ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం బ్యాంకర్లతో సమావేశమయ్యారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం బ్యాంకర్లతో సమావేశమయ్యారు. రైతుల రుణమాఫీ, కొత్త రుణాల గురించి చంద్రబాబు వారితో చర్చించారు. కాగా రైతు సాధికారిక కార్పొరేషన్కు ఇచ్చే నిధుల ఆధారంగానే కొత్త రుణాలు మంజూరు చేస్తామని బ్యాంకర్లు చంద్రబాబుకు స్పష్టం చేశారు.
20 శాతం మేరకే కొత్త లోన్లు ఇస్తామని బ్యాంకర్లు చెప్పారు. రైతులకు అదనంగా రుణాలు మంజూరు చేయాలని చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రైతు రుణమాఫీ చేయనున్నట్టు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రైతుల రుణాలను ఇంకా మాఫీ చేయలేదు. విడతల వారీగా మాఫీ చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు.