ఆదిలాబాద్ అర్బన్: 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను తెలంగాణ స్వాతంత్య్ర సమయోధులుగా గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని ఫ్రీడమ్ ఫైటర్స్ ఈశ్వర్‌సింగ్, విఠల్‌రావు అన్నారు. ఈమేరకు కలెక్టర్ దివ్యదేవరాజన్‌ను క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1969 నాటి ఉద్యమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులు, యువకులు పోలీసు లాఠీచార్జీలతో వికలాంగులుగా మారి జీవితంలో ఉద్యోగం రాకుండా ఉన్నారని తెలిపారు.
తొలి ఉద్యమంలో పాల్గొన్నవారంతా ఇప్పుడు వయస్సు మళ్లీన వారేనన్నారు. ఆరోగ్య పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యమకారులను గుర్తించి పింఛన్ సౌకర్యం కల్పించాలని, ఉచిత బస్‌పాస్‌లు, సొంత ఇళ్లు, నాటినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కలెక్టర్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment