వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదగోని జంగయ్య గౌడ్
మంచాల: రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలు వెంటనే మాఫీ చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదగోని జంగయ్య గౌడ్ డిమాండ్ చేశారు. మంచాలలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం కూతల ప్రభుత్వమని విమర్శించారు. ఆచరణలో ఏ ఒక్క హామీ అమలు చేయలేదని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు రెండేళ్లయినా మాఫీ చేయలేదని చెప్పారు. పంట రుణాల కోసం రైతులు కాళ్లకు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని తెలిపారు. పంట రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. రైతులను మోసం చేసిన ప్రభుత్వాలను భవిష్యత్‌లో పుట్టగతులు ఉండవని విమర్శించారు. పంట రుణాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నల్లప్రభాకర్, నాయకులు బకున రమేష్, శ్రీకాంత్, లోంగారి యాదగిరి, సంగం భాస్కర్, దాసరమోని సురేష్, ఎన్నుదుల మహేష్ పాల్గొన్నారు.