మంచాలః మంచాల మండలంలో ఉపాధిహామీ పథకం పనితీరు కంచె చేను మేసిన చందంగా తయారైంది. కూలీల కు అందాల్సిన డబ్బు మాయం కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటి,రెండు కాదు...లక్షలాది రూపాయలు నేటికీ కూలీలకు అందక వారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. మంచాల మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 983 శ్రమ శక్తి సంఘాలు ఉన్నాయి. 20,778 మంది కూలీలు వీటిలో నమోదై ఉన్నారు.
ఇందులో లోయపల్లిలో 1200 మంది కూలీలు ఉన్నారు. వారందరూ ఈ పథకం కింద పని చేశారు. పనిచేసి ఏడాదైనా కూలి డబ్బులు ఇవ్వడం లేదు. అధికారులు సైతం కూలీలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లోయపల్లిలోనే ఈ ఏడాది ఆగస్టు 14వరకు కోటి 19లక్షల35వేల268 రూపాయలు పని జరిగింది.వాటిలో 55శాతం మాత్రమే కూలి డబ్బులు వచ్చాయి. మిగిలిన 45శాతం కూలీలకు కూలి డబ్బులు రాలేదు. వస్తాయోరావో కూడా తెలియక కూలీ లు అల్లాడుతున్నారు. ఇదిలా ఉండగా లోయపల్లిలోనే 2013 జూన్ వరకు కూలీలకు రూ.26,07,243ల కూలి డ బ్బులు రావాల్సి ఉంది.
అంతలోనే గ్రామ పంచాయితీ ఎన్నికలు వచ్చాయి. దీంతో కూలీల డబ్బును సంబంధితాధికారులు వాపసు తీసుకెళ్లారు. గ్రామా ల్లో ఎక్కడా సక్రమంగా తిరిగి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఉపాధిహామీ కూలీల డబ్బులు పంపిణీ వ్యవహారం యాక్సిస్ బ్యాంకు నుండి మణిపాల్ బ్యాంకుకు మారింది. ఈ క్రమంలోనే కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు మాయమయ్యాయి. ఉపాధిహామీ అధికారులు, సిబ్బంది అందినకాడికి చేజి క్కించుకున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆ గ్రామస్తులు ఈ డబ్బుల వ్యవహారం లో యాక్సిస్ బ్యాంకు వారిని నిలదీ యగా తాము ఇచ్చామని 26 పే ఆర్డర్ల తో పాటు ఎఫ్‌టీఓ నంబర్లు కూడా ఇచ్చారు.
కానీ వాటికి సంబంధించిన డ బ్బులు కూలీలకు అందలేదు. కూలీలు నేటికీ కూలి డబ్బుల కోసం మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కొక్క ఇంటిలో కూలీలకు ఎనిమిది నుండి పది వేల రూపాయల వరకు కూలి డబ్బులు రావాల్సి ఉంది. అనేక సార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు. చివరకు ప్లేస్ల్విప్పుల జిరాక్స్ తీసి అధికారులకు అందజేశారు.
డబ్బు మాయంపై విచారణ జరిపించి కూలీ లకు రావాల్సిన కూలిని తక్షణం చెల్లిం చాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే విషయంపై ఏపీఓ వీరాంజనేయులును వివరణ కోరగా రూ. 10లక్షల వ రకు కూలీలకు కూలి డబ్బు రావాల్సి ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈనెల 25న గ్రామానికి వెళ్లి పూర్తి స్థా యిలో విచారణ చేసి అందరికీ డబ్బు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
‘ఉపాధి’ డబ్బు ఏమైంది..?
Published Tue, Sep 23 2014 11:36 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement