
సాక్షి, రంగారెడ్డి: ఐదు రోజుల క్రితం మంచాల కేజీబీవీ హాస్టల్ నుంచి పారిపోయిన ఇద్దరు బాలికల్లో ఒకరి ఆచూకీ లభ్యమైందని మంచాల ఎస్సై రామన్‌గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐదు రోజుల క్రితం 9వ తరగతి చదువుతున్న సమ్రీన్(14), 8వ తరగతి చదువుతున్న నుస్రాత్(13) పారిపోయారు. ఇందులో నుస్రాత్‌ను మంగళవారం శంషాబాద్‌లోని వారి బంధువుల ఇంట్లో గుర్తించినట్లు వెల్లడించారు. సమ్రీన్ ఆచూకీ లభించలేదని నల్గొండలోని వారి బంధువులకు ఇంటికి వెళ్తున్నట్లు సమాచారం లభించిందన్నారు.
చదవండి: ఫోన్ మాట్లాడుతుంటే మందలించారని.. వాష్‌రూంలోకి వెళ్లి..
Comments
Please login to add a commentAdd a comment