వాగత తోరణం.. మూడున్నరేళ్లవిరామం తర్వాత తిరిగి జలమండలి ఎండీగా బాధ్యతలు స్వీకరించనున్న ఎం.జగదీశ్వర్‌కు పలు సమస్యలు స్వాగతం పలుకనున్నాయి. అవి.. వివాదాస్పదమైన జీపీఈ(జనరల్ పర్పస్ ఎంప్లాయ్) పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయడం. బోర్డులో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎన్ఎంఆర్, హెచ్ఆర్ కార్మికులకు న్యాయం చేయడం.సుదూర ప్రాంతాల నుంచి నగరానికి తరలిస్తున్న మంచినీటిలో సరఫరా నష్టాలను 40 నుంచి 20 శాతానికి తగ్గించాల్సి ఉంది.జలమండలికి రావాల్సిన రూ.200 కోట్ల నీటిబిల్లులను వసూలు చేయాలి. గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపాలిటీల్లో డ్రైనేజీ, మంచినీటి వసతులను కల్పించాలి. ఇందుకోసం జేఎన్ఎన్యూఆర్ఎం రెండో దశ కింద మంజూరైన పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన జగదీశ్వర్ జలమండలి నూతన మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమితులైన జగదీశ్వర్ గురువారం సాయంత్రం ఖైరతాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో ప్రస్తుత ఎండీ శ్యామలరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. బదిలీ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆయన విధుల్లో చేరడం విశేషం. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.