రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి గిరిజను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మంచాల : రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి గిరిజను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే రిస్క్యూ ఆపరేషన్కు బండరాళ్లు అడ్డంకిగా మారుతున్నాయి. మంచాల సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నాలుగేళ్ల గిరిజ ఆదివారం ఉదయం బోరు బావిలో పడిన విషయం తెలిసిందే.
ఎన్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి మైన్స్ టీంలు నిర్విరామంగా పనిచేస్తున్నా మంగళవారం ఉదయం వరకూ కూడా బాలికను కనుగొనలేకపోయారు. 45 అడుగుల లోతులో చిన్నారి ఉందని భావిస్తున్న అధికారులు బోరుబావికి సమాంతరంగా జేసీబీల సాయంతో తవ్వకం చేపట్టారు. బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నారు. మరోవైపు చిన్నారి కోసం ఆమె తల్లిదండ్రులు, బంధువులు విలపిస్తున్నారు. గిరిజ క్షేమంగా బయటకు రావలని ప్రార్థనలు చేస్తున్నారు.