మంచాల, న్యూస్‌లైన్ : ఆడపిల్లల పట్ల వివక్ష, భ్రూణ హత్యలు, విక్రయాలు నిరోధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టిందని, అర్హులందరికీ ఈ పథకాన్ని అందజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర సమాచార, సాంకేతిక శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ దివ్యదేవరాజన్ పేర్కొన్నారు. గురువారం బంగారు తల్లి పథకం ఆన్‌లైన్ విధానంపై మంచాల మండల కేంద్రంలో ఇందిర క్రాంతి పథం, వైద్య, అంగన్‌వాడీ శాఖల సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి దివ్యదేవరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగారు తల్లి పథకాన్ని సమర్ధవంతంగా అమలుచేసేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్ విధానానికి శ్రీకారం చుట్టిందని, పైలట్ ప్రాజెక్టుగా మొదటగా రాష్ట్రంలో మంచాల మండలాన్ని ఎంచుకుందని చెప్పారు. ఈ కార్యక్రమం కింద గ్రామ సమాఖ్య ప్రతినిధుల(వీఓ)కు, ఏఎన్‌ఎంలకు ట్యాబ్లెట్ పీసీలు ఇవ్వనున్నట్టు తెలి పారు. ఆయా గ్రామాల్లో బంగారు తల్లి పథకానికి అర్హులైన వారితో పాటు గర్భిణులు, శిశువుల వివరాలను ఈ పీసీ ట్యాబ్లెట్లలో నమోదు చేసి, ఆన్‌లైన్‌లో పొందుపర్చి ఉన్నతాధికారులకు చేరవేయాల్సి ఉంటుందన్నారు. గర్భిణులకు ఇమ్యూనైజేషన్, వైద్య సేవల విషయాలను కూడా వీటిలో పొందుపర్చాలన్నా రు. ఇలా ప్రసవం జరిగేంతవరకు వివరాలను సేకరించి, పుట్టిన పసిపాపల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సి ఉంటుందన్నారు.
ఈ సందర్భం గా 40మంది వీఓలకు, 9మంది ఏఎన్‌ఎంలకు ట్యాబ్లెట్ పీసీలను దివ్యదేవరాజన్ అందజేశారు. పైన తెలిపిన వివరాలను అన్‌లైన్‌లో పొందుపర్చి ఉన్నతాధికారులకు అందించాలన్నారు. శుక్రవారం కూడా శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ట్యాబ్లెట్ పీసీలో వివరాల నమోదు, ఆన్‌లైన్ విధానం గురించి సెర్ప్ ఐటీ డెరైక్టర్ జాకబ్ అవగాహన కల్పించారు. బంగారు తల్లి పథకం సం చాలకులు రామశాస్త్రి, సాంకేతిక సంచాలకులు సురేష్‌కుమార్, ఏరియా కో ఆర్డినేటర్ నర్సింహ, డీఆర్‌డీఏ ఏపీడీ ఉమాదేవి, ఎంపీడీఓ నాగమణి, తహసీల్దార్ వెంకటే శ్వర్లు, డీపీఎంలు సురేఖ, గిరిజ, కళ్యాణి, మంచాల పీహెచ్‌సీ వై ద్యురాలు విజయలత, ఏపీఎం సత్యనారాయణ, మండల సమాఖ్య అధ్యక్షురాలు మంజుల, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
అర్హులందరికీ ‘బంగారు తల్లి’
Published Fri, Nov 29 2013 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM
Advertisement
Advertisement