ఆధార్, రేషన్ కార్డులుంటేనే రుణమాఫీ
రైతు రుణాల మాఫీకి ఏపీ ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు పెడుతోంది. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఉన్నవాళ్లకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అలాగే ఉద్యాన పంటలకు కూడా రుణమాఫీ వర్తించదట. పంట రుణాల మాఫీపై అభ్యంతరాలు తెలియజేసేందుకు ఏపీ ప్రభుత్వం మరో రోజు గడువు పెంచింది. ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మంది నుంచి అభ్యంతరాలు వచ్చాయి.
రుణమాఫీ కింద మొత్తం 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని సర్కారు చెబుతోంది. ఈనెల 13, 14, 15, 16 తేదీలలో లబ్ధిదారుల వడపోత కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఇప్పటివరకు పంట రుణాలు ఉన్నవారిలో మాఫీకి తిరస్కరించిన వారి జాబితాను బ్యాంకులకు పంపించామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో రైతులకు బాండ్లు జారీ చేస్తున్నామని అంటున్నారు.