divya deva rajan
-
ఆ ఘటన కలిచివేసింది: దివ్య దేవరాజన్
సాక్షి, హైదరాబాద్: అమీన్పూర్లో జరిగిన ఘటన కలిచివేసిందని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈఘటనపై మూడు ఎఫ్ఐఆర్లు ఇప్పటివరకు నమోదు చేశామని తెలిపారు. ఇప్పటికి ముగ్గురు నిందితులను అరెస్టయ్యారని, అక్కడ ఉన్న చిన్నారులను ప్రభుత్వ హోంకి తరలించామని వెల్లడించారు. నేటి నుంచి హైపవర్ కమిటీతో విచారణ జరుగుతుందన్నారు. డీజీపీ మహేందర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ అనాథాశ్రమాలపై విచారణ చేస్తున్నామన్నారు. పాప పోస్ట్‌మార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. 429 ప్రైవేట్ హోమ్స్ లో విచారణ చేస్తున్నామని ఆమె వెల్లడించారు. చివరిగా చిన్నారి స్టేట్మెంట్ ఇచ్చిందని, అందులో చిన్నారి బంధువు కూడా వైర్‌తో దాడి చేసినట్లు తెలిపిందన్నారు. ఆశ్రమంలో అమ్మాయిపైనా అఘాయిత్యం జరిగినట్లు చిన్నారి తెలిపిందని పేర్కొన్నారు. ఆగస్టు 20న హైపవర్ కమిటీ ప్రాథమిక నివేదిక అందిస్తుందని దివ్యదేవరాజన్ తెలిపారు. -
అధికారుల అంచనా తప్పిందా!?
సాక్షి, ఆదిలాబాద్ :అంచనా తప్పిందా.. ఆదివాసీ ఉద్యమం విషయంలో యంత్రాంగం తప్పటడుగు పడిందా.. అంటే అవుననే సమాధానమే వస్తుంది. సద్దుమణిగిందనే భావన.. ఇంటెలిజెన్స్ నివేదికలు అలాగే ఉన్న పరిస్థితుల్లో మరోసారి ఉద్యమ గళం ఉలిక్కిపడేలా చేసింది. డిసెంబర్ 9న ఢిల్లీలో తలపెట్టిన ఆదివాసీ సభ నేపథ్యంలో తాజాగా ఆదివాసీలు ఉట్నూర్‌లో కదం తొక్కడం బలప్రదర్శనగానే భావిస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి నేరుగానే హెచ్చరికలు జారీ చేశారు. రెండేళ్ల కిందట జిల్లాలో ఉత్పన్నమైన పరిస్థితుల నుంచి పూర్తిగా కుదుట పడ్డామన్న భావనలో ఉన్న జిల్లా యంత్రాంగానికి ఇది మింగుడుపడని వ్యవహారమే. తాజా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆందోళనకరమే. రెండేళ్ల పరిస్థితుల నుంచి.. డిసెంబర్ 9.. మళ్లీ ఈ తేదీకి ప్రాధాన్యం ఏర్పడింది. సరిగ్గా రెండేళ్ల క్రితం 2017లో ఆదివాసీలు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. సరిగ్గా ఆ రోజే ఈ ఉద్యమానికి నాంది పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆ రోజు హైదరాబాద్ సభకు పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివెళ్లారు. అప్పుడు ఈ ఉద్యమం పెద్దస్థాయిలో రాజుకుంటుందని అంచనా వేయలేకపోయారు. ఆ సభ తర్వాత ఉమ్మడి జిల్లాలో పూర్తిగా శాంతిభద్రతలు అదుపుతప్పి ఉద్యమ తీవ్రతను చాటింది. ఈ పరిస్థితుల్లో అప్పుడు ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు ప్రాధాన్యం సంతరించుకుంది. అప్పటి ఆదిలాబాద్ కలెక్టర్ జ్యోతిబుద్ధప్రకాష్, నిర్మల్ కలెక్టర్ ఇలంబరిది, కుమురంభీం కలెక్టర్ చంపాలాల్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్, కుమురంభీం ఎస్పీ సన్ప్రీత్సింగ్ల బదిలీలు చోటుచేసుకున్నాయి. వారి స్థానంలో అప్పుడున్న పరిస్థితుల్లో ఆదిలాబాద్ కలెక్టర్‌గా దివ్యదేవరాజన్, నిర్మల్ కలెక్టర్‌గా ప్రశాంతి, కుమురంభీం కలెక్టర్‌గా ప్రశాంత్ జీవన్‌పాటిల్, విష్ణు ఎస్.వారియర్‌ను నిర్మల్ నుంచి ఆదిలాబాద్ ఎస్పీగా, కుమురంభీం జిల్లా ఎస్పీగా కల్మేశ్వర్లను నియమించారు. ఆ తర్వాత క్రమంలో కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఎస్పీ కల్మేశ్వర్‌ల బదిలీలు జరిగాయి. ఇక దివ్యదేవరాజన్, ప్రశాంతి, విష్ణు ఎస్.వారియర్లు అప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోనే ఉన్నారు. ప్రధానంగా శాంతిభద్రతలను అదుపులోకి తేవడం, ఆదివాసీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఆ తర్వాత క్రమంలో ఉమ్మడి జిల్లాలో పరిస్థితులు మారాయి. వరుసగా ఎన్నికలు రావడం, ఎన్నికల అనంతరం ఆదివాసీ ఉద్యమానికి ప్రధానంగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోయం బాపురావు ఎంపీ కావడంతో ఇక్కడ వాతావరణం మారుతుందని యంత్రాంగం భావిస్తూ వచ్చింది. ప్రధానంగా ఆదిలాబాద్ కలెక్టర్ దివ్యదేవరాజన్ ఆదివాసీలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి ఈ రెండేళ్ల కాలంలో విశేషంగా చొరవ చూపారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమ రూపం మారిందేమోనన్న భావన యంత్రాంగంలో కనిపించింది. బలప్రదర్శన.. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆదివాసీ ఉద్యమ తీవ్రత లేదనే భావనతో పోలీసు యంత్రాంగంలో కనిపించింది. అయితే ఇటీవల ఐటీడీఏ పాలకవర్గ సమావేశం రోజు ఉట్నూర్‌లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు సమావేశం నిర్వహించిన కుమురంభీం కాంప్లెక్స్ వద్దకు వచ్చి మీటింగ్‌ను అడ్డుకునే యత్నాలు చేయడం ఒక్కసారిగా పోలీసు వర్గాలను నివ్వేరపోయేలా చేసింది. ఊహించని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఆదివాసీలు కేబీ కాంప్లెక్స్‌కు తరలిరావడంతో వారికి ఈ పరిస్థితి కత్తిమీదా సాములా తయారైంది. అటు తర్వాత తాజాగా సోమవారం ఉట్నూర్‌లో ఆదివాసీలు తుడుందెబ్బ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించిన ర్యాలీని పోలీసు వర్గాలు అసలు అంచనా వేయలేకపోయింది. వేలాది మంది ఆదివాసీ మహిళలు, పురుషులు ఉట్నూర్‌కు తరలివచ్చిన విధానం పోలీసులకు ఇప్పటికీ అంతుపట్టని రీతిలో ఉంది. ఇక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తిగా విఫలమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు ఉట్నూర్‌కు అంతా పెద్దఎత్తున తరలిరావడం, అసలు ఎక్కడి నుంచి ఇంతమంది ఒక్కసారిగా వచ్చారు.. ఓ మెమోరాండం ఇచ్చేందుకు వస్తున్నారని తెలిసినా ఇంత పెద్ద ఎత్తున వస్తారని ఊహించలేకపోయారు. వీరందరు ఉట్నూర్ వరకు ఎలా వచ్చారన్న సమాచా రం లేకపోవడంతో పోలీసు శాఖలోనే విస్మ యం వ్యక్తం చేస్తోంది. అలాగే ఆదివాసీ ఉద్యమంలో సోమవారం జరిగిన ర్యాలీ చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది. వారు ర్యాలీ నిర్వహిం చిన విధానం ఎవ్వరికి అంతుపట్టని రీతిలో ఉం ది. పోలీసు వర్గాలనే విస్మయ పర్చేలా ఆదివాసీ ఉద్యమ నాయకత్వం వ్యూహాలు రచిస్తున్నాయనడానికి నిన్న జరిగిన ర్యాలీయే నిదర్శనమన్న చర్చ సాగుతోంది. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఎంపీ సోయం బాపురావు పార్లమెం ట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్న సమయంలో అసలు ఈ ర్యాలీని ఎవరు అంచనా వేయలేకపోయారు. మరోపక్క ఎంపీ సో యం బాపురావు తాను ప్రత్యక్ష కార్యాచరణలో లేకపోయినా ఆయన కనుసన్నల్లోనే ఇది జరుగుతుందనేది పోలీసుల భావన. అయితే ఎవరికీ అంతుపట్టని రీతిలో ఉద్యమాన్ని కొనసాగించడం ద్వారా ఆదివాసీలు తమ సత్తా చాటుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే గళం.. డిసెంబర్ 9న ఢిల్లీలో ఆదివాసీలు భారీ సభ నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇందుకోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వేలాది మంది ఢిల్లీ తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సభ కోసం ఉమ్మడి జిల్లా నుంచి ప్రత్యేక రైళ్లను బుక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు అనేక బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో తరలివెళ్లేందుకు ఆదివాసీలు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా అనేక మంది ఆదివాసీలు విమానయానం ద్వారా కూడా హస్తీన బాట పట్టనున్నారు. దీంతో ఇప్పుడు మరోసారి డిసెంబర్ 9 ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానంగా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్‌తో 2017 డిసెంబర్ 9న హైదరాబాద్ సభ ద్వారా పడిన అడుగుకు ఇది కొనసాగింపుగా నిర్వహిస్తున్న సభగా నిర్వహిస్తున్నారు. ఆదివాసీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడి తరలివెళ్లేందుకు సిద్ధమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉంటే ఐటీడీఏ సమావేశం రోజు ఎంపీ సోయం బాపురావు వ్యాఖ్యలు అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొంతమంది అధికారులు ఆదివాసీల భాష నేర్చుకోవడం ద్వారా, గుస్సాడీ నృత్యం చేయడం ద్వారా ఉద్యమాన్ని అణచివేశారనే భావనలో ఉండవద్దని పరోక్షంగా హెచ్చరించడం ప్రస్తుత పరిస్థితులను తేటతెల్లం చేస్తున్నాయి. -
మారని రిమ్స్ ఆస్పత్రి
సాక్షి, ఆదిలాబాద్: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా రిమ్స్‌లో కొంతమంది వైద్యుల తీరు మారడం లేదు. నవిపోదురూ.. నాకేంటి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గిరిజన మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి 2008లో రూ.125 కోట్లతో రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)ను ఏర్పాటు చేశారు. 500 పడకలతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. కార్పొరేట్ వైద్యం అందుతుందని భావించిన ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదు. జ్వరం, చిన్నపాటి రోగాలు తప్పా గుండెనొప్పి, క్యాన్సర్ తదితర వ్యాధుల చికిత్స కోసం నాగ్‌పూర్, యావత్మాల్, హైదరాబాద్, తదితర ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు. గుండెనొప్పితో రిమ్స్‌లో చేరిన కన్జర్వేటర్ ఫారెస్టుకు సరైన వైద్యం అందక ఆస్పత్రిలోనే మృతిచెందిన సంఘటనలు అనేకం. జూనియర్ డాక్టర్లతోనే నెట్టుకొస్తున్నారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందకపోవడంతో వారు ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతూ ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. మధ్యాహ్నమే ఇంటిముఖం.. రిమ్స్‌లో పనిచేసే వైద్యులు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వహించాలి. కానీ కొంతమంది వైద్యులు ఆలస్యంగా రావడమే కాకుండా మధ్యాహ్నమే ఇంటిబాట పడుతున్నారు. ఈ విషయం రిమ్స్ అధికారులకు, జిల్లా అధికారులకు తెలిసినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ప్రైవేట్ క్లినిక్‌లు నిర్వహిస్తూ డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రిమ్స్‌లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేదు. కొంతమంది వైద్యులు విధులకు హాజరుకానప్పటికీ వేతనాలు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జూనియర్లతోనే వైద్యం.. రిమ్స్ ఆస్పత్రి జూనియర్ వైద్యులతోనే కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు. ఎమర్జెన్సీతో పాటు అన్ని వార్డుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు జూనియర్ డాక్టర్లే విధులు నిర్వహిస్తున్నారు. శిక్షణలో ఉన్న వీరు రోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉంటే రోగి పరిస్థితిని సీనియర్ వైద్యుడికి ఫోన్ ద్వారా విన్నవించి ఎలాంటి వైద్యం అందించాలి అనే వివరాలను తెలుసుకుంటున్నారు. రాత్రి వేళల్లో కనీసం ఒకరిద్దరు సీనియర్ వైద్యులు కూడా ఉండటం లేదు. రాత్రి డ్యూటీలో ఉండాల్సిన వైద్యులు ఇంటి వద్ద ఉండడంతో అత్యవసర సమయంలో వైద్యుడి ఇంటికి వాహనాన్ని పంపించి వారిని రిమ్స్‌కు తీసుకొస్తున్నారు. ఖాళీల జాతర.. గత కొన్నేళ్లుగా రిమ్స్ ఆస్పత్రితో పాటు వైద్య కళాశాలలో పోస్టుల ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. దీంతో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందకపోగా మెడికోలకు సైతం సరైన రీతిలో విద్యాబోధన జరగడం లేదనే ఆరోపణలున్నాయి. రిమ్స్‌కు మొత్తం 151 పోస్టులు మంజూరు ప్రస్తుతం 95 మంది వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారు. 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్టులు 21కి ఏడుగురు పనిచేస్తుండగా, 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ 30 పోస్టులకు 15 మంది పనిచేస్తుండగా, మరో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ 41 పోస్టులకు గాను 34 పనిచేస్తున్నారు. 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ట్యూటర్ పోస్టులు 59కి 39 మంది విధులు నిర్వహిస్తున్నారు. మరో 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రి అంతా కంపు కంపు రిమ్స్ ఆస్పత్రి ఆవరణతో పాటు వార్డులన్నీ కంపు కొడుతున్నాయి. మరుగుదొడ్లు సరిగా లేవు. చెత్తాచెదారం శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. రిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన వారు ముక్కున వేలుసుకొని, మూతికి గుడ్డ పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ఆస్పత్రిలో రోగులను చూడటానికి వచ్చిన వారి బంధువులు రోగాల భారీన పడాల్సి వస్తుందని చర్చించుకుంటున్నారు. పారిశుధ్యం కోసం నెలకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ కరుణాకర్, రిమ్స్ సూపరింటెండెంట్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా వారు స్పందించ లేదు. సెప్టెంబర్ 14న జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ రిమ్స్ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒకరిద్దరు వైద్యులు తప్పా ఎవరూ అందుబాటులో లేరు. వైద్యులు విధులను విస్మరించి ప్రైవేట్ క్లీనిక్‌లు నిర్వహిస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ పలుసార్లు రిమ్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులతో సమావేశం నిర్వహించారు. రోగులకు నాణ్యమైన సేవలు అం దించాలని, సమయపాలన పాటించాలని సూచిం చారు. విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని పలు మార్లు ఆదేశించినప్పటికీ రిమ్స్ వైద్యుల తీరులో మా త్రం మార్పు కానరావడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తనిఖీలు చేపడుతున్నప్పటికీ కూడా వారిలో చలనం లేకుండా పో యిందని పలు వురు పేర్కొంటున్నారు. ఇదీ రిమ్స్ వైద్యుల తీరు.. -
‘దివ్య’మైన ఆలోచన
ఆదిలాబాద్‌అర్బన్: కలెక్టర్ దివ్యదేవరాజన్ పరిపాలన తీరే సెపరేటు. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. ఏ పనిలో పాలు పంచుకున్నా.. అందులోని ప్రాధాన్యతను గుర్తించి గుర్తుండి పోయేలా ముద్ర వేయడం ఆమె ప్రత్యేకత. దొరికిన ఏ కొంత సమయాన్నైనా ప్రజలకు ఉపయోగపడేలా మలచడం కలెక్టర్‌కు ఉన్న అలవాటు. అందులో భాగంగానే 2019లో పూర్తి చేయాల్సిన లక్ష్యాన్ని కలెక్టర్ కొత్త ఏడాది మొదటి రోజు నుంచే ప్రారంభించారని చెప్పవచ్చు. కొత్త సంవత్సరం సందర్భంగా స్వీట్లతో వచ్చి పూలబొకేలు కలెక్టర్‌కు ఇచ్చి శుభాకాంక్షలు తెలపడం సహజం. దీంతో అధిక ధరకు కొనుగోలు చేసి తీసుకువచ్చిన పూలబొకేలు కొన్ని రోజులకు చెడిపోయి ఎక్కడో పడేయాల్సి వస్తోంది. బొకేల వల్ల ఉపయోగం లేక పోవడంతో ఈసారి వినూత్నంగా ఆలోచించారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చే ఎవరైనా సరే బొకేలకు బదులు దుప్పట్లు, బ్లాంకెట్లు, శాలువాలు, రగ్గులు తీసుకురావాలన్నారు. పేదలకు అవి పంపిణీ చేసేందుకు ఉపయోగపడుతాయనేది కలెక్టర్ ఉద్దేశం. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ దివ్యదేవరాజన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజలు శాలువాలు, రగ్గులు, దుప్పట్లు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వాటిని వెనుకబడిన ప్రాంతాల్లోని పేదలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
ఆదివాసీ మహిళలతో ఆదిలాబాద్ కలెక్టర్ డ్యాన్స్
-
అటెండర్ పెళ్లిలో కలెక్టర్ డ్యాన్స్.. వీడియో వైరల్
గుడిహత్నూర్(బోథ్): ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ అటెండర్ పెళ్లికి హాజరై ఆదివాసీ మహిళల కలిసితో డ్యాన్స్ చేశారు. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా మహిళలతో కలిసి ఆమె థింసా నృత్యం చేయడం పెళ్లికి వచ్చిన వారిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తన క్యాంపు కార్యాలయంలో తోటమాలిగా పని చేస్తున్న ఆదివాసీ యువకుడు నైతం సుధాకర్ వివాహ వేడుక మండలంలోని గోపాల్పూర్ గ్రామంలో శుక్రవారం జరిగింది. ఈ వేడుకకు కలెక్టర్ దివ్యదేవరాజన్ హాజరుకావడం ప్రత్యేకతను సంచరించుకుంది. ఆదివాసీ తోటి తెగ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక జరుగుతుండగా కలెక్టర్ ఆదివాసీ మహిళలతో కలిసి నేలపై కూర్చుని ఆ తంతును తిలకించారు. ఆదివాసీ సంప్రదాయల గురించి మహిళలను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఆమె మహిళలతో కలిసి థింసా నృత్యాలు చేశారు. జిల్లా కలెక్టర్ వివాహ వేడుకకు హాజరుకావడంతో పెళ్లింటి వారు, బంధుమిత్రులు, గ్రామస్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. -
‘రైతుబంధు’ పకడ్బందీగా అమలు చేయాలి
ఆదిలాబాద్‌అర్బన్: రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి చెక్కులను పకడ్బందీగా గ్రామాల వారీగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. ఎకరానికి రూ.4 వేలు ఆర్థిక పెట్టుబడి కింద ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వివిధ మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతగా జిల్లాలో 173 గ్రామాల్లో రూ.63.76 కోట్ల విలువైన 41,120 చెక్కులను రైతులకు అందజేస్తామని అన్నారు. గ్రామాల వారీగా షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలని చెప్పారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం వేదికను పాఠశాలల్లో ఏర్పాటు చేసుకోవాలని, స్థలాలు లేని ప్రాంతాల్లో టెంట్లు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏయే గ్రామాల రైతులకు ఎక్కడెక్కడ చెక్కులను తీసుకోవాలో ముందుగా గ్రామాల్లో రైతులకు తెలపాలని అన్నారు. ఆయా చెక్కులను పట్టాదార్లకు మాత్రమే ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. పంపిణీ తీరును వీడియో చిత్రీకరించాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. చెక్కులను ఆయా మండల పోలీస్‌స్టేషన్‌లో భద్రపర్చాలని, పంపిణీ కానీ చెక్కులను ఆయా పోలీస్‌స్టేషన్‌లో ఉంచాలని అన్నారు. వీఆర్వోలు, వీఆర్ఏలు ఆర్వోఆర్, వన్–బీలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పంపిణీకి రైతు సమన్వయ సమితుల సభ్యులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని పేర్కొన్నారు. వేసవి కాలం దృష్ట్యా ఆయా పంపిణీ స్థలాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అందుబాటులో ఉం చుకోవాలని సూచించారు. మరిన్ని సూచనలకు ఈ నెల 17న సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేయనున్నట్లు వివరించారు. పంపిణీ చేసే చెక్కులకు నగదు సమకూర్చుకోవాలన్నారు. అనంతరం ఎల్డీఎం ప్రసాద్ మాట్లాడుతూ రిజర్వు బ్యాంకు సహకారంతో నగదు నిల్వలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సంబంధిత పట్టాదారుడికి మాత్రమే నగదు చెల్లిస్తామని, పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్, ఓటర్ ఐడీ కార్డు తీసుకురావాలని తెలిపారు. ఎస్బీఐకి చెందిన చెక్కులు ఆదిలాబాద్‌లోని ఏదైనా ఎస్బీఐ బ్రాంచీలో నగదు పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో లు జగదీశ్వర్‌రెడ్డి, సూర్యనారాయణ, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, బ్యాంకు మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి ఆదిలాబాద్‌అర్బన్: గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వివిధ మండలాల ఎంపీడీవోలు, ఇతర మండల స్థాయి అధికారులతో హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 78 గ్రామ పంచాయతీల్లో నిర్మించాల్సిన మరుగుదొడ్లను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. మొదటి ఫొటోలను అప్లోడ్ చేయాలని సూచించారు. నిర్మాణాలకు కావాల్సిన రూ.40 లక్షల రివాల్వింగ్ ఫండ్‌ను మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు. గిరిజన ప్రాంతాల్లో గృహోపకరమైన మొక్కలు పెంచాలని, గ్రామాల్లో హరితహారం రిజిస్ట్రార్‌ను ప్రారంభించాలని, గ్రామాల పర్యటనలో భాగంగా పరిశీలిస్తామని తెలిపారు. మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని, ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలన్నారు. గ్రామాల్లో పన్ను వసూళ్లు వందశాతం చేయాలని పేర్కొన్నారు. మండలాలు, గ్రామాల వారీగా మరుగుదొడ్ల నిర్మాణాలు, మొక్కల సంరక్షణ వంటి వాటిపై ఆయా గ్రామాల ఇన్చార్జిలు, ఎంపీడీవోలతో సమీక్షించారు. ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
నాణ్యమైన సేవలందించాలి
జైనథ్(ఆదిలాబాద్): సమయానుసారం పీహెచ్సీలో అందుబాటులో ఉంటూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆమె ఆకస్మికంగా మండల కేంద్రంలోని పీహెచ్‌సీని తనిఖీ చేశారు. వార్డ్, లేబర్ రూం, ఆపరేషన్ థియేటర్, స్కానింగ్ మెషిన్, మందుల గదిని పరిశీలించారు. యాంటీ స్నేక్ వీనం, యాంటీ రేబీస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయా? అని ప్రత్యేకంగా ఫార్మసిస్ట్ రవీందర్‌ను అడిగారు. పీహెచ్‌సీకి స్టాఫ్ నర్స్ పోస్ట్ లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉందని, వైద్యురాలు చైతన్య స్రవంతి ఆమెకు విన్నవించారు. త్వరలోనే పోస్ట్ మంజూరుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పీహెచ్‌సీని రౌండ్ ది క్లాక్గా మార్చాలని విన్నవించారు. పాత భవనం శిథిలావస్థకు చేరినందున కొత్త భవనం మంజూరు చేయాలని కలెక్టర్‌కు విన్నవించారు. విధులపై నిర్లక్ష్యం వహించరాదు.. కలెక్టర్ దివ్య దేవరాజన్ పీహెచ్‌సీని తనిఖీ చేసిన తరువాత, డీఎంహెచ్‌వో సైతం ప్రత్యేకంగా సిబ్బందితో మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. జూనియర్ అసిస్టెంట్ లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. విధులు సక్రమంగా నిర్వహించని వారిని ఉపేక్షించేది లేదని, కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట సూపర్వైజర్ సుభాష్, ఇతర సిబ్బంది ఉన్నారు. -
ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
ఆదిలాబాద్ అర్బన్: 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను తెలంగాణ స్వాతంత్య్ర సమయోధులుగా గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని ఫ్రీడమ్ ఫైటర్స్ ఈశ్వర్‌సింగ్, విఠల్‌రావు అన్నారు. ఈమేరకు కలెక్టర్ దివ్యదేవరాజన్‌ను క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1969 నాటి ఉద్యమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులు, యువకులు పోలీసు లాఠీచార్జీలతో వికలాంగులుగా మారి జీవితంలో ఉద్యోగం రాకుండా ఉన్నారని తెలిపారు. తొలి ఉద్యమంలో పాల్గొన్నవారంతా ఇప్పుడు వయస్సు మళ్లీన వారేనన్నారు. ఆరోగ్య పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యమకారులను గుర్తించి పింఛన్ సౌకర్యం కల్పించాలని, ఉచిత బస్‌పాస్‌లు, సొంత ఇళ్లు, నాటినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కలెక్టర్‌ను కోరారు. -
అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
ఉట్నూర్(ఖానాపూర్): గిరిజన దర్బార్‌కు వచ్చే ప్రతీ అర్జీని ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌కు కలెక్టర్ హాజరై గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉట్నూర్ మండలం చాందూరి గ్రామానికి చెందిన మేస్రం మారుతి వికలాంగ పింఛన్ అందించాలని విన్నవించగా.. పింఛన్ మంజూరుతో పాటు మూడు చక్రాల సైకిల్ పంపిణీ చేయాలని డీఆర్డీఏ పీడీ, డీడబ్ల్యూవోను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్‌కు వచ్చిన కాల్స్‌పై సమీక్షించారు. ఇటీవల వడగళ్లతో దెబ్బతిన్న పంటలకు పరిహారం విషయమై ఇన్సూరెన్స్ అధికారులతో ఈనెల 21న సమావేశం ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. ఉపాధి, పింఛ న్ల మంజూరు, భూసమస్యలు, ఎకనామిక్ సపోర్టు స్కీం కింద రుణాలు మంజూరు చేయాలని తదితర సమస్యలపై 310 అర్జీలు రాగా వెంటనే పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, డీటీడీవో పోచం, ఏపీవో నాగోరావు, డీఆర్డీఓ రాజేశ్వర్ రాథోడ్, జిల్లా వ్యవసాయ అధికారి ఆశాకుమారి, జిల్లా, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు. నీటి సమస్య పరిష్కరించాలి మా గ్రామంలో ఏళ్ల తరబడి నీటి సమస్య ఉంది. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఉన్న చేతి పంపులు పాడైపోయినయ్. తాగునీళ్ల కోసం దూరంగా ఉన్న బోరింగ్ల వద్దకు వెళ్లాల్సి వస్తంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. – నైతం శోభ, హస్నాపూర్ మూడేండ్ల సంది తిరుగుతన్నం.. మేం మూడేండ్ల సంది లోను కోసం తిరుగుతన్నం. ఎడ్లబండ్ల లోను కోసమని దరఖాస్తు ఇచ్చాం. రెండేండ్ల కిందనే బ్యాంకు కన్సల్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే లోను మంజూరు అయినా మాకు సమాచారం అందక ఆగిపోయింది. అధికారులు తొందరగా స్పందించి లోను ఇప్పించేలా చర్యలు తీసుకోవాలె. -ఆదిలాబాద్ మండలం కొలాంగూడ గ్రామస్తులు మేకల లోను మంజూరు చేయాలె మాకు ఉపాధి కోసం మేకల లోను, పంట చేన్లకు నీటి సౌకర్యం కోసం బోర్వెల్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాం. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం.. లోను తొందరగా వస్తదని అనుకుంటున్నం. -ఉట్నూర్మండలం చిన్నుగుడ గ్రామ గిరిజనులు -
అర్హులందరికీ ‘బంగారు తల్లి’
మంచాల, న్యూస్‌లైన్ : ఆడపిల్లల పట్ల వివక్ష, భ్రూణ హత్యలు, విక్రయాలు నిరోధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టిందని, అర్హులందరికీ ఈ పథకాన్ని అందజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర సమాచార, సాంకేతిక శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ దివ్యదేవరాజన్ పేర్కొన్నారు. గురువారం బంగారు తల్లి పథకం ఆన్లైన్ విధానంపై మంచాల మండల కేంద్రంలో ఇందిర క్రాంతి పథం, వైద్య, అంగన్వాడీ శాఖల సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి దివ్యదేవరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగారు తల్లి పథకాన్ని సమర్ధవంతంగా అమలుచేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానానికి శ్రీకారం చుట్టిందని, పైలట్ ప్రాజెక్టుగా మొదటగా రాష్ట్రంలో మంచాల మండలాన్ని ఎంచుకుందని చెప్పారు. ఈ కార్యక్రమం కింద గ్రామ సమాఖ్య ప్రతినిధుల(వీఓ)కు, ఏఎన్ఎంలకు ట్యాబ్లెట్ పీసీలు ఇవ్వనున్నట్టు తెలి పారు. ఆయా గ్రామాల్లో బంగారు తల్లి పథకానికి అర్హులైన వారితో పాటు గర్భిణులు, శిశువుల వివరాలను ఈ పీసీ ట్యాబ్లెట్లలో నమోదు చేసి, ఆన్లైన్లో పొందుపర్చి ఉన్నతాధికారులకు చేరవేయాల్సి ఉంటుందన్నారు. గర్భిణులకు ఇమ్యూనైజేషన్, వైద్య సేవల విషయాలను కూడా వీటిలో పొందుపర్చాలన్నా రు. ఇలా ప్రసవం జరిగేంతవరకు వివరాలను సేకరించి, పుట్టిన పసిపాపల వివరాలను కూడా ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భం గా 40మంది వీఓలకు, 9మంది ఏఎన్ఎంలకు ట్యాబ్లెట్ పీసీలను దివ్యదేవరాజన్ అందజేశారు. పైన తెలిపిన వివరాలను అన్లైన్లో పొందుపర్చి ఉన్నతాధికారులకు అందించాలన్నారు. శుక్రవారం కూడా శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ట్యాబ్లెట్ పీసీలో వివరాల నమోదు, ఆన్లైన్ విధానం గురించి సెర్ప్ ఐటీ డెరైక్టర్ జాకబ్ అవగాహన కల్పించారు. బంగారు తల్లి పథకం సం చాలకులు రామశాస్త్రి, సాంకేతిక సంచాలకులు సురేష్‌కుమార్, ఏరియా కో ఆర్డినేటర్ నర్సింహ, డీఆర్డీఏ ఏపీడీ ఉమాదేవి, ఎంపీడీఓ నాగమణి, తహసీల్దార్ వెంకటే శ్వర్లు, డీపీఎంలు సురేఖ, గిరిజ, కళ్యాణి, మంచాల పీహెచ్సీ వై ద్యురాలు విజయలత, ఏపీఎం సత్యనారాయణ, మండల సమాఖ్య అధ్యక్షురాలు మంజుల, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.